గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

Publish Date:Nov 5, 2025

Advertisement

ప్రపంచానికి దూరంగా విసిరేసినట్టు అడవిలో ఉండే గూడెం అనే గ్రామం అది. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. గూడెం గ్రామ ప్రజల ఇళ్ళలో నేటి వరకూ విద్యుత్ వెలుగులు లేవు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలైనా వారు పడుతున్న వెతలు బాహ్య ప్రపంచానికి తెలియవు. అలాంటి గిరిపుత్రుల సమస్యను ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  మనసుతో అర్థం చేసుకున్నారు. ఐదు నెలల్లోనే ఆ గిరిజన గ్రామంలో వెలుగులు నింపారు. గిరిపుత్రుల ముఖాల్లో ఆనంద కాంతులు వెల్లివిరిసేలా చేశారు. బుధవారం ఆ గ్రామంలో ఉన్న 17 ఇళ్ళకీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. కార్తీక పౌర్ణమి రోజున బయట వెన్నెల కాంతులు... గూడెం ప్రజల ఇళ్ళలో విద్యుత్ కాంతులు విరుస్తున్నాయి.
     

ఉప ముఖ్యమంత్రివర్యులకు వినతులు

అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం ఉంది. మండల కేంద్రానికి  50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది ఆ గ్రామం. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు అందటం లేదు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే గూడెం గ్రామస్తులు, రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. అడవి జంతువులు వచ్చి తమ ఊరి మీద పడతాయేమోనని భయంతో బతికేవారు. గతంలో ఎన్నోమార్లు అధికారులకు తమ సమస్యను చెప్పుకొన్నా పరిష్కారం లభించలేదు. 

అయిదు నెలల కిందట రాష్ట్ర డిప్యూటీ సీఎం దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. అడవితల్లి బాటతో గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మీరు మా గ్రామంలో విద్యుత్ కాంతులు నింపమంటూ కోరారు. తన ముందుకు వచ్చిన సమస్యను పరిష్కరించి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అల్లూరి జిల్లా కలెక్టర్ కి స్పష్టం చేశారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలి. సుమారు రూ. 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. 

దీంతో వారికో దారి చూపేందుకు ముందున్న దారులను పవన్ కళ్యాణ్ వెతికారు. ఈ సమస్యను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గొట్టిపాటి రవి కుమార్‌కి, ఏపీ జెన్కో సీఎండీలకు తెలియచేశారు. అవసరం అయితే కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని తక్షణం సమస్య పరిష్కరించాలని కోరారు. ఉపముఖ్యమంత్రిగారి సూచనతో భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది. 

9.6 కి.మీ... 217 స్తంభాలు 

రూ. 80 లక్షల పైగా అంచనా వ్యయంతో సుమారు 9.6 కిలోమీటర్ల మేర, 217 విద్యుత్ స్తంభాలు వేసుకుంటూ వెళ్లి 17 ఆవాసాలకు విద్యుత్ సరఫరా ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లు కూడా ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ కి అనుసంధానించారు. గూడెం గ్రామానికి విద్యుత్ లైను వేసేందుకు విద్యుత్ శాఖ ఒక యజ్ఞమే చేసింది. విద్యుత్ స్తంభాల రవాణా, పాతడం వంటి పనులు అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు. మానవ వనరులను ఉపయోగించి స్తంభాలు రవాణా చేయడం, రాతి కొండలను తవ్వేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మొదలు పెట్టిన 15 రోజుల్లోనే పనులు విజయవంతంగా పూర్తి చేశారు.

 పీఎం జన్మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్ తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రజలు నివసించే శిఖర ప్రాంతంలో విద్యుత్ వెలుగులను నింపేలా నిధులు కేటాయించిందని ఉప ముఖ్యమంత్రి  పవన్  తెలియచేశారు. 

సీఎం చంద్రబాబు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికి గూడెం గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడమే నిదర్శనం అన్నారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని గూడెం గ్రామంలో విద్యుత్ వెలుగులు నింపడానికి సహకరించిన విద్యుత్ శాఖ గొట్టిపాటి రవికుమార్ కీ, ఏపీసీపీఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్  పృథ్వి తేజకీ, విద్యుత్ శాఖ సిబ్బందికి ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  అభినందనలు తెలిపారు.
•    
గూడెం గ్రామంలో హర్షాతిరేకాలు

కనీసం సౌకర్యాలు లేని, విద్యుత్ కాంతులు లేని గూడెం గ్రామ గిరిజనులు బుధవారం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ వేడుకగా ఉన్నారు. తమ గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసిన గూడెం ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. తమ గ్రామానికి విద్యుత్ లైను వేయించి, తమ ఇళ్ళలో విద్యుత్ కాంతులు నింపిన  పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ గ్రామాన్ని యలమంచిలి శాసన సభ్యులు  సుందరపు విజయ్ కుమార్ , అరకు నియోజక వర్గం జనసేన నాయకులు, జన సైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు.  ఆ గ్రామస్తుల ఆనందోత్సాహాల్లో భాగమయ్యారు.


 

By
en-us Political News

  
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.