లోకేష్ ఓఎస్డీగా ఆకుల వెంకటరమణ
Publish Date:Aug 1, 2024
Advertisement
మంత్రి నారా లోకేష్ కు ఓ ఎస్ డి గా ఆకుల వెంకటరమణ నియమితులయ్యారు. ఆకుల వెంకటరమణ గతంలో తూర్పుగోదావరి జిల్లా చింతూరు ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా పనిచేసారు. ఆ సమయంలో అక్కడ గిరిజనుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఎంతో కృషి చేశారు. అనంతరం కడప జిల్లా బద్వేల్ రెవెన్యూ డివిజన్ లో ఆర్డీవో గా సమర్థవంతంగా పనిచేసి అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజల ప్రశంసలు పొందారు. ఆకుల వెంకటరమణ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన గ్రూప్ 1 పోటి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించి యువతి, యువకులకు మార్గదర్శకంగా నిలిచారు. తన తల్లిదండ్రులు ఆకుల శ్రీరాములు, లక్ష్మీ నరసమ్మ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి మార్కాపురం పట్టణంలో గ్రంధాలయాన్ని సొంతంగా స్థాపించి తద్వారా పోటీ పరీక్షలకు హాజరయ్యే యువతీ, యువకులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందజేసి వారి అభిమానాన్ని పొందుతున్నారు.మంత్రి లోకేష్ ఓఎస్డిగా ఆకుల వెంకటరమణ నియమితులు కావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/akula-venkataramana-as-lokesh-25-181977.html





