శివాజీకి రాజకీయ పాఠాలు

Publish Date:May 4, 2015

Advertisement



సినీ నటుడు, బీజేపీ నాయకుడు (ఆయన బీజేపీ నాయకుడు కాదని బీజేపీ వాళ్ళు అంటున్నారు అది వేరే సంగతి) శివాజీ ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినవాళ్ళు కొంతకాలం ఏ పార్టీలో అయినా చేరి కార్యకర్తగా పనిచేస్తారు. దాదాపు అన్ని పార్టీలూ తమ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ ఇస్తూ వుంటాయి. ఇలా సొంత అనుభవాలు, పొందిన శిక్షణ, నేర్చుకున్న గుణపాఠాలతో ఎవరైనా రాజకీయ నాయకుడిగా రాటుతేలుతూ వుంటారు. అయితే నటుడు శివాజీకి రాజకీయాల్లో అనుభవం తక్కువ. నరసరావుపేట నుంచి టీవీ రంగానికి, టీవీ రంగం నుంచి సినిమా రంగానికి, ఆ తర్వాత సినిమాల నుంచి డైరెక్టుగా రాజకీయ రంగానికి వచ్చారాయన. దాంతో ఆయనకు రాజకీయాలంటే ఏమిటి, రాజకీయ నాయకులంటే ఎలా వుంటారు... ఎలా వుండాలి అనే అవగాహన సహజంగానే తక్కువ. అయితే ఆయన విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ‘రాజకీయాలు’ ఆయనకు రాజకీయ పాఠాల్లా ఉపయోగపడుతున్నాయి. రాటు తేలేలా చేస్తున్నాయి.

మొన్నటి ఎన్నికలలో శివాజీ బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు మంత్రిగా వున్న బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న రోజునే శివాజీ కూడా ఆయనతోపాటుగా బీజేపీలో చేరారట. ఆ విషయం శివాజీనే చెప్పారు. వీర్రాజు అనే బీజేపీ నాయకుడు అసలు శివాజీ బీజేపీకి చెందిన నాయకుడే కాదని అన్నప్పుడు శివాజీ ఈ వివరణ ఇచ్చారు. తాను బీజేపీ నాయకుడిని కాకపోతే, మంత్రిగా వున్న కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీ నాయకుడు కాదని శివాజీ చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే, మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా శివాజీ ఏ పార్టీలో వున్నాడో తనకు తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రిణి పురందేశ్వరి కూడా శివాజీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. ఇలా బీజేపీలోని నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీలో శివాజీకి అస్తిత్వమే లేదని ప్రకటిస్తూ వుండటం శివాజీకి అసలు ‘రాజకీయాలు’ అంటే ఏమిటో అర్థమయ్యేలా చేస్తున్నాయి.

శివాజీ బీజేపీ నాయకుడు అవునా, కాదా అనే సందేహం మొన్నటి వరకూ బీజేపీ నాయకులు ఎవరికీ కలగలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని జలదీక్ష, నిరసన దీక్షలు చేస్తూ వుండే సరికి ఆయన బీజేపీ నాయకుడు కానేకాదని చెబుతున్నారు. శివాజీ గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేస్తే చిన్నా చితకా సంఘాల నాయకులే తప్ప ప్రధాన పార్టీల నాయకులెవరూ పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అంటారు. అదే డిమాండ్‌తో శివాజీ దీక్ష చేస్తే మాత్రం ఎంతమాత్రం పట్టించుకోరు. దీన్నే రాజకీయం అంటారు. జరుగుతున్న పరిణామాలన్నీ శివాజీకి రాజకీయ పాఠాలుగా ఉపయోగపడుతూ వుండవచ్చు.

By
en-us Political News

  
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.