మూడూ ఒకటే.. జగన్ కు ఇక ఇక్కట్లే!

Publish Date:Mar 11, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ కు ఇక్కట్లు తప్పవా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా? కలవదా? కలిస్తే అది తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రయోజనమేనా?  బీజేపీపై ఏపీలో ఉన్న ఆగ్రహం కూటమిపై కూడా ప్రభావం చూపుతుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. పరిశీలకులు, కొన్ని సర్వేలు సైతం బీజేపీతో కలయిక తెలుగుదేశం పార్టీకి పెద్దగా లబ్ధి చేకూర్చే అవకాశాలు లేవనీ, ఏదో మేరకు నష్టం కూడా వాటిల్లే అవకాశాలున్నాయనీ పేర్కొన్నాయి. అయితే ఒక సారి తెలుగుదేశం, జనసేన కూటమితోనే ఏపీలో కలిసి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్న తరువాత జరిగిన పరిణామాలను గమనిస్తే, ఆ అనుమానాలన్నీ దూది పింజెల్లా తేలపోయాయి. 2019 ఎన్నికల తరువాత ఏపీ విషయంలో బీజేపీ తొలి సారిగా తన వాస్తవ బలం ఏమిటన్నది గుర్తించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ ఎన్ని సీట్లు సాధించుకున్నా.. ఎన్ని స్థానాలలో పోటీ చేసినా.. ఆయా స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేనలే. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే బీజేపీకి ఏపీలో ఒక్కటంటే ఒక్క శాతం ఓటు స్టేక్ కూడా లేదు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే.. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులూ లేరు. పోటీ చేసే స్థానాలలో బూతు ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి.

అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం, మరో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలు బలంగా ఉండటంతో.. రాష్ట్ర ప్రయోజనాలను, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహకారాన్నీ దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యింది. ఆ పార్టీ పొత్తు విషయంలో నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూసింది. ఒక సారి బీజేపీ కూడా తమ కూటమితో కలిసి వస్తుందన్న నిర్ణయం జరిగిపోగానే.. తెలుగుదేశం, జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లి రాష్ట్రంలో పరిస్థితిని, కూటమి గెలుపు అవకాశాలనూ ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూలంకషంగా వివరించారు. గత ఐదేళ్లుగా ఏపీలో బీజేపీలోని ఒక వర్గం వ్యవహరించిన తీరు కారణంగా బీజేపీ రాష్ట్రంలోని అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన ప్రజలలో బలంగా ఉందని సోదాహరణగా వివరించారు.

ఆ కారణంగా ప్రజలలో బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అంతే బలంగా బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ పార్టీ అగ్రనేతలకు అర్ధమయ్యేలా వివరించగలిగారు. ఆ కారణంగానే బీజేపీ పెద్దలు ఏపీతో పొత్తుల విషయంలో తెలుగుదేశం, జనసేన కూటముల అభిప్రాయాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పొత్తు కారణంగానే కనీసం ఒక్కశాతం ఓటు కూడా లేని కమలం పార్టీకి ఏవో కొన్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు దక్కనున్నాయన్న సంగతి బీజేపీ పెద్దలకు స్పష్టంగా తెలుసు. అలా కాకుండా అధికార పార్టీతోనే  అంటకాగుతున్నామన్న భావన కలిగేలా కూటమితో కలవకపోయినా, అధిక స్థానాలు డిమాండ్ చేసి పొత్తు పొసగకపోవడానికి కారణమైనా ఏపీలో కనీస ప్రాతినిథ్యం కూడా ఉండే అవకాశం లేదని బీజేపీ అగ్రనాయకత్వానికి స్పష్టంగా తెలుసు. ఆ విషయాన్ని పరిగణనలోనికి తీసుకునే పొత్తు విషయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొందరు చేసిన అతి ప్రకటనలను పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా, పొత్తులో భాగంగా తమకు వచ్చిన స్థానాలలో కూడా తెలుగుదేశం, జనసేనలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే నిలపడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించడమే ఆ పార్టీ వాస్తవిక పరిస్థితులను గ్రహించే పొత్తుకు ముందుకు వచ్చిందన్న సంగతి స్పష్టంగా అవగతమౌతుంది. 

ఎందుకంటే ఇంత కాలం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న అధికార వైసీపీపై కాకుండా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విపక్ష తెలుగుదేశంపై పోరాడిందన్న భావన ప్రజలలో బలంగా ఉంది. అలా ఉండటానికి కారణం బీజేపీ ఏపీ నాయకులలో కొందరు చేసిన అతే కారణమనడంలో సందేహం లేదు. అదే విధంగా ఏపీ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ చూసీ చూడనట్లు వదిలేసిందన్న భావన కూడా ప్రజలలో ఉంది. జగన్ సర్పంచ్ లకు తెలియకుండానే పంచాయతీరాజ్ నిధులను డ్రా చేసుకుని ఇతర అవసరాలకు వాడేయడం వంటి వ్యవహారాలను కేంద్రం సీరియస్ గా తీసుకోకపోవడంతో జనంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోందన్న భావన ఏర్పడింది. 

ఏపీ విషయంలో నాన్ సీరియస్ గా వ్యవహరించడం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు పొరపాట్లను సవరించుకుని, రాష్ట్ర పార్టీలో వైసీపీ అనుకూల శక్తుల పట్ల సీరియస్ గా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ బీజేపీలోని వైసీపీ అనుకూల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దన్న తెలుగుదేశం, జనసేన కూటమి షరతుకు అంగీకరించింది.  ఈ నేపథ్యంలోనే పార్టీలో వైసీపీ అనుకూల నేతలుగా ముద్రపడిన సోము వీర్రాజు, జీవీఎల్ సహా ఎవరికీ వచ్చే ఎన్నికలలో పోటీకి అవకాశం ఉండదని బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు తొలి నుంచీ హిందూపురం లోక్ సభ స్థానం నుంచి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పక్కన పెట్టేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  ఏపీ నుంచి బీజేపీ అభ్యర్ధులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన వారికి మాత్రమే కమలం పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించిందని అంటున్నారు.  బీజేపీ అభ్యర్థులుగా తాము ఎవరికి టికెట్ ఇచ్చినా వారు గెలవాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేన ఓట్లతోనే అన్న వాస్తవాన్ని గుర్తెరిగిన కమలనాథులు.. ఆ రెండు పార్టీలకూ ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.  

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.