నబూతో.. నభవిష్యతి

Publish Date:Apr 14, 2025

Advertisement

నాడు శ్రీరెడ్డి, బోరుగ‌డ్డ అనిల్ నుంచి
నేడు ద‌గాప‌డ్డ కిర‌ణ్ చేబ్రోలు వ‌ర‌కూ
మ‌ధ్య అలేఖ్య చిట్టీ వంటి ఆడ‌పిల్ల‌లు సైతం
బూతు భాషనే ఆశ్రయిస్తున్నారెందుకు? 
బూతు ఇంత‌టి ప్ర‌ధాన పాత్ర పోషిచడానికి కార‌ణం ఏంటి?

సోష‌ల్ మీడియా జ‌మానా వ‌చ్చాక‌.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాయ‌లేని, ప‌ల‌క‌లేని ఎన్నో ప‌దాలు.. ఇక్క‌డ య‌ధేచ్ఛ గా స్వైర విహారం చేస్తున్నాయ్. ఇవాళ అంద‌రూ ఐటీడీపీ కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్ విష‌యంలో ఇంత పెద్ద ఎత్తున త‌ప్పు ప‌డుతున్నారు. కానీ, గ‌తంలో వ‌ల్ల‌భ‌నేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్ర‌బాబు విష‌యంలో తీవ్ర స్థాయిలో వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసిన వారే. 

ఆనాడు బాబు ఇది గౌర‌వ స‌భ కాదు- కౌర‌వ స‌భగా మారింద‌నీ. తాను తిరిగి ముఖ్య‌మంత్రిగా వ‌చ్చి ఈ స‌భ ద్వారా తిరిగి సంస్క‌ర‌ణ‌కు పాల్ప‌డ‌తాన‌ని అన్నారు. అన‌డం మాత్ర‌మే కాకుండా.. ఇదిగో ఇవాళ భార‌తీరెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన త‌మ సొంత కార్య‌క‌ర్త కిర‌ణ్ చేబ్రోలు విష‌యంలో క‌ఠిన చ‌ర్యలు తీసుకోవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. 

ఇప్ప‌టి వ‌ర‌కూ కిర‌ణ్ చేబ్రోలుపై మొత్తం ఐదు కేసులుండ‌గా, వాటిలో మాజీ మంత్రి విడుద‌ల ర‌జ‌నిపై చేసిన అనుచిత వ్యాఖ్య‌లు కూడా ఉన్నాయి. దీంతో వీట‌న్నిటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న గుంటూరు పోలీసులు, అత‌డి సెల్ ఫోన్ సిగ్న‌ళ్ల ద్వారా ఇబ్ర‌హీం ప‌ట్నం ద‌గ్గ‌ర అదుపులోకి తీసుకుని.. మంగ‌ళ‌గిరి పీఎస్ కి త‌ర‌లించారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే.. సీఎం ఆదేశాల‌తో పోలీసులే మొద‌ట సుమోటోగా   స్వీక‌రించ‌డం. ఆ త‌ర్వాత అత‌డిపై వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు కేసులు పెట్ట‌డం, రిమాండ్ కి త‌ర‌లించేలా ఏర్పాట్లు చేయ‌డం.

ఇదే గ‌తంలో బోరుగ‌డ్డ అనిల్.. బాబు, లోకేష్, ప‌వ‌న్ వంటి వారిపైనే కాకుండా.. పిల్ల‌ల‌ని కూడా చూడ‌కుండా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.. నాటి సీఎం జ‌గ‌న‌న్ మోహ‌న రెడ్డిగానీ, ఆయ‌న‌ ప్ర‌భుత్వం నుంచి కానీ.. క‌నీస స్పంద‌న లేదు. పైపెచ్చు ఇలాంటి వ్యాఖ్యానాలు చేయ‌డ‌మే త‌మ‌కు కావ‌ల్సింద‌న్న చందంగా వ్య‌వ‌హ‌రించారు. లోలోన ఎంత‌గానో సంతోషించార‌ని అంటారు.

