ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు..భారీగా నగదు స్వాధీనం

Publish Date:Jun 16, 2026

Advertisement

హైదరాబాద్‌లో   ఏసీబీ  మరోసారి భారీ స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఈ సారి ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ మల్టీజోన్-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరిపై ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఏకకాలంలో పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. నరహరి నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన ఇళ్లలోనూ   తనిఖీలు జరిగాయి.

పాతబస్తీ ఛత్రినాక ప్రాంతంలోని ఆయన సోదరుడి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల సందర్భంగా నరహరి నివాసంలో భారీ మొత్తంలో నగదు లభ్యమైనట్లు తెలుస్తోంది. దాదాపు  32 లక్షల నగదును ఏసీబీ అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు నిల్వలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీటితో పాటు స్థిరాస్తులు, భూములు, ఇతర పెట్టుబడులకు సంబంధించిన కీలక పత్రా లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

By
en-us Political News

  
కృష్ణా నది ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జూరాల ప్రాజెక్టుకు 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.
ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ వై. లక్ష్మణరావు నేతృత్వంలోని న్యాయస్థానం విచారణ జరిపి.. తమ్మినేని కుమారుడిపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంటూ ముందస్తు బెయిలు నిరాకరించింది. కాగా ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీ లకు మాత్రం ముందస్తు బెయిల్ మంజూరుర చేసింది.
ఒకవైపు మంచినీటి కొరతతో జనం అల్లల్లాడుతుంటే.. మరోవైపు పది రోజులుగా నీరు వృధాగా పారుతున్నా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు. శివారెడ్డి పల్లి గేట్ ప్రాంతంలో పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామంలోని పలు కాలనీ వాసులకు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి కోసం మహిళలు, గ్రామస్థులు కిలోమీటర్ల కొద్దీ దూరంలో ఉన్న వ్యవసాయ బావులు, బోర్‌వెళ్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు.
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
ర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.