ఆసియా క‌ప్ ..బాబ‌ర్‌, బ్రాడ్‌కాస్ట‌ర్ల‌పైనా  అక్ర‌మ్ మండిపాటు

Publish Date:Aug 31, 2022

Advertisement


ఆసియా కప్‌లో దుబాయ్ ఇంట ర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో ప్రారంభమైన బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ వసీం అక్రమ్ ఆదివారం పాక్ జట్టుకు  ప్లేయింగ్ ఎలెవన్‌ను  వూహించిన‌దానికి మ‌రోలా చూప‌డం ప‌ట్ల‌ ప్రసారకర్తలపై ఆగ్ర‌హించాడు.  నిజానికి పాకిస్తాన్ ప్ర‌క‌టించిన‌ ప్లేయింగ్ లెవెన్‌తో అక్రమ్ ఉప్పొంగిపోయాడు. అతను అంగీకరించి నట్లుగా, ఆట ప్రారంభానికి ముందు జట్టు బ్యాటింగ్ కోచ్ మహ్మద్ యూసుఫ్ ద్వారా అతనికి తెలియజేశారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు స్క్రీన్‌పై చూపించిన వాటిని అతను పరిశీలించి నప్పుడు, షానవాజ్ దహానీ స్థానంలో పాకిస్తాన్ హసన్ అలీని ఎంపిక చేయడంపై అతను మండిప‌డ్డాడు.

పాకిస్థాన్ లెవెన్‌తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు షానవాజ్ దహానీ జ‌ట్టులో ఉండాల‌నుకున్నాన‌ను...కానీ హసన్ అలీ ఆడుతున్నాడు, రౌఫ్ ఆడుతున్నాడు. నేను దహానీ ని తీసుకున్నార‌నుకున్నప్పటికీ, అతను జట్టులో లేడు. కుర్రాళ్లూ, ఇది ప్లేయింగ్ లెవెన్ అని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారా? దహానీ ఆడుతున్నాడని యూసుఫ్ నాకు చెప్పాడు. కాబట్టి బ్యాటింగ్ కోచ్‌కు తెలియకపోతే ఎక్కడో తప్పు ఉంద‌ని అక్ర‌మ్ అన్నాడు.

టీవీ ప్రెజెంటర్ మయాంటి లాంగర్, కొన్ని నిమిషాల తర్వాత, అక్రమ్‌తో  జ‌ట్టు లెవెన్‌లో లోపం గురించి చెప్పాడు, అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ అక్ర‌మ్ ప్రసారకర్తలపై మరోసారి విరుచుకుపడ్డాడు. నన్ను సంతోషంగా ఉంచవద్దు, తప్పు జట్టును అక్కడ ఉంచే వ్యక్తిని సంతోషంగా ఉంచండి అబ్బాయిలు. ఇది పెద్ద ఆట, ఇది చిన్న తప్పు కాదు. ఇప్పుడు బాగానే ఉంద‌న్నారాయన.

దీనికి తోడు భారత్‌పై ఓటమికి కెప్టెన్ బాబరే కారణమని  పాక్ ఫ్యాన్స్ ఇప్పటికే మండిప‌డుతున్నారు. ఇలాంటి టీ20 తరహా పిచ్ తనకు ఇష్టమని అక్ర‌మ్‌ పేర్కొన్నాడు. రెండు వైపులా బౌలర్లు బౌన్సర్లు సంధించడం, వికెట్లు తీయడం చూసి ఆనందించా నన్నాడు. చివరి ఓవర్ వరకు గేమ్ కొనసాగడడం బాగుందన్న అక్రమ్.. 13 లేదంటే 14వ ఓవర్‌లో నవాజ్‌ను దించాల్సింద న్నాడు. అప్ప‌టికే చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డాడు. చివరి మూడు నాలుగు ఓవర్లలో మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటివారు క్రీజులో ఉన్నప్పుడు నవాజ్‌ చేతికి బంతిచ్చి బాబర్ తప్పుడు చేశాడని అక్రమ్ పేర్కొ న్నాడు.

By
en-us Political News

  
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.