ఆ మాట‌కొస్తే పోసాని కృష్ణ‌ముర‌ళి.. త‌న విచార‌ణలో చెప్పిన‌దాన్నిబ‌ట్టీ చూస్తే.. సజ్జ‌ల టీమ్ ద్వారా ఆయనకు స్క్రిప్ట్ వ‌చ్చేది. వీరి అనుచిత వ్యాఖ్య‌ల వెన‌క ఎంత‌టి ఫ్యాన్ మార్క్ మాస్ట‌ర్ ప్లాన్ దాగి ఉంద‌ని తేట‌తెల్ల‌మైందని అన‌డానికి ఇంత‌క‌న్నా మించిన సాక్ష్యాలు ఎక్క‌డ దొరుకుతాయ్? 

కానీ కూట‌మి ప్ర‌భుత్వం తొలి  నాటి నుంచే మ‌హిళ‌లు, పిల్ల‌లు, వృద్ధుల విష‌యంలో అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం అనే అంశంలో నిషేధాజ్ఞ‌లు జారీ చేయ‌డం మాత్ర‌మే కాదు.. ఆ దిశ‌గా ఇప్పటికే ఎంద‌ర్నో ఊచ‌లు లెక్కించేలా చేస్తోంది. ఇది సోష‌ల్ మీడియా ప‌రంగా ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించే వారిప‌ట్ల త‌మ పంథా అని స్ప‌ష్టంగా తెలియ చేసింది. త‌రత‌మ బేధాలు చూసేది లేదు. వారు ఎవ‌రైనా, ఏ పార్టీ వారైనా స‌రే విడిచి పెట్టే ప్ర‌స‌క్తే లేద‌న్న సంకేతాల‌ను పంపుతోంది.

అయితే ఇక్క‌డే ఒక కొత్త వాద‌న‌. వివేకం సినిమాలోనూ కిర‌ణ్ ఆరోపించిన‌ట్టుగా.. చూపించార‌నీ. భార‌తీరెడ్డికి, అవినాష్ రెడ్డికి వివాహేత‌ర సంబంధం ఉన్న‌ట్టు ఎస్టాబ్లిష్ చేశార‌నీ.. ఈ చిత్రాన్ని  చూడ‌మంటూ.. బాబు కూడా బ‌హిరంగ ప్ర‌ట‌కన చేశార‌నీ అంటారు కొంద‌రు వైసీపీ వాదులు.

అయితే ఇదే వైసీపీ వారు.. హ‌త్య అనే ఒక సినిమా తీసి.. అందులో కొంద‌రి పాత్ర‌లు కావాల‌నే లేకుండా చేసి.. తద్వారా త‌మ‌దైన అనుకూల విధానంలో వివేకా హ‌త్య‌కు సంబంధించి కొత్త అనుమానాలు రేకెత్తించేలా చేశారు. ఈ చిత్రంలో చూపిన తీరుపై.. సునీల్ యాద‌వ్ తీవ్ర స్థాయిలో వ్య‌తిరేకించారు. ఇందులో త‌మ పాత్ర‌ల‌ను కావాల‌నే వ‌క్రీక‌రించార‌నీ.. చాలా మంది పాత్ర‌లు కావాల‌నే లేకుండా చేశార‌నీ.. సినిమా ద్వారా కూడా రాజ‌కీయాల‌కు తెర‌లేపార‌నీ వైసీపీ వారిపై ఆరోప‌ణ‌లు చేస్తారు సునిల్ యాద‌వ్. ఈ దిశ‌గా ఆయ‌న ఫిర్యాదు చేశారు కూడా. ఒక ద‌శ‌లో హ‌త్య సినిమా వ్య‌వ‌హారం ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లిందంటే, ఈ సినిమా క్లిప్పింగులు షేర్ చేసినా.. కేసులు పెట్టే వ‌ర‌కూ. ఇదే వివేకా హ‌త్య విష‌యంలో.. అవినాష్ కి అన్ని విష‌యాలు తెలుసంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ రెడ్డి సైతం సంచ‌ల‌న కామెంట్లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఓవ‌రాల్ గా చూస్తే వివేకం సినిమా విష‌యాన్ని ఎత్తి చూపుతున్న వైసీపీ వాళ్లు.. మ‌రి హ‌త్య సినిమా తీయ‌డం వెన‌క  దాగిన ర‌హ‌స్య‌మేంటో చెప్పాలంటారు టీడీపీ వారు.

