అఫ్గాన్ వ్యవహారాలో పాక్ జోక్యం.. ఇరాన్ సీరియస్ వార్నింగ్ 

Publish Date:Sep 7, 2021

Advertisement

తాలిబన్ల హస్తగతమైన అఫ్గానిస్థాన్‌ లో పరిస్థితి రోజు రోజుకు భయంకరంగా మారుతోంది. ఇంచుమించుగా 20 ఏళ్లుగా ప్రజలకు అండగా ఉన్నామన్న సాకుతో,ఆ దేశం పై ఆధిపత్యం చెలాయించిన అమెరికా, చేతులు కడుక్కుని, చివరి సైనికుని కూడా చంకనెత్తుకుని చెక్కేసింది. ప్రస్తుత పరిణామాలతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తోంది. మరో వంక రష్యా, చైనాసహా ప్రపంచ దేశాలు ఆఫ్గాన్ వ్యవహారాలలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. ఈ నేపధ్యంలోతాలిబన్లతో పాక్ చేతులు కలిపింది. 

తాలిబన్ల అరాచకాలకు   పాక్ ముష్కరుల అకృత్యాలు తోడు కావడంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు వీధుల్లోకి వచ్చి,నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే, తాలిబన్లు నిరసన ప్రదర్శనలను ఎక్కడికక్కడ అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాదు, తాలిబన్లు ప్రముఖులు, మహిళలు లక్ష్యంగా గతంలో కంటే ఇప్పడు ఎక్కువగా దాడులకు దిగుతున్నారు. బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుతోంది. ఆఫ్గాన్ ప్రజల్లో తమ దేశ వ్యవహారాల్లో పాకిస్థాన్‌ జోక్యం చేసుకుంటుందనే ఆందోళన మొదలయ్యింది. నిరసన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ తాలిబన్లను కలవడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది. 

అఫ్గాన్‌లో పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందనే ఆందోళన అఫ్గాన్‌ వాసుల్లో ఎక్కువయ్యింది. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న అఫ్గాన్‌ మహిళలు.. ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసేందుకు అఫ్గాన్‌ వీధుల్లోకి వస్తున్నారు. నిరసనలో భాగంగా కాబుల్‌లోని పాక్‌ రాయబార కార్యాలయంతో పాటు అక్కడి అధ్యక్ష భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహం చెందిన తాలిబన్లు నిరసన జరుగుతోన్న ప్రాంతంలో గాల్లోకి కాల్పులు జరిపి నిరసన చేస్తోన్న మహిళలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

తాలిబన్‌లు ఆఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తర్వాత పాకిస్థాన్‌ ఇంటర్‌-సర్వీసెన్‌ ఇంటెలిజెన్స్‌(ISI) డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ హమీద్‌ అఫ్గానిస్థాన్‌లో పర్యటించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అక్కడ అఫ్గాన్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించనున్న తాలిబన్‌ నాయకుడు ముల్లా అబ్దుల్‌ బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌ కలవడంతో ఆందోళన ఎక్కువైంది. వాటిపై స్పందించిన తాలిబన్‌లు.. బరాదర్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌ కలిసిన మాట వాస్తవమేనన్నారు. అయితే, కేవలం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో భాగంగానే పాక్‌ నిఘా విభాగాధిపతి తమ అగ్రనేతతో భేటీ అయినట్లు తాలిబన్ల అధికార ప్రతినిధులు వెల్లడించారు. కానీ, అఫ్గాన్‌ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం పాకిస్థాన్‌తో పాటు ఏ ఇతర దేశాల జోక్యాన్ని అనుమతించమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో పాక్‌ జోక్యం, తాలిబన్ల తీరును నిరసిస్తూ అఫ్గాన్‌ మహిళలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.