పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన నటి విష్ణు ప్రియ.. ఎందుకంటే?
Publish Date:May 23, 2026
Advertisement
సోషల్ మీడియా… ఒకప్పుడు అభిమానాన్ని పంచుకునే వేదిక. కానీ ఇప్పుడు అదే వేదిక సెలబ్రిటీలపై అనుచిత పోస్టులు, వ్యక్తిత్వ హననం, ట్రోలింగ్ పేరుతో జరుగుతున్న దాడులకు వేదికగా మారింది. తాజాగా ప్రముఖ యాంకర్, నటి విష్ణుప్రియ కూడా ఈ సైబర్ వేధింపుల బారిన పడ్డారు. ఎప్పుడూ తన గ్లామర్, చలాకీతనం, టెలివిజన్ షోలతో ప్రేక్షకులను అలరించే విష్ణుప్రియ ఇప్పుడు సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దారుణ ట్రోలింగ్‌తో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొన్ని రోజులుగా ఆమెపై ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో కొందరు వ్యక్తులు అసభ్యకర పోస్టులు, అవమానకర కామెంట్లు చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. గౌరవాన్ని కించప రిచేలా పోస్టులు వైరల్ చేస్తున్నారు. మొదట ఇవన్నీ పట్టించుకోకుండా ఉన్న విష్ణుప్రియ, రోజు రోజుకి పరిస్థితి శృతిమించడంతో.. మియాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో తనపై కావాలనే దుష్ప్ర చారం చేస్తున్నారని, అట్టి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. విష్ణుప్రియ ఫిర్యాదు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ…ట్రోలింగ్ కూడా ఒక హద్దులో ఉండాలి, సెలబ్రిటీలను టార్గెట్ చేసి వ్యక్తిగతంగా దాడి చేయడం సరికాదు అంటూకామెంట్లు చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/actress-vishnu-priya-visits-police-station-36-220640.html