ఏది ఏమైనా ఇన్నాళ్ల పాటు వీడియోలు చేస్తూ వ‌చ్చిన కిర‌ణ్ చేబ్రోలు ఒక్క‌సారిగా అరెస్టులు, కేసులు అంటూ లైమ్ లైట్లోకి వ‌చ్చేశారు. అంటే ఇందుకు కార‌ణం బూతు. ఈ బూతు వెన‌క దాగిన అస‌లు సృష్టిక‌ర్త వైయ‌స్ జ‌గ‌న్. ఆయ‌న‌.. ఒక మాజీ ముఖ్య‌మంత్రిగా, ఒక పార్టీ అధినేత‌గా.. పోలీసుల ప‌ట్ల గౌర‌వంగా మాట్లాడి ఉంటే ఎవ‌రికీ ఏ అభ్యంత‌రం అనిపించేది  కాదు. 

ఒక రాష్ట్రాన్ని పాలించిన వ్య‌క్తి అయి ఉండి కూడా.. పోలీసుల బ‌ట్ట‌లు ఊడ‌దీస్తాన‌నే కామెంట్లు చేయ‌డంతోనే ఒక్క‌సారిగా కాక చెల‌రేగింది. దీనిపై త‌న‌దైన స‌హజ ధోర‌ణిలో బూతు ద‌ట్టించి వ‌దిలారు కిర‌ణ్ చేబ్రోలు. అప్ప‌టికీ కిర‌ణ్ త‌న త‌ప్పు తెలుసుకుని.. క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ఒక వీడియో విడుద‌ల చేశారు కూడా. అయిన‌ప్ప‌టికీ వ‌ద‌ల‌ని పోలీసులు అత‌డ్ని అరెస్టు చేశారు. ఇలాంటి బూతు భువ‌నేశ్వ‌రిపై చేసినా, భార‌తీరెడ్డిపై చేసినా  స‌హించేది లేద‌న్న క్లియ‌ర్ క‌ట్ మెసేజ్ పాస్ చేశారు.

ఇటీవ‌ల అలేఖ్య చిట్టీ అనే ప‌చ్చ‌ళ్లు అమ్మే అమ్మాయిల ఉదంతంలోనూ బూతు పాత్ర అత్యంత కీల‌కంగా  క‌నిపించింది. మీ ప‌చ్చ‌ళ్లు మ‌రీ ఇంత రేటా? అని ఒక క‌స్ట‌మ‌ర్ అడిగిన‌పుడు.. తాము వాడే వ‌స్తువులు అంత నాణ్య‌మైన‌వ‌ని చెప్ప‌కుండా అలేఖ్య చిట్టీ విపరీత‌మైన బూతును మిళితం చేసిన భాష వాడింది. ఇది ప్ర‌స్తుతం ఆమెను, ఆమె ఇద్ద‌రు సోద‌రీమ‌ణుల‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది.

ఒక ర‌కంగా చెబితే...  ఈ బూతుల‌కు బాగా అల‌వాటు ప‌డ్డారు సామాన్యులు. ఇప్ప‌టి వ‌ర‌కూ తెర‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన బూతు.. సోష‌ల్ మీడియా జ‌మానాలో అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చింది. త‌ద్వారా అదొక మాస్ లాంగ్వేజీగా అవ‌త‌రించింది. ఎవ‌రు బూతులు మాట్లాడుతారో వారిని విప‌రీతంగా ఫాలో కావ‌డం యూత్ ఒక ప‌నిగా పెట్టుకుంది. 

శ్రీరెడ్డి విష‌యానికి వ‌స్తే.. శ్రీరెడ్డి బేసిగ్గా ఒక‌ వైసీపీ స‌పోర్ట‌ర్. ఆమె భాష ఎంతో విధ్వంస‌క‌రంగా ఉంటుంది. లైవ్ లో అయితే త‌న రేటుతో స‌హా చెప్పేస్తూ.. త‌న ఫాలోయ‌ర్స్ ని ఊరించి వ‌దిలిపెడుతుంది. ఆమె వంట వీడియోలు చేసినా.. అందులోనూ బూతు ప్ర‌ద‌ర్శ‌న‌ చేస్తూ.. హ‌ల్ చ‌ల్ చేస్తుంది. 

