ట్రాన్స్‌కో డీఈ నివాసాల్లో ఏసీబీ దాడులు.!

Publish Date:Jul 22, 2026

Advertisement

విద్యుత్ శాఖ డీఈ ముత్యం రెడ్డి నివాసాలపై ఏసీబీ బుధవారం (జులై 22) తెల్లవారు జామునుంచే సోదాలు చేపట్టింది.  తెలంగాణ ట్రాన్స్‌కో లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్  డీఈ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముత్యం వెంకటరమణ ఇల్లు, కార్యాలయం,  ఆయన  అత్యంత సన్నిహితుల నివాసాలపై ఏసీబీ అధికారులు   తెల్లవారుజాము నుంచే సోదాలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో ఈ సోదాలు చేపట్టారు. 
 ఏసీబీ అధికారులు   8 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, ఏకకాలంలో  రాష్ట్రవ్యాప్తంగా  14 ప్రాంతాలలో ఈ సోదాలు ప్రారంభించారు.  

హైదరాబాద్ లోని   హైటెక్ సిటీలో గల మీనాక్షి స్కై లాంజ్ లోని వెంకటరమణ  నివాసంతో పాటు ఆయన బంధువులు, వ్యాపార భాగస్వాములు, సన్నిహితుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సందర్భంగా ఏసీబీ  డక్యుమెంట్లు, డిపాజిట్ బాండ్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీల పత్రాలు, బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకాల స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.  

విద్యుత్ శాఖలోని ఒక ఉన్నతాధికారి ఇంట ఈ స్థాయిలో 14 ప్రాంతాల్లో  ఏకకాలంలో సోదాలు జరగడం కలకలం రేపింది.   తనిఖీలు ముగిసిన తర్వాత అధికారులు స్వాధీనం చేసుకున్న మొత్తం అక్రమాస్తులు, బంగారు ఆభరణాలు, నగదు వివరాలు వెల్లడించే  అవకాశం ఉంది.  

ACB Raids Hyderabad, Telangana Transco DE, Mutyam Venkata Ramana, Disproportionate Assets Case, Transco DE Raids, Anti Corruption Bureau Telangana

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ కీలక అడుగు వేసింది.
పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మళ్లీ తీవ్ర రూపం దాల్చింది.
నా నియోజకవర్గానికి జోలికి వస్తే మీకు మర్యాద దక్కదు.. ఘాటు హెచ్చరిక..!
ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధులు ఈరోజు కేవలం నిరసనలకు వేదికగా మాత్రమే లేవు
చదువే పిల్లలకు శాశ్వత ఆస్తి ..పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డికి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
చివరికి మర్డర్ చేయించింది కూడా సవతి తల్లే..!
హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది.
పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం
నిందితులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి, తన తీర్పును ఈనెల 27కి రిజర్వ్ చేశారు.
ఢిల్లీలో ముగిసిన సీజేపీ రెండో విడత చర్చలు..!
ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణ మార్గంలో పొర్లు దండాలు పెట్టి మొక్కు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో సరికొత్త విప్లవం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.