ఆ ఎనిమిది మందీ మరణించారు.. జేసీ అసోసియేట్స్ ఓనర్

Publish Date:Feb 27, 2025

Advertisement

ఎస్సెల్బీసీ  సోరంగంలో చిక్కుకున్న ఎనమండుగురు కార్మికుల వ్యవహారం విషాదాంతమైంది. వారెవరూ బతికి లేరని ఆ టన్నల్ కాంట్రాక్టర్ పనులు చేస్తున్న జేసీ అసోసియేట్స్ ఓటర్ ప్రకాష్ చెప్పారు. గురువారం (ఫిబ్రవరి 27) మీడియాతో మాట్లాడిన ఆయన  ఈ ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్లో 50 మందికి పైగా పని చేస్తున్నారు. వారిలో ఎనిమిది మంది వినా మిగిలిన అందరూ సురక్షితంగా బయటపడ్డారన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరురోజులుగా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయనీ, వారు బతికి ఉండే అవకాశాలు లేవనీ చెప్పారు.

టన్నల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గత ఆరు రోజులుగా చేసిన, చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గురువారం  రెస్క్యూ బృందాలు టన్నెల్ చివరి వరకు వెళ్లగలిగారు. అయినా వారి ఆచూకీ లభించకపోవడంతో వారెవరూ ప్రాణాలతో లేరని నిర్ధారణ అయ్యిందని కాంట్రాక్టర్ చెప్పాడు. వారంతా బురదలో కూరుకుపోయి మరణించి ఉంటారని అన్నారు. ఇక ఇప్పుడు వారి మృతదేహాలను వెలికితీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని  కాంట్రాక్టర్ అన్నారు.  ప్రమాదం జరిగిన తరువాత రోజులు గడుస్తున్న కొద్దీ వారు ప్రాణాలతో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వస్తోంది.

అయినా ఎక్కడో ఏదో చిన్న ఆశ. అదృష్టం కలిసి వచ్చి వారు ప్రాణాలతో ఉంటారన్నఅంతా భావించారు. రెండు రోజుల కిందటే రెస్క్యూటీమ్ వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు మృగ్యమని చెప్పేశారు. ఇప్పుడు అదే విషయాన్ని టన్నెల్ కాంట్రాక్టర్ ప్రకాష్ మీడియా ముఖంగా చెప్పారు. 
 సొరంగంలో చిక్కుకుపోయిన ఎనమండుగురు కార్మికులను రక్షించేందుకు గత ఆరు రోజులుగా ఆర్మీ,ఎస్టీఆర్ఎఫ్,ఎన్డీఆర్ఎఫ్ శతథా  ప్రయత్నించాయి.   ర్యాట్ హోల్ మైనర్లు రంగంలోకి దిగారు. బండరాళ్లు,బురద నీరు,శిథిలాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడటంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.    

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.