బెట్టింగ్ యాప్ ల ప్రచారానికి సంబంధించిన ఈడీ దర్యాప్తు జోరందుకుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ను విచారించిన ఈడీ.. బుధవారం (ఆగస్టు 6) హీరో విజయ్ దేవరకొండను విచారించనుంది. నిషేధానికి గురైన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి స్టార్ సినిమా నటుల వరకూ పలువురిపై నజర్ పెట్టిన ఈడీ వారికి నోటీసులు పంపి వరుసగా విచారణకు పిలుస్తున్నది.
బెట్టింగ్ యాప్స్ కారణంగా అప్పుల ఊబిలో కూరుకుని బలవన్మరణాలకు పాల్పడిన వారెందరో ఉన్నారు. అటువంటి బెట్టింగ్ యాప్స్ ను సెలబ్రిటీలే ప్రమోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈడీ వారిని విచారణ చేస్తున్నది. అందులో భాగంగా నటుడు విజయ్ దేవరకొండను ఈడీ విచారించనుంది. ఇక ఇదే కేసులో మరో నటుడు దగ్గుబాటి రాణాను ఈ నెల 11న, నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మిని ఈ నెల 13న ఈడీ విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాశ్ రాజ్ ను గత నెల 30 దాదాపు ఐదుగంటల పాటు విచారించిన ఈడీ ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/actor-vijay-devara-konda-attend-before-ed-39-203603.html
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
గతంలో అమరావతికి అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక రంగు మార్చి మూడు రాజధానులన్నారని దుయ్యబట్టారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు ఇకపై సాగవన్నారు.
జగన్ హయాంలో అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు తెరపైకి వచ్చింది. 2014-19 మధ్యకాలంలో రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి, తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ, చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ అప్పట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Publish Date:Mar 31, 2026
పల్నాడు జిల్లా పోలీసు విభాగం సలహాదారుగా చదలవాడ అరవిందబాబు రామినేని ప్రసాద్ ను నియమించాలని ఎనిమిది నెలల కిందట సిఫారసు చేశారు. ఆ విషయంలో ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన స్వయంగా మంగళవారం ఉదయం పదకొండున్న గంటల సమయంలో ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ బి.కృష్ణారావును కలిశారు.