బీడువారిన పొలాలు.. ఎండిన బావులు.. కరువు మిగిల్చే కన్నీటి కథలు.!

Publish Date:Oct 23, 2026

Advertisement

ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది. రాబోయే 2027 నాటికి దేశంలో భయంకరమైన కరువు ముప్పు పొంచి ఉందన్న పర్యావరణ వేత్తల హెచ్చరికలు గుండెల్ని పిండేస్తున్నాయి. కేవలం వర్షాభావమే కాదు, సరైన ప్రణాళిక లేకపోవడం, జవాబుదారితనం లోపించడం వల్ల రాబోయే రోజుల్లో తాగునీటి కోసం, పూట గూడు కోసం జనం పడే పాట్లు తలచుకుంటేనే కన్నీళ్లు ఆగవు. నేడు పట్టణాల్లోనే అక్టోబర్, నవంబర్ మాసాల్లో అపార్టుమెంట్లు నీళ్ల కోసం కటకటలాడుతున్న దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. 

ఈ నేపథ్యంలో తెలుగు వన్‌ ఎండీ కంఠమనేని రవిశంకర్, జమీన్ రైతు ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్‌తో కలిసి వాస్తవ వేదిక కార్యక్రమంలో రాబోయే కరువు ముప్పుపై  క్లుప్తంగా విశ్లేషణ చేశారు. ఇక రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల పరిస్థితి, రైతుల దయనీయ స్థితి మరింత దారుణంగా మారనుంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో కృష్ణా, తుంగభద్ర, కావేరి నదుల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోతుండటంతో కరువు ఛాయలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సాగునీరు అందక అన్నదాత కన్నీరు మున్నీరు అవుతుంటే, మరోవైపు కూరగాయలు, బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 

ఒకవైపు దేశంలో 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వాలు ఘనంగా చెప్పుకుంటున్నాయి. అంటే అర్థం ఏమిటి? దేశంలో సగానికి పైగా జనం పూట గడవక, తిండికి లేక అలమటిస్తున్నారనే కదా నగ్న సత్యం? ఎఫ్.సి.ఐ (FCI) గోదాముల్లో నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు ఎలుకలపాలవుతున్నా, సరిగ్గా సరఫరా చేసే లాజిస్టిక్స్  సప్లై చైన్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఒకచోట పండన పంటలు కుళ్లిపోతుంటే, మరోచోట ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు.

వరి పంట వేయొద్దంటున్న ప్రభుత్వాలు, ప్రత్యామ్నాయంగా ఏ పంట వేయాలో రైతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వట్లేదు. పరిశోధనల పేరుతో కోట్లాది రూపాయలు విడుదలవుతున్నా, క్షేత్రస్థాయిలో రైతులకు ఒరిగేదేమీ లేదు. పాలకుల ఉదాసీన వైఖరి, ప్రణాళికా లోపం వెరసి సామాన్యుడి జీవితాన్ని అగమ్యగోచరంగా మారుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, రాబోయే ముప్పును ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టకపోతే.. అన్నం గింజ కోసం, గుక్కెడు నీళ్ల కోసం జరిగే అంతులేని క్షామం మనలను కబలించడం ఖాయం.

 

 

[ 2027 drought, Krishna river water shortage, El Nino effect, FCI godowns, farmer problems, Telugu news, drinking water problem, agricultural crisis, food security, government negligence, Telugu One news ]

By
en-us Political News

  
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యున్నత గౌరవం దక్కింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరో వాతావరణ గండం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రకృతిని ఎదిరించి జీవించడం ఎవరికీ సాధ్యం కాదని, దానితో ఘర్షణకు దిగితే మానవాళి తీవ్ర విపత్తులను ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హితవు పలికారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.