Publish Date:Sep 23, 2024
ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో అండర్ గ్రౌండ్ లో ఉన్న వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ ను 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించారు. విద్యాసాగర్ పై కేసు నమోదు చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ లో ఉండి ముంబై తదితర నగరాల్లో కుక్కల విద్యాసాగర్ తలదాచుకున్నాడు.డెహ్రాడూన్ నుంచి పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించి రిమాండ్ కు పంపారు.
జెత్వానీపై అప్పట్లో బడా పారిశ్రామికవేత్త జిందాల్ రేప్ చేసిన నేపథ్యంలో అతనిపై రేప్ కేసు నమోదైంది. ఈ రేప్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఆ బడా పారిశ్రామిక వేత్త అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శరణు జొచ్చాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ పారిశ్రామికవేత్త అత్యంత సన్నిహితుడు. ఈ పరిచయాన్ని ఉపయోగించుకునే జిందాల్ జగన్ పంచన చేరారు. నేరం చేసిన జిందాల్ కు శిక్షపడే అవకాశాలున్నప్పటికీ జగన్ ఆ రేపిస్ట్ కు అండగా నిలిచారు. జగన్ ఆదేశాలతో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ జెత్వానిపై వేధింపులు చేస్తున్నప్పటికీ విషయం బయటకు పొక్కలేదు. ఎందుకంటే కుక్కల విద్యాసాగర్ జగన్ కు సన్నిహితుడు కావడమే. ఈ కేసులో ఎ వన్ ముద్దాయి కుక్కల విద్యాసాగర్. దీంతో జెత్వానీ కేసులో అరెస్ట్ ల పర్వం మొదలైందనే అనుకోవాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accused-in-jethwani-case-25-185370.html
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
కడప పులివెందుల మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికల కౌంటింగ్లో తెలుగుదేశం పార్టీ విజయపథంలో దూసుకుపోతోంది
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.