అల్వాల్ నిత్య పెళ్లికొడుకు కేసులో సంచలన మలుపు

Publish Date:Jun 29, 2026

Advertisement

 

అల్వాల్‌లో సంచలనం సృష్టించిన 'నిత్య పెళ్లికొడుకు' కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి కుమార్ అలియాస్ రఫీపై పోలీసులు తాజాగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో రూపేష్ రాజ్‌ను A1గా, రవి కుమార్ అలియాస్ రఫీని A2గా చేర్చారు.

గత ఏడాది ఆగస్టు 28న నమోదైన ఈ కేసులో, జిమ్‌లో పరిచయమైన ఓ మహిళను నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆమె కారులో రహస్యంగా ట్రాకింగ్ డివైస్‌లు అమర్చి, ఆమె ప్రతి కదలికను లైవ్ ట్రాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, బాధిత మహిళతో పాటు ఆమె మైనర్ కుమార్తెను కూడా వేధింపులకు గురిచేసి, అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా సుమతి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ కేసును తిరిగి తెరిచి (రీ-ఓపెన్ చేసి) లోతైన దర్యాప్తునకు ఆదేశించారు. ఆ విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి రావడంతో కేసు మరింత తీవ్రమైంది. దర్యాప్తులో మరో సంచలన విషయం కూడా బయటపడింది. రవి కుమార్ అలియాస్ రఫీ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని పలువురు మహిళలను మోసం చేశాడనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా, గతంలో కూడా జిమ్‌కు వచ్చే మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు.
 

By
en-us Political News

  
సీఎం చంద్రబాబును కలిసిన వివిధ ఉద్యోగ సంఘాల నేతలు
దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన సాయికృష్ణ లాకప్ డెత్ ఉదంతంలో సోమవారం ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకుంది.
తెలంగాణ పోలీసు శాఖలో కీలక పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత భారీ తీపి కబురు అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏకైక రాజధానిగా అమరావతి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
వీబీజీ రామ్‌జీ చట్టంపై అభ్యంతరాలను కేంద్ర మంత్రికి వివరించిన సీత‌క్క‌..
దేశం మొత్తం ఏపీ విద్యా మోడల్ గురించే మాట్లాడాలి...
కేజీఎఫ్ చేతులెత్తేసిన చోట తవ్వకాలు సాధ్యమా...?
యావత్ దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీల పర్వం చోటుచేసుకుంది.
ఘాట్కేసర్‌లో అర్థరాత్రి వేళ చోటుచేసుకున్న ఘటన స్థానికులను కలవరానికి గురిచేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.