ఆలీ .. కాట్రవల్లి.. కల తీరేనా?

Publish Date:May 11, 2023

Advertisement

జగమెరిగిన కమెడియన్ అలీ గురించి కొత్తగా పరిచయం అక్కరలేదు.  బాలా నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన  అలీ వటుడింతై అన్నట్లు ఎదుగుతూ.. వందల్లో కాదు, వేల సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా ఒకటో రెండో (ఇంకా ఎక్కువో కూడా) సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అలాగే, అలీ ...తో సరదాగా .. కార్యక్రమంతో టీవీ యాంకర్  గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ని మాటలు ఎందుకు గానీ,తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్నారు. సందేహం లేదు.

అంతవరకు అయితే, ఓకే కానీ, ఈలోగా ఆలీని రాజకీయ పురుగు కుట్టింది. సినిమా విజయాలతో సంతృప్తి చెందని ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు.  నిజానికి ఆలీ రాజకీయలకు కూడా కొత్తకాదు. ఎంతో కాలంగా ఆయన పొలిటీషియన్’ అయిపోవాలని కలలు కంటున్నారు.కాస్ట్యూమ్స్ గట్రా రెడీ చేసుకున్నారు. అప్పుడెప్పుడో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, లంచ్’కి పిలిచి త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, కొత్త బొత్తాలు కుట్టించుకుని మరీ రెడీ అయి పోయారు. అయితే  ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా పట్టుకోవాలని, ఆలీ ఎప్పటి నుంచో కలలు కంటూనే ఉన్నారు. ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్  కట్టబెట్టిన జగన్  అలీ అశలను నెరవేర్చారా? అంటే లేదు ఉసూరు మనిపించారనీ అలీ అభిమానులు అంటున్నారు.

అలీ రాజకీయ ప్రవేశం ట్రయల్స్  తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నించడంతో మొదలయ్యాయి.  అప్పట్లో టీడీపీ తరఫున రాజమండ్రి నుంచి టికెట్ ఖరారైపోయిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే  ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తరువాత తెలిసింది. యిక ఆ తరువాత అలీ సినిమా పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పుకునే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తలంచారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన రెండూ పార్టీలకు బాగా దగ్గరగా ఉన్న అలీ.. కేవలం ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యే అయిపోవాలన్న ఆశతోనే.. ఆ రెండు పార్టీలలో టికెట్ రాదన్న కన్ఫర్మ్ చేసుకున్న తరువాత అనూహ్యంగా జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.  

వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే  ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు.  పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీరిగ్గా మూడేళ్లు గడిచిపోయిన తరువాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్  ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. అప్పటికే అన్ని ఆశలూ వదిలేసుకున్న జగన్ సలహాదారు పదవితో సంబరపడిపోయి.. తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు.  సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్ళూ చేసేశారు.  
అదలా ఉండే యిప్పుడు ఏపీలో మళ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు యింకా ఏడాది సమయం ఉన్నా.. ముందస్తు ఉహాగానాల నేపథ్యంలో  ఆశావహులు తమతమ పార్టీల అధినేతలను ప్రసన్న చేసుకుని టికెట్ కన్ఫర్మ్ చేయించుకోవడానికి ప్రయత్నాలను షురూ చేసేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అలీకి వైసీపీ నుంచి పోటీ చేయడానికి టికెట్ లభిస్తుందా? అందుకోసం ఆయన ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? అన్న సందేహాలు సహజంగానే అలీ అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి. 

అలీ అయితే రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీకి ఫిక్స్ అయిపోవడమే కాకుండా  ఇప్పటికే నాలుగు నియోజకవర్గాలను సెలక్ట్ చేసుకుని సర్వేలు కూడా చేసి అధిష్టానానికి ఓ నివేదిక ఇచ్చారని అంటున్నారు. ఇందులో గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలు ఉన్నాయనీ ఈ నాలుగు  నియోజకవర్గాల్లో ఏ చోట నుంచి పోటీ చేసినా సరే కచ్చితంగా గెలుస్తాననే ధీమా అలీకి ఉందట. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే అలీ చెప్పినదంతా విన్న జగన్.. ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదట.  

తల్లినీ, చెల్లినే కాదు పొమ్మన్న వైసీపీ అధినేత జగన్   అలీకి పార్టీ టికెట్ ఇస్తారా?  రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి తర్వాత తండ్రి అంతటి బాబాయ్ నే పక్కకు  తప్పించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్ రెడ్డి అలీ  కి ఎన్నికలలో పోటీకి అవకాశం కల్పిస్తారా? అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే అలీ ఆశిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటికే హేమాహేమీలు పోటీకి రెడీగా ఉన్నారు.  మరి వారిని కాదని  జగన్  అలీకి టికెట్ ఇస్తారా?  ఒక వేళ ఇస్తే  గన్  ప్రభుత్వం ఎదుర్కుంటున్న వ్యతిరేక సునామీలో  కొట్టుకుపోకుండా నిలబడగలరా? నిలబడి గెలవగలరా అన్న అనుమానాలు ఆయన అభిమానుల్లో వ్యక్తమౌతున్నాయి.  మొత్తం మీద అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో అయిన వాళ్లని కాదనుకుని మరీ జగన్ పంచన చేరిన అలీ తన ఎన్నికల్లో పోటీ ఆశ ఈ సారైనా నెరవేరుతుందా? చూడాలి.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.