ఆ మాట‌కొస్తే ఇటీవ‌ల‌ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మ‌ల్ల‌న్న కూడా బూతుల‌తో త‌న రాజ‌కీయ, సోష‌ల్ మీడియా కోట‌గోడ‌లు నిర్మించుకున్న‌వాడే. బాతాల పోశెట్టి వంటి ఎన్నో బూతు మాట‌ల‌తో సీఎం స్థాయి వ్య‌క్తిపై తీవ్ర ప‌రుష ప‌ద‌జాలం వాడి జ‌నాల్లోకి వెళ్లాడు. వారిని విశేషంగా ఆక‌ట్టుకున్నాడు. ఇవాళ ఇదిగో ఎమ్మెల్సీ గా ఎదిగాడు. అలాగ‌ని త‌న భాష‌ను కంట్రోల్ చేశాడా అంటే అదీ లేదు. తాజాగా రెడ్లు, వెల‌మ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెంటి వేయ‌బ‌డ్డాడు. 

ఒక‌రు సాధార‌ణ పార్ల‌మెంటు భాష‌లో ప్లెయిన్ లాంగ్వీజీలో మాట్లాడితే.. వారి భాష‌నెవ‌రూ స్వీక‌రించ‌డం లేదు. ఆద‌రించ‌డం లేదు. ఎవ‌రైతే రిస్క్ తీస్కుని బూతుల‌తో కూడిన‌ అవాకులు చెవాకులు పేలుతుంటారో వారినే హైలెట్ చేస్తూ వ‌స్తున్నారు ప్రేక్ష‌కులు. వారినే ఫాలో అవుతూ వ‌స్తున్నారు కొంద‌రు. ఇందువ‌ల్లే ఇదంతా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతెందుకు ఈనాడును, ఈటీవీని ఎంతో సంస్కార‌వంతంగా న‌డిపిన రామోజిని సైతం ఈ బూతు జ‌బ‌ర్ద‌స్త్ రూపంలో చొర‌బ‌డి బోల్తా కొట్టించింద‌ని అంటారు. 

జ‌బ‌ర్ద‌స్త్ లో స్కిట్ల‌లో వాడే భాష మొత్తం దాదాపు బూతు ప‌ద‌జాలంతో కూడుకుని ఉంటుంది. అది హిట్ కావ‌డం, ఏళ్ల‌ త‌ర‌బ‌డి కొన‌సాగుతుండ‌టంతో.. బూతు ఒక మార్కెట్ వ‌స్తువుగా త‌యారైంది. సాధార‌ణ లాంగ్వేజీతో మాట్లాడే ఏ ఇన్ ఫ్లుయెన్ష‌ర్ కి కూడా పెద్ద‌గా ఫాలోయ‌ర్లుండ‌రు. అదే బూతు ప‌ద‌జాలం విస్తృతంగా ఎవ‌రు వాడుతారో.. వారి చుట్టూ ఫాలోయ‌ర్లు మూగిపోతున్నారు. దీంతో బూతు మార్కెట్ స్ట్రాట‌జీలోనే టాప్ ప్లేస్ లోకి చేరిపోయింది.

కిర‌ణ్ చేబ్రోలు మొన్న‌టి వ‌ర‌కూ చేసిన కామెంట్లు ఎవ‌రికీ పెద్ద‌గా తెలీవు. ఏదో పార్టీ వాయిస్ వినిపిస్తున్నాడ్లే అనుకున్నారు. ఎప్పుడైతే జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో పోలీసుల బ‌ట్ట‌లు విప్పారో. దాని ప్రేర‌ణ‌తో కిర‌ణ్ చేబ్రోలు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి వ్య‌క్తిత్వ హ‌న‌నానికి పాల్ప‌డ్డారో.. ఆ వెంట‌నే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తెలిసిపోయారు. ఇవాళ కిర‌ణ్ చేబ్రోలో ఒక పాపుల‌ర్ సెల‌బ్రిటీ హోదా సాధించారు. అది మంచా చెడ్డా చూడ్డం లేదు జ‌నం. పాపుల‌ర్ అయ్యాడా లేదా చూస్తున్నారు. 

