క్యాంపుల్లోనే మంత్రులు, అధికారుల తిష్ట! ఏపీ సచివాలయంలో పడకేసిన పాలన! 

Publish Date:Jan 22, 2021

Advertisement

సచివాలయం.. రాష్ట్ర పరిపాలనకు కేంద్రం. పాలకులకు కార్యక్షేత్రం.  ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే జనాలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది సచివాలయం. కాని ఇప్పుడు అమరావతి సచివాలయాన్ని చూస్తే అంతా ఖాళీనే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రావడం లేదు.. దీంతో మంత్రులూ అటువైపు  చూడటం లేదు. ముఖ్యమంత్రీ, మంత్రుల బాటలోనే ఉన్నతాధికారులు సచివాలయం రావడం మానేశారు.సమస్యలు చెప్పుకోవడానికి ఎవరూ లేకపోతుండటంతో జనాలు కూడా సచివాలయం సంగతి మర్చిపోయారు. దీంతో  అమరావతి సచివాలయంలో పాలనంతా పడకేసింది. 

గతంలో అమరావతి సచివాలయం సందడిగా ఉండేది. అప్పటి సీఎం చంద్రబాబు  ఒకటో బ్లాకుకు ఉదయం పది గంటలకల్లా  వచ్చేవారు. రాత్రి పొద్దుపోయేదాకా ఉండి అనేక శాఖలపై సమీక్షలు నిర్వహించే వారు. ఆయనతోపాటు ఆయా శాఖల మంత్రులూ  పాల్గొనేవారు.  మంత్రులు కూడా తమ శాఖల ఉన్నతాధికారులతో సచివాలయంలోనే సమీక్షలు నిర్వహించేవారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొన్ని రోజులు సచివాలయం రద్దీగానే ఉండేది. ప్రతి మంగళవారం స్పందన కార్యక్రమంపై రివ్యూ నిర్వహించేవారు జగన్, కేబినెట్ సమావేశాలు ప్రతి 15 రోజులకోసారి జరిపేవారు. ఎస్ఎల్బీసీ సమావేశాలు సచివాలయంలోనే నిర్వహించేవారు. సీఎం రెగ్యులర్ గా వస్తుండటంతో ఉన్నతాధికారులంతా కంపల్సరిగా సచివాలయం వచ్చేవారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు కూడా కొన్ని నెలలగా రివ్యూ చేయడం లేదట. ఆ పథకాలు ఎవరికి అందుతున్నాయో, ఎలా ఇస్తున్నారో కూడా ఉన్నతాధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదంటే ..  ఏపీ సచివాలయంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించవచ్చు. 

కాని మూడు రాజధానుల ప్రతిపాదన రావడం... ఇంతలోనే కరోనా మహమ్మారి వెలుగుచూడటంతో సీన్ పూర్తిగా మారిపోయింది. గత 10 నెలలుగా మంత్రివర్గ సమావేశం ఉంటే మినహా... ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదు.  తాడేపల్లి  క్యాంపు కార్యాలయం నుంచే  ఆయన  పాలన సాగిస్తున్నారు. సమీక్షలు కూడా అక్కడి నుంచే చేస్తున్నారు. మంత్రులు కూడా  సచివాలయానికి  చుట్టపుచూపుగానే వస్తున్నారు.కేబినెట్‌ భేటీకి ఒకరోజు ముందు, తర్వాత... అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే హడావుడి చేస్తున్నారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసులో సీఎం నిర్వహించే సమీక్షలకు హాజరై... అట్నుంచి అటే వెళ్లిపోతున్నారు.   చివాలయంలో సొంత చాంబర్లు ఉన్నప్పటికీ... అనేక మంది మంత్రులు విజయవాడలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించాల్సి వచ్చినప్పుడు కూడా సచివాలయానికి రాకుండా తమ క్యాంపు కార్యాలయానికే వారిని పిలిపించుకుంటున్నారు. 

 వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా మంత్రుల దారిలోనే  సచివాలయానికి రాకుండా విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. కింది స్థాయి ఉద్యోగులను సచివాలయం నుంచి అక్కడికే పిలిపించుకుని సమీక్షలు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయానికి రావడం మానేశారు. సీనియర్‌ ఐఏఎస్ లు అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కరికాల వలవన్‌, ఏఆర్‌ అనురాధ, ప్రవీణ్‌ ప్రకాశ్‌, మధుసూదన్‌ రెడ్డి తదితరులు సొంతంగా క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకుని, అక్కడే సమీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పుడప్పుడు సచివాలయానికి వచ్చిపోతున్నారు. 

ఉన్నతాధికారులు రాకపోవడంతో సెక్షన్ ఆఫీసర్లకు సచివాలయంలో పని లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో వారంతా జాలీగా గడేపిస్తున్నారట. బయోమెట్రిక్ కావడంతో వారంతా సచివాలయానికి రావడం కంపల్సరి కాబట్టి వస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. లేదంటే అధికారుల బాటలోనే వీళ్లు కూడా సొంత క్యాంపులు ఏర్పాటు చేసుకునేవారనే సెటైర్లు పేలుతున్నాయి. సెక్షన్ ఆఫీసర్లు.. వాళ్ల కన్నా కింది స్థాయి ఉద్యోగులు సచివాలయం వస్తున్నా.. పనులేమి చేయడం లేదని చెబుతున్నారు. కొందరైతే మార్నింగ్ వచ్చి హాజరు వేయించుకుని వెళ్లిపోయి... తిరిగి ఈవెనింగ్ వచ్చి మళ్లీ పంచ్ చేస్తున్నారని చెబుతున్నారు. అధికారుల పేషీ దగ్గరకు వెళ్లి సార్ ఎప్పుడొస్తారని ఆరా తీస్తున్న జనాలకు ఉద్యోగుల నుంచి ఒకటే సమాధానం వస్తుందట. తమ సార్  క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే.. లేదంటే  సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నారనే చెబుతున్నారట. నిజానికి తమ ఉన్నతాధికారి ఎక్కడ ఉన్నారో ..ఆయన ఆఫీసు సిబ్బందికి కూడా తెలియడం లేదంటున్నారు. 

గతంలో ప్రతిరోజూ దాదాపు వెయ్యి మంది వరకు సందర్శకులు వివిధ పనుల కోసం సచివాలయం వచ్చేవారు. కాని ఇప్పుడు  అధికారులు లేక పనులు కాకపోవడంతో పదుల సంఖ్యలోనే వస్తున్నారని సచివాలయ లెక్కలు చెబుతున్నాయి. అమరావతి సచివాలయంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పందిస్తున్న కొందరు మాజీ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల స్థాయి అధికారులు సచివాలయంలో కాకుండా...  క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని, అక్కడి నుంచి విధులు నిర్వర్తించడం గతంలో ఎప్పుడు జరగలేదని చెబుతున్నారట. అధికారిక పర్యటనల్లో ఉన్నారా? లేదా క్యాంపు కార్యాలయాలకు వెళ్లారా? అనే విషయాన్ని సిబ్బంది స్పష్టంగా చెప్పలేకపోతుండటం మరీ దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.