రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌.. ఎక్కడంటే.!

Publish Date:Oct 12, 2026

Advertisement

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎంతోమంది అధికారులు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారుల చేతికి చిక్కుతున్న కూడా.. వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదు.. ఇప్పుడు తాజాగా మరో అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు.హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు రూ.20 లక్షల లంచం తీసుకుంటూ అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డిని కూడా నిందితుడిగా గుర్తించిన అధికారులు ఇద్దరినీ అరెస్టు చేశారు.హెచ్‌ఎండీఏ నిబంధనల మేరకు జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు  రూ.30 లక్షలతో మొదలైన లంచం బేరం చివరకు రూ.20 లక్షల వద్దకు చేరింది. 

ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులును అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డిని సైతం నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడికి సంబంధించిన భూమిని హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం సర్వే చేసి, జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేయాల్సి ఉంది. ఈ పని పూర్తి చేసేందుకు తహసీల్దార్‌, మండల సర్వేయర్‌ లను  బాధితులు కలిశాడు.అయితే ఇద్దరు లంచం ఇవ్వాలంటూ డిమాండ్‌ చేసినట్లు ఏసీబీ పేర్కొంది. తొలుత రూ.30 లక్షలుఇవ్వాలని కోరిన నిందితులు, అనంతరం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు తగ్గించారు.

లంచం డిమాండ్‌పై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టారు. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మండల సర్వేయర్‌ ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 లక్షలు స్వీకరిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. సర్వేయర్‌ వద్ద ఉన్న లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు ఏసీబీ వెల్లడించింది.ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులు తమ అధికారిక విధులను అక్రమంగా, అవినీతిపూరితంగా నిర్వహించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితులైన మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్‌ బి. సుదర్శన్‌రెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పనులు నిబంధనల ప్రకారం జరగాల్సి ఉండగా, వాటి కోసం భారీ మొత్తాల్లో లంచాలు డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

 

 

 

 

[ ACB Raid, Telangana ACB, Bribery Case, ₹20 Lakh Bribe, Abdullapurmet Surveyor, Batuk Srinivasulu, Tahsildar B Sudarshan Reddy, HMDA Survey Report, Joint Inspection Survey, Anti Corruption Bureau, ACB Arrests, Telangana Corruption Case, Bribe Demand, Chemical Test, Hyderabad ACB Court, Nampally Special Court ]


 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది.
కవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ, మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో  వేదికపై పంచుకుంటూ మెట్రో రైలులో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి  రేకెత్తిస్తోంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.