Publish Date:Oct 21, 2024
అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏపీ ఎన్నికల సమయంలో తన నంద్యాల పర్యటేన సందర్భంగా తనపైన నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
ఇంతకీ అల్లు అర్జున్ పై నమోదైన కేసు ఏమిటంటే... నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల వేళ అల్లు అర్జున్ ఆయన నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా ఒక రోడ్ షో కూడా నిర్వహించారు. అయితే ఎన్నికల వేళ పోలీసు ఆంక్షలను ధిక్కరించి అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించినందుకు నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ తో పాటు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపైనా కేసు నమోదైంది. ఆ కేసునే క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.
అప్పట్లో అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులంతా తెలుగుదేశం కూటమికి మద్దతుగా నిలిచిన వేళ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దాదాపు మెగా ఫ్యామిలీ అంతా పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలిచింది. అటువంటి తరుణంలో తెలుగుదేశం కూటమి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, ర్యాలీ నిర్వహించడం సంచలనం సృష్టించింది. దీనిపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మెగా అభిమానులు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప2 సినిమాపై వారి ఆగ్రహం ప్రభావం తప్పకుండా పడుతుందన్న అభిప్రాయం కూడా అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడిప్పుడే ఆ ఆగ్రహం చల్లారుతోంది. పైగా నంద్యాలలో అల్లు అర్జున్ పై నమోదైనది చాలా చిన్న కేసు. పెద్దగా శిక్ష పడే అవకాశం ఉన్నది కూడా లేదు. అసలా కేసు పురోగతి ఎలా ఉందో కూడా ఎవరికీ తెలియదు.
అటువంటి సమయంలో ఇప్పుడు హఠాత్తుగా అదీ పుష్ప 2 రిలీజ్ కు ముందు ఆ కేసును క్వాష్ చేయాలంటూ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించడం కచ్చితంగా మెగాభిమానుల పాత గాయాలను కెలకడమే అవుతుంది. అల్లు అర్జున్ తన క్వాష్ పిటిషన్ ద్వారా పుష్ప2 రిలీజ్ ముందు అనవసరంగా ఇబ్బందులను కొని తెచ్చుకున్నారన్న భావన ఆయన అభిమానులలోనే వ్యక్తం అవుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-quash-petition-25-187162.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్