ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం రైల్వేల చరిత్రలోనే అతి పెద్ద ప్రమాదాలలో ఒకటి అన్నది నిస్సందేహం. అయితే ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందంటూ సాక్షాత్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పడం సంచలనం సృష్టిస్తోంది. ప్రమాద కోణంపై దర్యాప్తునకు సీబీఐ విచారణకు ఆదేశించడమూ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైల్వే శాఖ, కేంద్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన ప్రతి సారీ రైల్వే శాఖ కుట్ర కోణం ఉందని చెప్పడం పరిపాటిగా మారిపోయిందని ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆ కుట్ర కోణానికి మతపరమైన మసాలా జోడించి దేశంలో విద్వేషాలు రగిలేలా సామాజిక మాధ్యమంలో పోస్టుల వెనుకే నిజమైన కుట్ర ఉందని ఆయన సామాజిక మాధ్యమం వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
రెండు రైల్వే పోలీసు డిస్ట్రిక్ట్స్ కు ఎస్పీగా, ఒడిశా రైల్వే పోలీసు అదనపు డీజీపీగా పని చేసిన అనుభవం ఉన్న నాగేశ్వరరావు మరో ట్వీట్ లో ఎప్పుడు రైలు ప్రమాదం జరిగినా.. ఆ ప్రమాదం వెనుక ఉన్నరైల్వే వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలచ్చడానికి, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి రైల్వే అధికారులు వ్యూహాత్మకంగా ‘కుట్ర’ జరిగిందంటూ ప్రకటనలు గుప్పించడం పరిపాటేనని పేర్కొన్నారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇంత కాలంగా విజయవంతంగా రైల్వే శాఖ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న ఎత్తుగడగా ఆయన అభివర్ణించారు. ప్రస్తతం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంపై సామాజిక మాధ్యమంలో విద్వేషం పెచ్చరిల్లేలా వస్తున్న వార్తల నేపథ్యంలో సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఆయన వ్యాఖ్యలు రైల్వే శాఖనే కాకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నట్లుగా ఉండటంతో ఇప్పుడు కేంద్రం ఎలా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును తప్పుపడుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ప్రమాదానికి కారకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అంతే కానీ దర్యాప్తుల పేరుతో కాలయాపన జరపడం తగదని ఖర్గే ఆ లేఖలో పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కేసును అప్పగించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది. అలాగే మల్లికార్జున్ ఖర్గు ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో భద్రతా ప్రమాణాలను గాలికొదిలేసి.. దర్యాప్తునకు ఆదేశించి చేతులు దులుపుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. సిబ్బంది కొరత, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వైఫల్యం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/after-every-accident-railway-says-it-is-conspiracy-39-156402.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.