తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన లేడీ అఘోరీ శ్రీకాళహస్తి దేవాలయంలో హైడ్రామా క్రియేట్ చేశారు. దేవాలయంలో ప్రవేశించే సమయంలో అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. ఆలయ నిబంధనల ప్రకారం వివస్త్రను అనుమతించబోమని చెప్పడంతో గొడవ ప్రారంభమైంది. అఘోరీలు వివస్త్రగానే దేవాలయంలో ప్రవేశిస్తారని అక్కడున్న సిబ్బందికి తెలిపారు. అయినా వినకపోవడంతో అక్కడ్నుంచి తన కారు వద్దకు వెళ్లి క్యాన్లో ఉన్న పెట్రోల్ వంటిపై పోసుకున్నారు. కారుపై కూడా పెట్రోల్ చల్లడంతో హైటెన్షన్ నెలకొంది. సిబ్బంది అఘోరీపై నీళ్లు గుమ్మరించి వస్త్రాలు తొడిగారు. పెద్ద పెద్దగా అఘోరీ కేకలు వేయడంతో దేవాలయానికి సంబంధించిన అంబులెన్స్ లో అఘోరీని కూర్చొబెట్టారు. అక్కడ్నుంచి ఎపి బార్డర్ తరలించారు. చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తికి తమిళనాడు దగ్గర కావడంతో అంబులెన్స్ చెన్నయ్ వైపు వెళ్లినట్లు సమాచారం. మంచిర్యాల నుంచి తెలంగాణ బార్డర్ దాటించిన పోలీసులు తాజాగా ఎపి పోలీసులు తమిళనాడు పంపించడంతో తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హైడ్రామా ముగిసినట్టయ్యింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aghori-suicide-attempt-in-srikala-hasti-25-188025.html
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.