ఏపీ మద్యం కుంభకోణం కేసు.. నాగేశ్వరరెడ్డి తరువాత సిట్ విచారణకు జగన్?

Publish Date:May 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌  మద్యం కుంభకోణం కేసు   కీలక మలుపు తిరిగింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాగిన ఈ భారీ కుంభకోణంపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం  విచారణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులుగా భావిస్తున్న పలువురు వైసిపి నేతలను దర్యాప్తు అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించి, వారి నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను సేకరించారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ  ఈ కుంభకోణంలో కేవలం అవినీతి మాత్రమే కాకుండా భారీగా మనీ లాండరింగ్ వ్యవహారాలు కూడా జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమవుతుండటం గమనార్హం. దాంతో ఈ కేసులో  కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగ ప్రవేశం చేసింది. అదలా ఉంటే..  సిట్ తాజాగా  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్  వ్యక్తిగత సహాయకుడు (పీఏ) నాగేశ్వర్ రెడ్డిని విచారించారు.  

విజయవాడలో గురువారం (మే 28) సిట్ అధికారులు నాగేశ్వర్ రెడ్డిని ఏకంగా తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా, ఏకధాటిగా ప్రశ్నించారు. ఈ 9 గంటల మారథాన్ విచారణలో అధికారులు నాగేశ్వర్ రెడ్డి వ్యక్తిగత మరియు అధికారిక బ్యాంక్ ఖాతాల లావాదేవీల చిట్టాను పూర్తిగా పరిశీలించారు. అంతేకాకుండా.. గత ఐదేళ్ల కాలంలో ఆయన తన కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు,   బినామీల పేర్ల మీద కొనుగోలు చేసిన స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు కూపీలాగారు. నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగేశ్వర్ రెడ్డి సీఎం పీఏగా చక్రం తిప్పారని, ఆయన మాటకు అప్పట్లో తిరుగులేకుండా పోయిందని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం ఉంది. ఇదే అండతో ఆయన మద్యం పాలసీ రూపకల్పనలో, మద్యం కంపెనీల నుంచి ముడుపుల వసూళ్లలో కీలక పాత్ర పోషించారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మద్యం కుంభకోణం ద్వారా అక్రమంగా ఆర్జించిన కోట్లాది రూపాయల సొమ్ముతోనే నాగేశ్వర్ రెడ్డి తన భార్య, పిల్లలు,  బంధువుల పేర్లపై విలువైన భూములు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గత కొంతకాలంగా నాగేశ్వర్ రెడ్డి కదలికలపై నిఘా ఉంచిన సిట్' అధికారులు, పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఆయన్ను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా నాగేశ్వరరెడ్డిని శుక్రవారం (మే 29) కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం సాగుతున్న ఈ పూర్తి స్థాయి విచారణ ముగిసిన  అనంతరం ఆయనను అరెస్టు చేసే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఒకవేళ జగన్ కు అత్యంత నమ్మకస్తుడైన పీఏ నాగేశ్వర్ రెడ్డి గనుక అరెస్ట్ అయితే, ఈ కేసులో తదుపరి టార్గెట్ నేరుగా  జగన్ అవుతారా? అన్న ఉత్కంఠ రాజకీయవర్గాలలో వ్యక్తమౌతున్నది.  

By
en-us Political News

  
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.