భేటీకి సిద్ధం..!

Publish Date:Dec 26, 2022

Advertisement

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మళ్లీ తెలుగుదేశం పార్టీ గుటికి తిరిగి వెళ్లిపోతారా? ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. తెలంగాణలో సైకిల్‌ని సవారీ చేయిస్తారా? అందుకోసం ఆయిన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో ఆయిన తనదైన శైలిలో పావులు కదుపుతోన్నారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలే అందుకు సాక్ష్యమని వారు వివరిస్తున్నారు.    

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఒకటి ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట సభ నిర్వహించడం... ఆ సభ కాస్తా సూపర్ సక్సెస్ కావడం.. ఈ సభకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడం.. అలాగే ఈ సభా వేదికపై నుంచి పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా సరే.. తిరిగి రావొచ్చునంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీని వదిలి వెళ్లిన వారి గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో పేర్కొంటున్నారు.  

ఇక రెండోవది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు.. సూపర్ సీనియర్లంతా.. తమకు కాకుండా... నిన్న కాక మొన్న పార్టీలోకి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టారంటూ.. హస్తం పార్టీలోని కురు వృద్దులంతా తనదైన శైలిలో అసమ్మతి గళం విప్పడం.. ఆ క్రమంలో ధర్నాలు, నిరసనలు, దాడులు.. ప్రతి దాడులకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం.. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల మాజీ బాధ్యుడు, హస్తం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. ఎదుటే పంచాయతీ పెట్టడం.. దీంతో వారందరినీ ఈ డిగ్గీరాజా కూల్‌గా.. సైలెంట్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.   

ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులంతా.. తమ పదవులకు రాజీనామా చేసి.. హస్తం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారని.. అదీకాక పీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీ వీడి.. బీజేపీలోకి జంప్ కొట్టగా.. త్వరలో ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం కాషాయం కండువా కప్పుకోనేందుకు సమయత్తమయ్యారని.. వారు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.  

మరోవైపు తొలుత రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారని.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయిన వరుస విజయాలను సైతం అందుకున్నారని.. కానీ రాష్ట్ర విభజన జరగడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తం పార్టీ గుటికి చేరాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా సోదాహరణగా విపులీకరిస్తున్నారు.  

అలా హస్తం పార్టీలోకి వెళ్లిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌గా ఢిల్లీ అధిష్టానం పగ్గాలు అప్పగించిందని.. అయితే తెలంగాణ తెచ్చింది కారు పార్టీ అధినేత కేసీఆరే అయినా.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ అంటూ ప్రజల్లోకి వెళ్లి బలంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్న హస్తం పార్టీ నేతలకు.. రేవంత్ రెడ్డి ఓ బలమైన గొంతుకగా మారారని.. ఆ క్రమంలో ఆయిన హస్తం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ పేరుతో సభలు, పాదయాత్రలు చేస్తూ.. తెలంగాణలో ఆ పార్టీని కాంగ్రెసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారని ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తన బహిరంగ సభలకు లక్షలాది మంది ప్రజలను రేవంత్ రెడ్డి స్వచ్చందంగా రప్పించుకోగలుగుతోన్నారు కానీ.... పార్టీలోని నేతలను మాత్రం ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీలోనే ఉండి.. ఆ పార్టీ నేతలతో చెయ్యి.. చెయ్యి కలిపి.. కలిసి నడవడం కంటే.. సైకిల్ పార్టీలోకి వెళ్లిపోయి.. తన పాత మిత్రులతోపాటు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి జీవులను సైతం మళ్లీ పసుపు పార్టీలోకి తీసుకు వచ్చి.. వారందరిని ఏకం చేసి.. అడుగులో అడుగు వేసుకొంటూ కలిసి నడిస్తే.. సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చుననే ఓ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.  

అదీకాక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కి ఆయన ప్యామిలీకి ఇప్పటికే బీజేపీతో వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉందని... అలాగే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారడంతో.. ఆ పార్టీలోని తెలంగాణను వదిలేసి.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిపోయారంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్‌చల్ చేస్తోందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఇలాంటి సమయంలో బీజేపీకి ఏమో కానీ.. సైకిల్ పార్టీకి మాత్రం మంచి బలం పుంజుకోనే సమయమని వారు విశ్లేషిస్తున్నారు. ఓ వేళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని వీడి..తన పాత పార్టీలోకి వెళ్లితే.. సైకిల్ పార్టీ దెబ్బకు కారు పార్టీ.. తెలంగాణలో షికారు చేయడం కష్టమని.. అలాగే కాషాయ పార్టీ నేతలకు సైతం అసలు సిసలు బొమ్మ.. ఈస్ట్‌మన్ కలర్‌లో పోలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో ఓ అంచనా వేసి మరీ  చెబుతున్నారు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.