అనుబంధాలే ఇతివృత్తాలుగా

Publish Date:Aug 14, 2020

Advertisement

ఆలిస్ రివాజ్ (14 ఆగస్టు 1901 - 27 ఫిబ్రవరి 1998)

 

అనునిత్యం తన జీవితంలో కనిపించే వ్యక్తులే ఆమె అక్షరాల్లో ఒదిగిపోయారు. నవలల్లో పాత్రధారులుగా మారి పాఠకులను అలరించారు. విభిన్నమనస్తత్వాలతో కూడిన వ్యక్తుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను ఒకవైపు చెబుతూనే మరో వైపు స్త్రీవాదాన్ని అంతర్లీనంగా తన నవలల్లో ప్రతిబింబించారు. ఆమే స్విస్ రచయిత ఆలిస్ రివాజ్. స్విట్జర్లాండ్ ఇరవయ్యవ శతాబ్దపు ప్రధాన రచయితలలో ఒకరు.

 

స్విస్ మునిసిపాలిటీ లోని రోవ్రేలో  14 ఆగస్టు 1901న ఆలిస్ జన్మించారు. పాల్ గోలే, ఇడా ఎట్లర్ దంపతుల ఏకైక సంతానం ఆమె. తండ్రి ఉపాధ్యాయుడు. సోషలిజంపై ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తిని వదిలి రచయితగా మారాడు. దాంతో వారి కుటుంబం లాసాన్ కు వెళ్లింది. ఆలిస్ కు సంగీతం అంటే చాలా ఇష్టం. పియానో నేర్చుకున్నారు. ఆ తర్వాత ఆమె ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో చేరారు. అప్పటివరకు తల్లిదండ్రుల్లో కలిసి నివరించిన ఆమె 25 సంవత్సరాల వయసులో రివాజ్ జెనీవాకు వెళ్లారు, అక్కడే చివరి వరకు ఉన్నారు.

 

అంతర్జాతీయ కార్మిక సంస్థతో చాలా సంవత్సరాలు పనిచేసిన తరువాత ఆలిస్ రచనారంగం వైపు మళ్లారు. ఆమె మొదటి నవల నౌజేన్ డాన్స్ లా మెయిన్ (క్లౌడ్స్ ఇన్ యువర్ హ్యాండ్స్) 1937 లో ప్రచురితమైంది. మరో నవల జేట్టీ టోస్ పెయిన్ (కాస్ట్ యువర్ బ్రెడ్) నవల కూడా ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. అత్యుత్తమ రచనగా  అవార్డులు అందుకుంది. ఆమె రచనలు కళలు, కుటుంబంలోని అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు స్త్రీవాద ధోరణి అంతర్లీనంగా ఉంటుంది. నవలలు, చిన్న కథలు, వ్యాసాలు, డైరీలతో పాటు ఆమె కవి జీన్-జార్జెస్ లోసియర్ గురించి కూడా అధ్యయనం చేసింది.  

 

ఆలిస్ రచనల ద్వారా చాలా తక్కువ కాలంలోనే  స్విట్జర్లాండ్ లోని  ఫ్రెంచ్ భాషా రచయితలలో అగ్రగామిగా నిలిచారు. ఆలిస్ రివాజ్ 27 ఫిబ్రవరి 1998న  96 ఏండ్ల వయసులో మరణించారు. ఆమె రచనలు స్విస్ నేషనల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. ఆమె పేరు మీద జెనీవాలో ఒక వీధి, కళాశాల ఏర్పాటు చేశారు. అంతేకాదు 2002 నుంచి ఆలిస్ రివాజ్ అన్న పేరుతో ఇంటర్ సిటీ రైలు కూడా అక్కడ నడుస్తోంది. ఆమె పేరు ప్రజల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయింది.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.