ఆ ఎనిమిది మందీ మరణించారు.. జేసీ అసోసియేట్స్ ఓనర్
Publish Date:Feb 27, 2025
Advertisement
ఎస్సెల్బీసీ సోరంగంలో చిక్కుకున్న ఎనమండుగురు కార్మికుల వ్యవహారం విషాదాంతమైంది. వారెవరూ బతికి లేరని ఆ టన్నల్ కాంట్రాక్టర్ పనులు చేస్తున్న జేసీ అసోసియేట్స్ ఓటర్ ప్రకాష్ చెప్పారు. గురువారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో 50 మందికి పైగా పని చేస్తున్నారు. వారిలో ఎనిమిది మంది వినా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరురోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, వారు బతికి ఉండే అవకాశాలు లేవనీ చెప్పారు. టన్నల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరు రోజులుగా చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గురువారం రెస్క్యూ బృందాలు టన్నెల్ చివరి వరకు వెళ్లగలిగారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో వారెవరూ ప్రాణాలతో లేరని నిర్ధారణ అయ్యిందని కాంట్రాక్టర్ చెప్పాడు. వారంతా బురదలో కూరుకుపోయి మరణించి ఉంటారని అన్నారు. ఇక ఇప్పుడు వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంట్రాక్టర్ అన్నారు. ప్రమాదం జరిగిన తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వస్తోంది. అయినా ఎక్కడో ఏదో చిన్న ఆశ. అదృష్టం కలిసి వచ్చి వారు ప్రాణాలతో ఉంటారన్నఅంతా భావించారు. రెండు రోజుల కిందటే రెస్క్యూటీమ్ వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు మృగ్యమని చెప్పేశారు. ఇప్పుడు అదే విషయాన్ని టన్నెల్ కాంట్రాక్టర్ ప్రకాష్ మీడియా ముఖంగా చెప్పారు.
సొరంగంలో చిక్కుకుపోయిన ఎనమండుగురు కార్మికులను రక్షించేందుకు గత ఆరు రోజులుగా ఆర్మీ,ఎస్టీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ శతథా ప్రయత్నించాయి. ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగారు. బండరాళ్లు,బురద నీరు,శిథిలాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
http://www.teluguone.com/news/content/all-eight-workers-died-25-193527.html