గ‌తంలో ఇదే వైసీపీకి సంబంధించిన వ‌ల్ల‌భ‌నేని వంశీ, నారా భువ‌నేశ్వ‌రిని అన‌రాని మాట‌లు అన‌డం వ‌ల్లే క‌దా?  చంద్ర‌బాబు ఆనాడు స‌భ‌ను వీడింది. క‌న్నీళ్లు పెట్టుకుంది. ఒక్క వంశీయే కాదు.. కొడాలి నాని కూడా చంద్ర‌బాబును, ఆయ‌న కుటుంబాన్ని తీవ్ర ప‌రుష ప‌ద‌జాలంతో దూషించేవారు. వీరికి రోజా, అంబ‌టి, అనిల్ వంటి వారు తాన‌తందాన అనేవారు. వీరు చేసే అనుచిత వ్యాఖ్య‌ల‌ను నాటి వైసీపీ ప్ర‌భుత్వం ఎంత మాత్రం క‌ట్ట‌డి చేసేది కాదు. పైపెచ్చు వారిని మ‌రింత‌గా రెచ్చ‌గొట్టేది. ఇలాంటి  వాటికంటూ స‌జ్జ‌ల పుత్ర‌ర‌త్నం భార్గ‌వ్ చేత ఒక యూనిట్ ఏర్పాటు చేసి.. దాని ద్వారా.. వీటిని విప‌రీతంగా ప్ర‌చారం చేయించేవారు.

ఇదొక ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ గా తీర్చిదిద్దిందే వైసీపీ. దాని సోష‌ల్ మీడియా విభాగం. పైకి టీడీపీ దాని అనుకూల మీడియా ఎంత బ‌లంగా క‌నిపించినా.. వైసీపీ సోష‌ల్ మీడియా, మెయిన్ మీడియా కూడా చూప‌లేని, చెప్ప‌లేని ఎన్నో విష‌యాల‌ను జ‌నాల్లోకి తీస్కెళ్లి అల‌జ‌డి చెల‌రేగేలా చేసేది. ఈ విప‌రీత ధోర‌ణే ప్ర‌స్తుం వైసీపీకి చేటు తెచ్చింది. 11 సీట్ల‌కు ప‌రిమితం చేసింది. ఇంకా ఇదే పంథాలో వెళ్తే.. ఈ మాత్రం సీట్లు కూడా రావ‌న్న సంకేతాలు అందుతున్నాయ్. మ‌రి చూడాలి వైసీపీ ఈ బూతు ప్రేరేపిత విధానం ఎప్పుడు ఎలా ఆపుతుందో లేదో తేలాల్సి ఉంది.

By
en-us Political News

  
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
జమ్మూ కశ్మీర్‌  పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచారం జరుగుతోంది.
మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ బేగంపేటలోని ఆయన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు.
జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖ వాసి అయిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెన్స్ ఫోర్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించడంతో ఆ సంస్థ మరో మారు వార్తలలోకి ఎక్కింది. పహల్గాం ఉగ్ర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విశాఖ ఐటీ హిల్ లో టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే ఇవ్వ‌డం క‌రెక్టేన‌ని.. క‌ళ్లు మూసుకుని చెప్పొచ్చు. కానీ కొంద‌రూ వైపీపీయులు దీన్నో భూత‌ద్దంలో పెట్టి చూపెడుతూ త‌ప్పు ప‌డుతున్నారు.
జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి 27 మంది ఉసురు తీసిన సంఘటనకు నిరసనగా ఉవ్వెత్తున ఆందోళనలు చెలరేగాయి.
జమ్మూ కశ్మీర్ పై ఉగ్రవాదం మరో మారు పంజా విసిరింది. పాకిస్థాన్ ప్రేరిపిత ఉగ్ర మూకలు మరో మారు తెగబడ్డాయి.అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం (ఏప్రిల్ 22) మిట్ట మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం 27 మంది టూరిస్టులు మరణించారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (ఏప్రిల్ 23) శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల సమయం పడుతోంది.
టీడీపీ అధికార ప్రతినిధి నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి వార్త నన్ను షాక్ కు గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు
ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారుఒంగోలు పద్మ టవర్స్‌లోని తన ఆఫీసులో ఉన్న వీరయ్య పై దుండగులు దాడి చేశారు. ముసుగులో వచ్చిన దుండగులు వీరయ్య పై దాడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో గాయపడ్డ వీరయ్యను చూసిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.