అమరరాజా గ్రూప్ కు లోకేష్ ఆహ్వానం.. ఏపీ క్షమాపణ చెప్పాలంటూ ఎమోషనల్ ట్వీట్.!

Publish Date:Jul 16, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే కాకుండా, ఉభయ తెలుగు  రాష్ట్రాల వ్యాపార వర్గాల్లో ఇప్పుడో  భావోద్వేగ చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లా నేల నుంచి పుట్టి, దేశవ్యాప్తంగా తన బ్రాండ్ ఇమేజ్‌ను చాటిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అమరరాజా గ్రూప్, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తన అడుగులు బలంగా వేసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద దాదాపు 9 వేల 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక గిగా కారిడార్‌లో భాగంగా, తొలి కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను అమరరాజా యాజమాన్యం  ప్రారంభించింది.

ఈ ప్లాంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరరాజా అధినేత గల్లా జయదేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన ఒక పోస్ట్  అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. జయదేవ్ గల్లా సోషల్ మీడియాలో చేసిన  ఈ ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ సందర్భంగా లోకేష్ చేసిన ఎమోషనల్ కామెంట్స్  రెండు రాష్ట్రాల రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తున్నాయి. 

గల్లా జయదేవ్ ట్వీట్‌కు స్పందిస్తూ నారా లోకేష్..  ఏపీ మీకు క్షమాపణ చెప్పాలి గల్లా జయదేవ్ గారు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.   గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద పారిశ్రామిక విజయగాథలలో అమరరాజా కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాకుండా.. ఈ రాష్ట్ర ఆత్మగౌరవానికి  నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్న లోకేష్..  స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, చిత్తూరు జిల్లా పేరును ప్రపంచ చిత్రపటంలో సగర్వంగా నిలబెట్టిన ఘనత అమరరాజా సంస్థదేనన్నారు.

అయితే  జగన్ ప్రభుత్వ  హయాంలో ఈ సంస్థ ఎదుర్కొన్న రాజకీయ వేధింపులు, ఆటంకాలు   ఉండాల్సింది కాదనీ,  సొంత గడ్డపై పెట్టుబడులు పెట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని భావించిన ఒక  పారిశ్రామికవేత్తకు లభించాల్సింది ప్రోత్సాహం,  గౌరవం మాత్రమేనన్న.. లోకేష్, జగన్ హయాంలో అమరరాజా సంస్థకు, యాజమాన్యానికి  దక్కినవి బెద రింపులు, వేధింపులేనని పేర్కొన్నారు. లోకేష్ కామెంట్స్ తో జగన్ హయాంలో.. అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో..  పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. జగన్ హయాంలో అమరరాజా ఎదుర్కొన్న వేధింపులు ఒక ఆంధ్రుడిగా తనను  కలచివేశాయన్న లోకేష్ వ్యాఖ్యలతో పారిశ్రామిక వర్గం ఏకీభవిస్తున్నది.  

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   పారిశ్రామిక రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నదని లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  అమరరాజా ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో, అదే ఆంధ్రప్రదేశ్ గడ్డపై రాబోయే రోజుల్లో  ఆ సంస్థ కొత్త అధ్యాయాలు సృష్టిస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్న లోకేష్.. మా హృదయాలు, ఏపీ తలుపులు అమరరాజా కోసం ఎల్లప్పుడూ  తెరిచే ఉంటాయని పేర్కొంటూ.. నారా లోకేష్ గల్లా జయదేవ్‌ను ఏపీకి  హ్వానించారు. లోకేష్ ఈ ట్వీట్ ద్వారా.. రాజకీయాల వల్ల పారిశ్రామిక రంగం నష్టపోకూడదనే సందేశాన్నిచ్చారని పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

Amara Raja Batteries, Nara Lokesh Tweet, Galla Jayadev, Telangana Gigafactory, AP Investment Shift, Nara Lokesh Apology to Galla Jayadev 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.