ఏసీపీ జె. నర్సయ్యకు రాష్ట్రపతి పోలీసు పతకం

Publish Date:Aug 14, 2026

Advertisement

 

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా పనిచేస్తున్న జె. నర్సయ్యకు 2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకం అందుకోనున్నారు...
1991 జూలై 16న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో ఉద్యోగంలో చేరిన జె. నర్సయ్యకు 2026 ఆగస్టు 15 నాటికి 35 సంవత్సరాల ఒక నెల పోలీసు సేవ పూర్తవు తుంది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ జోన్‌ అద నపు డీసీపీగా 2024 ఆగస్టు 8 నుంచి బాధ్య తలు నిర్వహిస్తున్నారు.


తన సుదీర్ఘ పోలీసు ప్రస్థానంలో నర్సయ్య పలు కీలక కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచారు. యాంటీ నక్సల్‌ ఆపరేష న్లలో కీలకంగా వ్యవహ రించి మిలిటెంట్లు, నక్సల్‌ సానుభూతిపరుల అరెస్టు లో ముఖ్యపాత్ర పోషిం చారు. 2010లో హైదరా బాద్‌ పాతబస్తీలో జరిగిన మతపరమైన ఉద్రిక్తతలను సమర్థవంతంగా ఎదు ర్కొని, పలు హత్య కేసు లను ఛేదించి శాంతిభద్రత లను పునరుద్ధరించడంలో కీలకంగా వ్యవహరించారు
2012లో డీఆర్‌డీఎల్‌ శాస్త్రవేత్త కుమారుడు 10 ఏళ్ల ప్రణవ్‌ హత్య కేసును ఛేదించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 

హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచే స్తున్న సమయంలో పాకిస్థాన్‌లో ముద్రించిన రూ.6.50 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసు కున్న కేసులో కూడా కీలకంగా వ్యవహరించారు  కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ బృందంతో కలిసి పని చేస్తూ ఒడియన్‌ థియేటర్‌ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడు జియావుల్‌ హక్‌ను పట్టుకోవడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు అలాగే సంచలనం సృష్టిం చిన మద్దెల చెరువు సూరి హత్య కేసు దర్యాప్తు లోనూ ముఖ్యపాత్ర పోషించి భాను కిరణ్‌ గన్‌మ్యాన్‌ను అరెస్ట్‌ చేయ డంతో పాటు ఆయుధా లను స్వాధీనం చేసుకోవ డంలో సహకరించారు.

నర్సయ్య దర్యాప్తు నైపుణ్యాలతో అనేక కీలక కేసులను ఛేదించడంతో పాటు పలు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్షలు పడేలా దర్యాప్తు సాగించినట్లు పతకానికి సంబంధించిన సిటేషన్‌లో పేర్కొన్నారు. నర్సయ్యకు గతంలో కూడా పలు పోలీసు సేవా పురస్కా రాలు లభించాయి. 2010లో ఏపీ పోలీస్‌ సేవా పతకం, 2015లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ పోలీసు సేవా పతకం, 2017లో ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌, 2019లో అతిఉత్కృష్ట మెడల్‌, 2021లో తెలంగాణ రాష్ట్ర మహోన్నత సేవా పతకం అందుకున్నారు.అదేవిధంగా ఆయనకు 16 నగదు రివార్డులు, 261 GSEలు, 32 MSEలు, 20 కమెండే షన్లు, 18 ప్రశంసలు లభించినట్లు అధికారిక రికార్డుల్లో 
పేర్కొన్నారు. 

రాష్ట్రపతి పోలీసు పతకా నికి సంబంధించిన సమ గ్రత ధ్రువీకరణ పత్రంలో నర్సయ్యపై ఎలాంటి న్యాయ, శాఖాపరమైన లేదా విజిలెన్స్‌ కేసులు పెండింగ్‌లో లేవని, ఎలాంటి విచారణలు ప్రతిపాదించబడలేదని పేర్కొన్నారు. 2015-16 నుంచి 2024-25 వరకు సమీక్షా కాలంలో ఆయన కు ఎలాంటి ప్రధాన శిక్ష విధించలేదని కూడా ధ్రువీ కరించారు.అసాధారణమైన సేవ, కర్తవ్యనిబద్ధత, దర్యాప్తు ప్రతిభను గుర్తిస్తూ 2026స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జె. నర్సయ్యకు రాష్ట్రపతి పోలీసు పతకం అందించాలని సిఫార్సు చేశారు.

ACP J. Narsaiah awarded Presidents Police Medal, CM Revanth reddy, Telangana police, Hyderabad police

By
en-us Political News

  
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
కేన్స్ టెక్నాలజీ షేర్లు గత 3 రోజుల నష్టాల తర్వాత దాదాపు 2% పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం రూ. 7,877 కోట్ల ఇసిఎమ్‌ఎస్ ప్లాన్ ఆమోదించడంతో పిసిబి ప్లాంట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఫలితాలు, టార్గెట్ ప్రైస్, టెక్నికల్ అవుట్‌లుక్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బెంగళూరు-ఎర్నాకులం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీటింగ్ సామర్థ్యాన్ని రైల్వే శాఖ 8 నుండి 16 కోచ్‌లకు శాశ్వతంగా పెంచింది. ఒక్కో ట్రిప్‌కు 1,128 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరు-ముంబై స్లీపర్ వందే భారత్ వివరాలు కూడా తెలుసుకోండి!
పాతికేళ్లకు పైగా డిజిటల్ మీడియా రంగంలో తెలుగువన్ సాధించిన విజయాలను మయన్మార్ మంత్రి టియాన్ లిన్ అభినందించారు. తెలుగువన్ అవలంబిస్తున్న వినూతన కంటెంట్ మోడల్స్, నాణ్యతా ప్రమాణాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య కంటెంట్ మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించారు.
లలితా జ్యువెలరీ మరియు హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఐపీఓల మధ్య గ్రే మార్కెట్ ప్రీమియం GMP , లిస్టింగ్ లాభాలు, ప్రైస్ బ్యాండ్ మరియు డే 2 సబ్‌స్క్రిప్షన్ వివరాల పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.