హత విధీ తెలుగు ఖ్యాతి అల్లూరి విగ్రహావిష్కరణ ఇలాగేనా?

Publish Date:Jul 5, 2022

Advertisement

ఆజాదీ కా అమృతోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రాముఖ్యతను ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయం చేసేసింది. తెలుగు ఖ్యాతికి రాజకీయ మకిలి పట్టించిన ఘనతను సొంతం చేసుకుంది.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోందన్న చందంగా ఎవరి దృష్టినీ ఆకర్షించని, ఎవరూ పట్టించుకోని కార్యక్రమంలా సాగింది. ప్రధాని మోడీ వచ్చి అల్లూరి 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించినా అదేదో వైసీపీకి చెందిన సొంత వ్యవహారంగానే రాష్ట్ర ప్రజలు భావించారంటే ఆ తప్పు జగన్ సర్కార్ దేనని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలకు అతీతంగా నిర్వహాస్తున్నామంటూ ఘనంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం ఈ కార్యక్రమాన్ని తన సొంత ఆధిపత్యం చాటుకోవడానికీ, తన రాజకీయ ప్రత్యర్థులను అవమానించడానికే జగన్ ఉపయోగించు కున్నారన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వెల్లువెత్తుతున్నాయి. చివరికి వైసీపీ శ్రేణులు కూడా తెలుగు జాతి గర్వించేలా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని జగన్ సర్కార్ అతి జోక్యం వల్ల   ఒక గల్లీ కార్యక్రమంగా మిగిలిపోయిందని బాహాటంగానే అంటున్నారు.

స్వాతంత్ర సమరయోధులలో అల్లూరిది ఒక ప్రత్యేక అధ్యాయం. తెలుగుజాతి పౌరుషాగ్ని రగిలించిన గొప్ప వ్యక్తిత్తం. కుల, మత, వర్గ, ప్రాంతీయ బేధాలకు అతీతంగా తెలుగువారంతా అల్లూరిని తమ గుండెల్లో కొలువుంచుకున్నారు. అటువంటి మహనీయుని 125వ జయంతి కార్యక్రమాన్ని జగన్ సర్కార్  రాజకీయం చేసి సాదాసీదాగా నిర్వహించేలా చేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరికీ ఆజాదీ కా అమృతోత్సవం కార్యక్రమం కనిపించలేదు. మన్యం వీరుడు అల్లూరి 125వ జయంతి స్ఫూర్తి గోచరించలేదు.

  ప్రొటోకాల్ ను, కోర్టు తీర్పులనూ కూడా లెక్క చేయకుండా జగన్ ను విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజును హాజరు కాకుండా నియంత్రించడానికి జగన్ ప్రభుత్వం పడిన తాపత్రేయం మాత్రమే కనిపించింది. అదే హైలైట్ అయ్యింది. మిగిలిన అన్నీ సోదిలోకి కూడా లేకుండా పోయాయి. ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరై అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాన అంశం కూడా డమ్మీగా మారిపోయింది.  ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రత్యర్థులను అవమానించేందుకే జగన్ సర్కార్ ఉపయోగించుకుంది. ఇది రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ మాత్రమే కాదు. ప్రతి తెలుగువాడి భావన కూడా. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఈ కార్యక్రమంలో బీజేపీ, వైసీపీ నేతల వినా మరెవరూ కనిపించలేదు. ఆహ్వానం పంపామని వైసీపీ చెబుతున్న తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి పేరు ఆహ్వానితుల జాబితాలో లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆహ్వానం లేఖ వచ్చినా ఆయన పేరు లేదని కలెక్టర్ విస్పష్టంగా చెప్పేశారు. దీంతో పిలిచి అవమానించారని అచ్చెన్నాయుడు అన్నారు.

జనసేన పరిస్థితి అదే. రాష్ట్రంలో మిత్రపక్షం అయినా సరే జగన్ సర్కార్ పై జనసేనాని విమర్శలు చేయడమే ఆ పార్టీ నేతలకూ, అధినేతకూ కూడా ఆహ్వానం అందకపోవడానికి కారణమని సామాన్యులు సైతం గుర్తించేశారంటే జగన్ సర్కార్ ఎంత బాహాటంగా తన రాజకీయ వైరాన్ని ప్రదర్శించిందో అవగతమౌతుంది.  

ఇక మరో ప్రధానమైన అంశం ఏమిటంటే మోడీ పర్యటన ముగించుకుని వెళుతుండగా ఎగిరిన నల్ల బెలూన్లు. ఒక వైపు మోడీ హెలికాప్టర్ మరో వైపు నల్ల బెలూన్లు సమాంతరంగా ఎగిరాయి. ప్రధాని పర్యటన సందర్భంగా ఈ స్థాయి నిరసన వ్యక్తం అవ్వడమంటే అది  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. రాజకీయ ప్రత్యర్థులను ఈ కార్యక్రమానికి రాకుండా చేయడంపై పెట్టిన దృష్టి మోడీ పర్యటన సందర్భంగా భద్రతపై పెట్టలేదన్నది స్పష్టమౌతోంది. ప్రధాని పర్యటన సందర్భంగా స్ధానికంగా నిరసనల అవకాశంపై పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి, నిరసనలు వ్యక్తం కాకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదీ, రాష్ట్ర పోలీసు, నిఘా శాఖలదే అనడంలో సందేహం లేదు.

అందుకే మోడీ హెలికాప్టర్ కు సమాంతరంగా నల్ల బెలూన్ల నిరసన రాష్ట్ర ప్రభుత్వ వైఫలమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే ఏపీలో మోదీ పర్యటనకు వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీ కూడా నిరసనలకు పిలుపు నివ్వలేదు. అల్లూరి తెలుగు స్ఫూర్తి కనుక ఆ కార్యక్రమానికి ఎటువంటి అవాంతరాలూ రాకూడదనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భావించాయి. తెలుగుదేశం అధినేత సహా రాజకీయ పార్టీలన్నీ అల్లూరి విగ్రహావిష్కరణను స్వాగతించాయి. ఒక్క వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మాత్రమే మోడీ పర్యటన సందర్బంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని ప్రకటించారు.  నల్ల బెలూన్లు ఎగిరాయి. అయితే పోలీసులు మాత్రం ఇది కాంగ్రెస్ నేత పని అని  చెబుతున్నారు.  అయితే ప్రధాని పర్యటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఎవరో నల్ల బెలూన్లు ఎగరేస్తే భద్రతా లోపం అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. 

By
en-us Political News

  
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.