విమాన ప్రమాదంపై ప్రముఖుల దిగ్భ్రాంతి

Publish Date:Jun 12, 2025

Advertisement

 

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌లో తన అకౌంట్ డీపీ & కవర్ పీక్‌ను నలుపు రంగులోకి  మార్చింది. కాగా ఈ ప్రమాద నేపథ్యంలో ఎయిర్ ఇండియాపై నెట్టింట విమర్శస్తున్నాయి. లండన్ వెళ్లే  విమాన పరిస్థితిని చెక్ చేయకుండా టేకాఫ్ చేస్తారా అంటు నెటిజన్లు మండిపడుతున్నారు. విమాన ప్రమాదంలో పెద్దసంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై  ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో నేలకూలిన విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నడిపినట్లు DGCA వెల్లడించింది. ఆయనకు 8200 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. అలాగే కోపైలట్‌గా 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. ATC ప్రకారం మ.1.39 గం.కు విమానం అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయింది. వెంటనే ATCకి ఎమర్జెన్సీ కాల్ వెళ్లింది. ఆ తర్వాత విమానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 110 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేతలు  రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణీకులు మరియు సిబ్బంది కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆందోళన ఊహించలేనిదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయం చేయడానికి తమ వంతు కృషి చేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. ఈ విమాన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడాలని ఆయన కోరారు. సహాయక చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని కేంద్రానికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు సంఘీభావంగా ఈరోజు తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సభ ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
 

By
en-us Political News

  
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.