ఎబ్బే... తమన్నాకి ఇది కూడా రాదంట...!
Publish Date:Dec 7, 2013
Advertisement
మాములుగా ప్రతీ హీరోయిన్ కూడా ముందు మోడల్ రంగం నుంచే హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంటారు. మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలను పొందిన వారు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే మోడలింగ్ కూడా చేయకుండా హీరోయిన్లుగా మారినవాళ్లు ఉన్నారు. అయితే మోడల్ అయిన, హీరోయిన్ అయినా కూడా వారికీ అందంతో పాటు, అందమైన పిల్లి నడక కూడా తెలిసి ఉండాలి. అదేనండి క్యాట్ వాక్. ర్యాంప్ పై ఒయ్యారాలు పోతూ.. అలా అలా నడుస్తూ, చూసేవారి కళ్ళను ఆకర్షించాలి. అయితే ఇలాంటి క్యాట్ వాక్ హీరోయిన్ తమన్నాకు బొత్తిగా తెలియదు. అయితే ఈ అమ్మడు ఉత్తరాదికి చెందిన ఓ వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఈ కంపెనీ పబ్లిసిటీలో భాగంగా యాడ్ ఫిలింలో తమన్నాను నటింపజేయాలనుకున్నారు సదరు షోరూమ్ యాజమాన్యం.ఈ యాడ్‌ఫిలింలో కంపెనీకి సంబంధించిన చీరలను ధరించి ర్యాంప్‌పై అందంగా తమన్నా క్యాట్‌వాక్ చేయాలి. కానీ తమన్నా మాత్రం ర్యాంప్‌పై క్యాట్ వాక్ కూడా చేయడం రాకపోవడంతో సదరు కంపెనీ వారు ఆశ్చర్యపోయారు. తమన్నాకు క్యాట్‌వాక్ చేయడం చేతకాదని నిర్ధారించుకున్న ఆ యాజమాన్యం...క్యాట్ వాక్ ఎలా నడవాలో తమన్నాకి తెలియజేయడానికి ఓ ట్రయల్ వాక్‌ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎంత చేసిన కూడా మాములుగా నడుస్తుంది కాని, వాళ్ళు కోరుకున్న విధంగా క్యాట్ వాక్ లో నడవలేకపోయింది. దాంతో ఎదో ఒక విధంగా ఆ యాడ్ షూటింగ్ ను పూర్తి చేసేసారు. కానీ ఈ విషయంపై తమన్నానే నోరు పారేసుకుందట. "నేనేమైనా మోడల్‌ని అనుకుంటున్నారా? నేను హీరోయిన్‌ని. ఇలాంటి చెత్త నడకలు నడవడం నాకు చేతకాదు. నేను ఇలాంటివి చేయను" అంటూ వాళ్లపై ఫైర్ అయ్యింది. దాంతో అక్కడున్నవారు ఏం చెయ్యాలో తెలియక ఎలాగోలా ఆ తతంగాన్ని ముగించేసారంట.
http://www.teluguone.com/news/content/actress-tammanna-reject-in-catwalk-32-28159.html
హాయిగా నవ్వుకునే టిట్ బిట్స్ వున్న ఫన్ బక్కెట్ కామెడీ పదమూడో ఎపిసోడ్‌ని ఎంచక్కా చూసి ఎంజాయ్ చేయండి..
మొన్నీమధ్య విడుదలైన గోపీచంద్ ‘సౌఖ్యం’ సినిమా మీద మన సక్కుబాయి రివ్యూ ఏమిటో చూసేద్దామా?
డిసెంబర్ 27, 2015 నుంచి జనవరి 02, 2016 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ రెండు నిమిషాల నిడివి వున్న ఫన్ బక్కెట్ పన్నెండో కాపీ చూడండి.. మీకు నచ్చి తీరుతుంది. మాదీ గ్యారంటీ..
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఈ వీడియోలో చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది.
క్రీడాకారుల జీవిత కథలతో రూపొందించిన బాలీవుడ్ సినిమాలు ఘన విజయాలు సాధిస్తున్నాయి. ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీకోం’ సినిమాలు దీనికి ఉదాహరణలు. ఆ సినిమాల స్ఫూర్తితోనే అజారుద్దీన్, మహేంద్రసింగ్ ధోనీ జీవిత కథల ఆధారంగా కూడా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అందాల క్రీడాకారిణి
2015 సంవత్సరంలో టాలీవుడ్‌లో టాప్ 10 ఫ్లాపులుగా మిగిలిన కళాఖండాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి చాలు.. ఫుల్లుగా క్లారిటీ వచ్చేస్తుంది.
టాలీవుడ్‌లో ఒక్కో ఏడాది కొంతమంది హీరోయిన్లు ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటూ వుంటారు. ఎవరి అకౌంట్లో ఎక్కువ ఫ్లాపులు పడితే వాళ్ళని ఐరన్ లెగ్స్ అనడం టాలీవుడ్‌లో మామూలే. మరి 2015లో ఐరన్ లెగ్స్ అని పిలిపించుకుంటున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా...
సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలే మంచి రోజు’ గురించి స్టార్ హీరో ప్రభాస్ ఏమంటున్నాడంటే...
ఈవారం అంటే... 20 డిసెంబర్, 2015 నుంచి 26 డిసెంబర్ 2015 వరకు వివిధ రాశులవారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేస్తే చాలు..
డిసెంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వివిధ రాశుల వారి గ్రహబలం ఎలా వుందో తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూస్తే చాలు.
త్రిష అందంగా వుంటుంది.. ఇంకా చెప్పాలంటే సూపరుగా వుంటుంది. అయితే ఇప్పుడు త్రిషని అందరూ త్రిషా.. నువ్వు సూపరు అంటున్నారు. ఈ ప్రశంస ఆమె అందానికి సంబంధించినది కాదు.. ఆమె వ్యక్తిత్వానికి సంబంధించింది. అందాల నటిగా అందరి ప్రశంసలు అందుకోవడం మాత్రమే కాదు.. సమాజం పట్ల బాధ్యతగా కూడా వ్యవహరించే త్రిషను చాలామంది ఈ కోణంలో కూడా అభిమానిస్తూ వుంటారు. ఆమధ్య స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా వీధులను ఊడ్చి స్ఫూర్తినిచ్చిన త్రిష అడపాదడపా సమాజ సేవా కార్యక్రమాల్లో
దర్శకుడు రాంగోపాల్ వర్మ అందరినీ మెప్పించగల సినిమాలు తీయడంలో విఫలమవుతున్నా, నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోగలుగుతున్నారు. ఏ విషయంపైనైనా తనకు తోచినట్లు నిర్భయంగా చెప్పగలగడమే అతనికి చాలా పాపులారిటీ తెచ్చిపెట్టిందని చెప్పవచ్చును. అయితే ఆ పాపులారిటీ పెరుతున్న కొద్దీ అతను తన హద్దులను కూడా దాటిపోతున్నట్లు కనిపిస్తోంది. సహజ సిద్దమయిన కొన్ని సమాజ సూత్రాలను, నియమనిబంధనలను తనకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.





