అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి కొండంత అండ అడ్వ‌కేట్‌ ముర‌ళీధ‌ర్‌రావు

Publish Date:Aug 2, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది? అన్నది 2019 సంవ‌త్స‌రం నుంచి నిన్న‌మొన్నటి వ‌ర‌కు స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న ఇది. కానీ ఇప్పుడు ఆ ప్ర‌శ్న‌కు సమాధానం దొరికింది. అమ‌రావ‌తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఇటీవ‌ల‌ బ‌డ్జెట్ లో అమ‌రావ‌తి రాజ‌ధానికి రూ. 15000 కోట్ల నిధుల‌ను  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దీంతో అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, వీరి సంతోషం వెన‌క ఐదేళ్ల‌లో ఎన్నో పోరాటాలు ఉన్నాయి. క‌న్నీటి గాధ‌లు ఉన్నాయి. కంటి నిండా స‌రిగా నిద్ర‌పోయిన రోజులు త‌క్క‌ువ‌నే చెప్పొచ్చు. ఇందుకు కార‌ణం మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 2019లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కాద‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తెర‌పైకి తీసుకొచ్చాడు. అప్ప‌టి నుంచి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని దాదాపు నాలుగున్నరేళ్లుగా అమరావతి పరిరక్షణ సమితి పేరుతో ఆ ప్రాంత రైతులు ఉద్యమించారు. ఈ క్ర‌మంలో రైతులు పోలీసుల లాఠీ దెబ్బ‌లు తిన్నారు.. వైసీపీ మూకల రాళ్ల దెబ్బ‌లు తిన్నారు. అయినా వెన‌క్కు త‌గ్గ‌లేదు. మ‌రోవైపు అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు రైతులు కోర్టుల‌ను   ఆశ్ర‌యించారు. రైతుల త‌రుపున కోర్టుల్లో వాద‌న‌లు వినిపించి వారికి అండ‌గా నిలిచారు హైకోర్ట్ సీనియ‌ర్ అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీధ‌ర్ రావు. కోర్టుల్లో వైసీపీ ప్ర‌భుత్వ మూడు రాజధానుల నిర్ణ‌యంపై ఆయ‌న సాగించిన పోరాటం అమ‌రావ‌తి ఉద్య‌మ ఘ‌ట్టంలో చిర‌స్థాయిగా నిలిచిపోతుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

 తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న న్యాయ‌వాది ఉన్నం ముర‌ళీధ‌ర్ రావు. హైకోర్టులో కేసులు వాదించ‌డంకోసం రోజుకు ల‌క్ష‌ల్లో ఫీజు వ‌సూళ్లు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం క‌లిగిన లాయ‌ర్ ఆయ‌న‌. అయితే, అమ‌రావ‌తి రైతులు చేస్తున్న న్యాయ‌మైన పోరాటంలో ముర‌ళీధ‌ర్ రావు వారికి అండ‌గా నిల‌బ‌డ్డారు. అమ‌రావ‌తే ఏపీకి ఏకైక రాజ‌ధాని అంటూ రైతుల త‌ర‌పున‌ హైకోర్టులో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వాదించారు. హైకోర్టులో రైతుల త‌ర‌పున వాద‌న‌లు వినిపించినందుకు ఆయ‌న ఒక్క‌రూపాయి కూడా తీసుకోలేదు. కోర్టుల్లో ప్ర‌భుత్వం కుట్ర‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొడుతూ రైతులు త‌మ‌ పోరాటంలో విజ‌యం సాధించ‌డంలో త‌న‌వంతు పాత్ర‌ను ముర‌ళీధ‌ర్ రావు స‌మ‌ర్థ‌వంతంగా పోషించారు. స‌త్యం, న్యాయం, ధ‌ర్మం రైతుల వైపు ఉన్నాయి.. చివ‌రికి అవే గెలుస్తాయ‌ని ముర‌ళీధ‌ర్ రావు మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నారు. ఐదేళ్ల వైసీపీ హ‌యాంలో విశాఖ ప‌ట్ట‌ణానికి రాజ‌ధాని త‌ర‌లిపోకుండా ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుల ద్వారా స్టేలు తీసుకొస్తూ ప్ర‌భుత్వం దూకుడుకు ముర‌ళీధ‌ర్‌రావు బ్రేక్ లు వేశారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణానికి భూములిచ్చిన‌ రైతుల‌కు అప్ప‌టి టీడీపీ ప్ర‌భుత్వం  ప్ర‌తీయేటా కౌలు చెల్లించేలా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆ కౌలును కూడా చెల్లించ‌లేదు. దీంతో  రైతు పరిరక్షణ సమితి, రైతు సమాఖ్య తరపున దాఖ‌లైన పిటీష‌న్ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగిన సంద‌ర్భంలో.. ఈ పిటీషన్‌లకు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాదుల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వాదనలపై రైతుల తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో రైతులకు కౌలు చెల్లించాలని వేసిన పిటీషన్‌లకు విచారణ అర్హత ఉందని కోర్టు స్ప‌ష్టం చేయ‌డంతో ప్ర‌భ‌త్వానికి ఎదురు దెబ్బ త‌గిలింది. ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంతో.. సీఎం చంద్ర‌బాబు రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగించాలని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఎలాగూ వచ్చే ఐదేళ్ల పాటు రాజధాని నిర్మాణం కొనసాగడం ఖాయం కాబట్టి ఈ ఐదేళ్లలో వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కౌలు గడువును మరో ఐదేళ్ల పాటు ప్ర‌భుత్వం పెంచ‌నుంది. 

అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకునేందుకు రైతులు పాద‌యాత్ర ద్వారా పోలీసుల లాఠీల‌కు ఎదురెళ్లి  వైసీపీ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తే.. అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీద‌ర్‌రావు ఎప్ప‌టిక‌ప్పుడు కోర్టుల ద్వారా ప్ర‌భుత్వం కుట్ర‌ల‌ను అడ్డుకుంటూ  రైతుల పోరాటానికి కొండంత అండ‌గా నిలిచారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కుట్ర‌ల నుంచి అమ‌రావ‌తి రాజ‌ధానిని కాపాడుకోవ‌టంలో రైతుల పోరాటాన్ని ప్ర‌జ‌లు ఏ విధంగా గుర్తుచేసుకుంటున్నారో.. కోర్టుల ద్వారా ముర‌ళీధ‌ర్ రావు పోరాటంపైనా అదేస్థాయిలో ప్ర‌జ‌లు ప్ర‌శంస‌లు గుప్పిస్తున్నారు. ఇటీవ‌ల‌ అడ్వ‌కేట్ ఉన్నం ముర‌ళీధ‌ర‌రావుకు అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌గా.. వాషింగ్ట‌న్ డీసీలో ప్ర‌వాసులు ఘ‌నంగా స‌త్క‌రించారు. అమ‌రావ‌తి రైతుల పోరాటాన్ని, వారికి అండ‌గా నిలుస్తూ కోర్టుల్లో ముర‌ళీధ‌ర్ రావు సాగించిన పోరాటాన్ని ప్ర‌వాసులు కొనియాడారు. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తి రైతులు ముర‌ళీధ‌ర్ రావుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. ఉద్య‌మంలో అండ‌గా నిలిచినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.