శివసేన బాటలో అన్నా డిఎంకే.. శుభం కార్డ్ సిద్ధం

Publish Date:Jun 23, 2022

Advertisement

మహారాష్ట్రలో శివసేన నిట్టనిలువునా చీలి పోయింది. ఆ ప్రహసనం అలా సాగుతుండగానే, తమిళ నాడులో  అన్నా డిఎంకే’ లో ఫైట్ మొదలైంది. అఫ్కోర్స్ ..ఇది కొత్తగా మొదలైన కొట్లాట కాదు.  పార్టీ అధినాయకురాలు, మాజీ  ముఖ్యంత్రి  జయలలిత చనిపోయిన నాటి నుంచే, పార్టీలో పన్నీరుసెల్వం (ఓపీఎస్), పళనిస్వామి (ఈపీఎస్) వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఆలా సాగుతూనే ఉంది. అధికారంలో ఉన్నంతవరకు ఒకరు ముఖ్యమత్రి, ఇంకొకరు ఉప ముఖ్యంత్రిగ కొనసాగినా, అప్పుడు కూడా  రెండు వర్గాలు ఎవరి కుంపటి వారిదే అన్నట్ల్గు సంసారం సాగించారు . అప్పటి  నుంచి మధ్య మాటల యుద్ధం అయితే సాగుతూనే వుంది. అదే విధంగా సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో అన్నా డిఎంకే ఓడిపోయింది. అయినా, పార్టీ పై పట్టు కోసం ఉభయ వర్గాల మధ్య ఫైట్ కొనసాగుతూనే వుంది. 

ఈ  నేపధ్యంలో, ‘ఏక నాయకత్వం’ కోసం ఓపీఎస్,ఈపీఎస్ వర్గాల మధ్య  సాగుతున పోరుకు ముగింపు పలికేందుకు ఏర్పాటు చేసిన, ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశంలో ఓపీఎస్ టార్గెట్’గా ఈపీఎస్ వర్గం ఒక విధంగా భౌతిక దాడికి దిగింది. వాటర్ బాటిల్స్ విసిరి .. గో బ్యాక్ నినాదాలతో లోపలకు రాకుండా అడ్డుకుంది. ఈసంధర్భంగా ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఓపీఎస్ తమ వర్గం కార్యకర్తలను వెంట పెట్టుకుని వెనుదిరిగి పోయారు. జులై 11న మళ్లీ సర్వసభ్య సమావేశం జరపాలని అన్నాడీఎంకే నిర్ణయించింది. అదే రోజున కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరపాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. ఈ వివాదం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా, రెండు వర్గాల  మధ్య సాగుతున్న ప్రత్యక్ష పరోక్ష పోరు ఈరోజు కాకపోతే, రేపైనా పార్టీని రెండు ముక్కలు చేస్తుందని, రాజకీయ పరిశీలకులు  భావిస్తునన్నారు.

ఒక విధంగా ఒంటరి అయిపోయిన అన్నాడీఎంకే సమన్వయకర్త ఓపీఎస్ తదుపరి నిర్ణయమేంటన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో కీలకమైన జిల్లా కార్యదర్శుల్లో 90 శాతం ఈపీఎస్‌ వైపు చేరడంతో ఆ బృందం చెప్పింది వినడం మినహా ఓపీఎస్‏కు మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది.అయితే, ఇక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదు. ఇంకా వుంది. అంతే కాదు, ఈ పొలిటికల్ డ్రామాలో ఇంకా పాత్ర లున్నాయి.

2016లో అప్పటి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన అనంతరం ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న ఓపీఎస్‏ కొద్దిరోజులకే కుర్చీ కొల్పోయారు. శశికళ దయతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎడప్పాడి పళనిస్వామి. ఆ తరువాత ఢిల్లీ పెద్దల అండతో పార్టీపైనా పట్టు సాధించారు. అయితే, ఇప్పడు పళనిస్వామికి ఢిల్లీ  పెద్దల ఆశీస్సులు పెద్దగా లేవంటున్నారు. మరో వంక శశికళ  పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు, గట్టిగా పావులు కదుపుతున్నారు. 

ఈ అన్నిటినీ, మించి బీజేపీ  అనూహ్యంగా జనంలోకి దూసుకు పోతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సారధ్యంలో అన్నాడీఎంకేని పక్కన పెట్టే స్థాయిలో బీజేపీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తోందని అంటున్నారు. మరోవంక పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి పెట్టింది ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు  మురుగన్’ కు  యూపీ (?) నుంచి రాజ్య సభకు పంపి కేంద్ర మంత్రి  వర్గంలో స్థానం కల్పించారు. ఈ పరిణామాలను గమనిస్తే, మహా రాష్ట్రలో శివసేన .. తమిళ నాడులో  అన్నా డిఎంకే  ఒకే బాటలో నడుస్తున్నాయి.  బీజేపీ స్క్రిప్ట్  ప్రకారం  నడుస్తునం రెండు పార్టీల  సినిమాకు .. శుభం కార్డు పడినట్లే అంటున్నారు.

By
en-us Political News

  
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.