సస్పెన్షన్ కంప్లీటెడ్.. పూర్తి జీతం ఇవ్వండి.. సీఎస్‌కు ఏబీవీ లెటర్
Publish Date:Mar 25, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనపై సస్పెన్షన్ కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇక ఎంతమాత్రం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. రెండేళ్లు పూర్తవడంతో తనపై సస్పెన్షన్ తొలగిపోయినట్లే అని సీఎస్ కు రాసిన లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. సస్పెన్షన్ తొలగిపోయిన కారణంగా నిబంధనల ప్రకారం తనకు పూర్తి జీతం అందజేయాలని తన లేఖలో ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆరు నెలల చొప్పున ఏపీ ప్రభుత్వం తనపై సస్పెన్షన్ పొడిగిస్తూ వచ్చిందని, అలా మొత్తం కలిపి రెండేళ్ళ పాటు తనపై సస్పెన్షన్ అమలు చేసిందని, రెండేళ్ల గడువు జనవరి 27నే ముగిసిందని ఏబీవీ వివరించారు. రెండేళ్లకు మించి సస్పెండ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, అలా గడువులోగా ఏపీ ప్రభుత్వం అనుమతి తీసుకోలేదని ఏబీవీ వెల్లడించారు. కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోలేదు కనుక తనపై సస్పెన్షన్ తొలగిపోయినట్లు అన్నారు. సర్వీస్ నిబంధనల ప్రకారం తనకు పూర్తి జీతం అందజేయాలని ఏబీవీ తన లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అదనపు డీజీగా పనిచేసినప్పుడు భద్రతా పరికరాల కొనుగోళ్లలో ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగంతో సస్పెండ్ చేస్తున్నట్లు జీఓ నెంబర్ 18లో వైసీపీ సర్కార్ పేర్కొంది. ఈ సీనియర్ పోలీస్ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే సస్పెండ్ చేసింది. ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనల నియమం కింద ఏబీనీ సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేశారని, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్థతో కుమ్మక్కై తన కొడుకు చేతన్ సాయికృష్ణకు కాంట్రాక్టు ఇప్పించారని జగన్ రెడ్డి సర్కార్ ఆరోపణ. ఆ సంస్థలో వెంకటేశ్వరరావు కొడుకు సాయికృష్ణ భారత్ లో ప్రతినిధిగా ఉన్న విషయాన్ని వెంకటేశ్వరరావు దాచిపెట్టారని వైసీపీ సర్కార్ ఆరోపించింది. కాగ.. పెగాసస్ అంశంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దాంతో ఏబీవీ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న తనపై ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని ఫైరయ్యారు. తాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నంత వరకూ పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనలేదని వివరణ ఇచ్చారు కూడా. తనను సస్పెండ్ చేసినప్పటి నుంచీ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. తన స్సెన్సన్ అంశం కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. నిఘా పరికరాల కొనుగోలులో 25 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బయట ప్రచారం జరిగిందని, చార్జిషీట్ లో ఆ అంశం ఎందుకు పెట్టలేదని నిలదీయడం గమనార్హం.. ప్రానాలను అడ్డంపెటట్ఇ విధులు నిర్వహించిన తనది దేశద్రోహమా అంటూ ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ఇప్పుడు నిబంధనల ప్రకారం తనపై సస్పెన్షన్ పొడిగించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కనుక పూర్తిస్థాయి జీతం ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం చర్చనీయాంశం అయింది.
http://www.teluguone.com/news/content/abv-letter-to-cs-39-133511.html





