అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణ అవినీతి మయం.. అనుమానాలే కాదు.. ఆధారాలూ ఉన్నాయా?

Publish Date:Nov 21, 2024

Advertisement

అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక  రాజకీయ అండదం డలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది. ఇప్పుడే కాదు గతంలోనూ అదానీ అవినీతి వ్యవహారాలపై పలు ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన హిడెన్ బర్గ్ అనే పరిశోధనా సంస్థ గతంలో పలు మార్లు అదానీ వ్యాపార సామ్రాజ్యం అతి వేగంగా విస్తరించడం వెనుక మనీలాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ వంటి నేరాలు ఉన్నాయని ఆరోపిస్తూ నివేదికలు వెలువరించింది. తన నివేదికలకు ఆధారంగా స్విట్జర్ ల్యాండ్ విచారణ నిగ్గు తేల్చిన అంశాలను ప్రస్తావించింది. స్విట్జర్ ల్యాండ్ ఆ దేశంలో అదానీ గ్రూపునకు చెందిన పలు బ్యాంక్ అక్కౌంట్లను సీజ్ చేసిందని పేర్కొంది. అలా స్విట్జర్ ల్యాండ్ లో సీజ్ అయిన అదానీ అక్కౌంట్లలో 2600 కోట్ల రూపాయలు ఉన్నాయని హిడెన్ బర్గ్ గతంలో పేర్కొంది. అందుకు ఆధారంగా అక్కడి అంటే స్విట్జన్ ల్యాండ్ క్రిమినల్ కోర్డు రికార్డుల నుంచి సేకరించిన సమాచారాన్ని పేర్కొంది. అంతే కాకుండా వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో కూడా అదాని అనుబంధ సంస్థ పెట్టుబడులు ఉన్నాయనీ, అవన్నీ కూడా మనీల్యాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీల ద్వారా జమ చేసినవేనని ఆరోపించింది. 

అయితే సహజంగానే అదానీ గ్రూపు ఆ ఆరోపణలను ఖండించింది.  అయితే అప్పట్లో హిడెన్ బర్గ్ నివేదిక వెలువడిన తరువాత మార్కెట్ లో అదానీ షేర్ల విలువ భారీగా పతనమైంది. అప్పట్లోనే.. అంటే హిడెన్ బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకూ  ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అదాని, ఆ నివేదిక వెలువడిన స్వల్ప వ్యవధిలోనే  26వ స్థానానికి పడిపోయారు. అలాగే అదానీ గ్రూప్ షేర్ల విలువ కూడా భారీగా పతనమైంది. నివేదిక వెలువడిన నెల రోజుల వ్యవధిలో అదానీ సంపద 11లక్షల కోట్లకు పైగా ఆవిరైంది. అప్పట్లో అదానీపై హిడెన్ బర్గ్ అక్కౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల విలువ కృత్రిమంగా పెంచడం, మనీ ల్యాండరింగ్, అవినీతి వంటి ఆరోపణలు చేసింది.  

ఇప్పుడు అమెరికాలో అదానీపై నమోదైన కేసులో కూడా ఇవే అంశాలు ఉన్నాయి. లాభాల కోసం ఒప్పందాలు చేసుకోవడానికి ముడుపులు చెల్లించారనీ, చెల్లించడానికి అంగీకారం తెలిపారన్న అభియోగాలపై అమెరికాలో అదానీపై కేసు నమోదైంది. సహజంగానే ఇప్పుడు కూడా అదానీ గ్రూప్ ఆ ఆరోపణలను ఖండించింది.   అభియోగాలు, ఖండనల సంగతి ఎలా ఉన్నా.. ఒకే వ్యాపారిపై తరచుగా అవినీతి ఆరోపణలు రావడాన్ని బట్టి అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరణ వెనుక మతలబు ఉందన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే నిప్పు లేనిదే పొగరాదు. ఎంత మంది, ఎన్ని శక్తులు అండగా, దండగా నిలబడినా నిజం నికలకడ మీద తేలక తప్పదు.

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.