Publish Date:Mar 20, 2025
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ అప్రూవర్ గా మారేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే ఈ హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి హత్య వెనుక భారీ కుట్ర ఉందని చెప్పారు. ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరు? హత్యకు కుట్రపన్నింది ఎవరు అన్న విషయాలను వెల్లడిస్తానని మీడియా సమావేశంలో చెప్పారు.
గురువారం (మార్చి20) కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్ యాదర్ ఈ హత్య విషయంలో తాను ఇప్పటి వరకూ మౌనంగా ఉన్నాననీ, అన
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ-2(అక్యూజ్డ్-2)గా ఉన్న సునీల్ యాదవ్ సైతం.. అప్రూవర్‌గా మారేందుకు రెడీ అయ్యారు. “వివేకానందరెడ్డి హత్యకు చాలానే కుట్ర జరిగింది. ఈ కుట్ర వెనుక ఏముంది? ఎవరున్నారు? అసలు ఈ ప్లాన్ ఎవరిది అనేది చెప్పేస్తా అని తాజాగా మీడియాకు చెప్పారు. గురువారం ఉదయం కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సునీల్.. మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసు విషయంలో ఇంత వరకూ మౌనంగా ఉన్నాననీ, కానీ ఇప్పుడు తనకే బెదరింపులు వస్తున్నాయన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు కూడా తనకు వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తనకు ప్రాణ భయం ఉందనీ సునీల్ చెప్పారు. అయితే భయపడుతూ ఎన్నాళ్లు బతకాలని భావించి.. ఇప్పుడు వివేకా హత్య వెనుక కుట్ర కోణాన్ని, హత్య సూత్రధారులు, పాత్రధారుల ఎవరన్న విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం వివేకా హత్య కేసులో బెయిలుపై ఉన్నసునీల్ యాదవ్, తన ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడీ వివరాలు బయటపెట్టడానికి ముందుకు వచ్చినట్లు చెప్పారు.
ఇప్పటికే వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి సైతం బెదరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, భద్రత కలిగించాలనీ కోరుతూ కోర్టను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ కేసులో ఏ2 సునీల్ యాదవ్ సైతం బెదరింపులు వస్తున్నాయంటూ జీల్లా ఎస్పీని ఆశ్రయించడం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accused2-in-viveka-murder-case-turn-as-approver-39-194732.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.