అక్కడా.. ఇక్కడా.. రెండు చోట్లానా?.. గజ్వేల్, కామారెడ్డిపై సర్వత్రా ఉత్కంఠ!

Publish Date:Nov 8, 2023

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి గజ్వేల్ తో పాటు మరో నియోజకవర్గం కామారెడ్డి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుచుంటున్నట్లు ప్రకటించిన క్షణం నుంచే ఆయన గజ్వేల్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలోనూ, రాజకీయ వర్గాలలోనూ బలంగా వ్యక్తమయ్యాయి. కామారెడ్డి ప్రజలు కోరినందునే అక్కడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించినా ఆ అనుమానాలు నివృత్తి కాలేదు. అది వేరే సంగతి ఇక ప్రస్తుతానికి వస్తే.. కేసీఆర్ కు గజ్వేల్ లోనూ, కామారెడ్డిలోనూ కూడా గట్టి పోటీయే ఎదురైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయనకు గట్టి ప్రత్యర్థి అని అంటున్నారు. అలాగే కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారని అంటున్నారు. 

 దీంతో కేసీఆర్ పరిస్థితి నిన్నటి దాకా ఒక లెక్క..ఇక నుంచీ మరో లెక్క అన్నట్లుగా తయారైంది. ఎన్నికల వ్యూహాలలోనూ ఎత్తుగడలలోనూ తిరుగులేదని ఇంత కాలం కేసీఆర్ విషయంలో ఆయన ప్రత్యర్థులు కూడా చెబుతూ ఉండేవారు. అయితే ఈ సారి ఎన్నికలలో మాత్రం ఆయనకే అందనంత వేగంగా కాంగ్రెస్ వ్యూహాలు ఉంటున్నాయి. ఆయన ఒక అడుగు వేసే లోగా రేవంత్ సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మూడడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ కూడా వ్యూహాత్మకంగా గజ్వేల్ నుంచి ఈటలను రంగంలోకి దింపడంతో రెండు చోట్లూ కూడా కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అనివార్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సారి ఎన్నికలలో ఆయన రెండు నియోజకవర్గాలలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుండటంతో.. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలపై పూర్తిగా కాన్సన్ ట్రేట్ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు.  

ముందుగా గజ్వేల్ నియోజవకర్గం తీసుకుంటే.. ఇక్కడ ఈటల సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో అడుగు కలిపి నడిచిన ఈటల ఈ తరువాత కేసీఆర్ సర్కార్ లో రెండు సార్లూ కూడా కీలక పదవులను నిర్వహించారు. ఈటలను మంత్రిపదవి నుంచి తప్పించిన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో  ఈటలను ఓడించేందుకు కేసీఆర్ పన్నని వ్యూహం లేదు. ఆ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందు నెలల నుంచే మొత్తం పార్టీని అక్కడ మోహరించిన కేసీఆర్ ఈటల ఓటమికి పావులు కదిపారు. వ్యూహాలు రచించారు. అయితే  ఈటల వాటన్నిటినీ తిప్పి కొట్టారు. 

మంత్రులూ, ఎమ్మెల్యేలూ సీనియర్ నాయకులూ అంతా హుజూరాబాద్ లోనే తిష్ట వేసి ఈటల ఓటమి కోసం పని చేసినా ఫలితం లేకపోయింది. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. దీంతో అప్పట్లో   ఆ గెలుపు ఈటల విజయం కంటే.. కేసీఆర్ ఓటమిగానే పరిశీలకులు అభివర్ణించారు. ఇప్పుడు అదే ఈటల గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రత్యర్థిగా నిలబడ్డారు. దీంతో హుజూరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇక్కడ రేవంత్ పోటీ కేసీఆర్ ను ఎందుకు గాభరాపెడుతోందో తెలుసుకోవాలంటే.. ముందుగా ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉందే. నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ ను జైలుకు పంపిన సందర్భంలోనే రేవంత్ కేసీఆర్ ను  గద్దె దింపడమే లక్ష్యమని ప్రతిన పూనారు. ఒక నాయకుడు ప్రతిన పూనినంత మాత్రాన కేసీఆర్ లాంటి బలమైన నేత కంగారుపడతారా అన్న అనుమానం రావచ్చు. కానీ తెలంగాణలో రేవంత్ బలమైన నాయకుడిగా ఎదిగారు. వరుసగా రెండు ఎన్నికలతో డీలాపడిన, అంతర్గత కుమ్ములాటలూ, వలసలతో రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కూడగట్టడమే కాకుండా, పూర్వవైభవం సంతరించుకోవడం తథ్యమని పార్టీ శ్రేణులలో విశ్వాసం కలిగేలా చేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రం కాంగ్రెస్ రేవంత్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందు ఉనికి కోసం పాకులాడుతున్న పార్టీగా  ఉండేది. కానీ ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత మాత్రం అధికారానికి ఉరకలేసే స్థాయికి పెంచారు. పార్టీలో అంతర్గత కలహాలను నివారించారు. అసంతృప్తి జ్వాలలను చల్లార్చారు. ఈ నేపథ్యంలోనే  కామారెడ్డిలో రేవంత్ పోటీతో కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడక అయితే కాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  దీంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం ఎలా ఉండబోతోందన్న దానిపై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా మొదలైనట్లు చెబుతున్నారు. కేసీఆర్ రెండు చోట్లా గెలుస్తారా.. లేక ఒక చోటా.. లేక రెండు స్థానాలలోనూ ప్రతికూల ఫలితం వస్తుందా? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.