గుజరాత్ లో రెండో స్థానం కోసమేనా కేజ్రీవాల్ పోరాటం?

Publish Date:Nov 21, 2022

Advertisement

గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల 1,5 తేదీలలో రెండు విడతలలో ఎన్నికలు జరగనున్నాయి. గత ఆరు దఫాలుగా గుజరాత్ లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తోంది. వరుసగా ఏడో సారి కూడా విజయం ఖాయమన్న ధీమానూ వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సారి గుజరాత్ లో బీజేపీకి విజయం నల్లేరు మీద బండి నడక ఎంతమాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సారి గుజరాత్ లో బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఏదైనా ఉందంటే.. అది రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీలో ఉండటమేనంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలలో ఆప్, గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ చాలా చాలా బలంగా పుంజుకున్నాయి. గుజరాత్ ఎన్నికలపై సర్వేలన్నీ.. ఇదే విషయాన్ని ప్రస్ఫుటంగా తేల్చేశాయి.

 లోక్ నీతి -సి.ఎస్.డి.ఎస్. సర్వే మాత్రం  ఆప్ గట్టి పోటీ ఇస్తుండటంతో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లన్నీ ఆ పార్టీ వైపు మళ్లిపోతాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ కు ఎంత గట్టి పట్టు ఉన్నా.. దానిని ఓట్ల రూపంలో మరచుకునే వ్యూహాలూ, ప్రచారంలో కాంగ్రెస్ బాగా వెనుకబడిందంటున్నారు.  రాహుల్ జోడో యాత్రలో ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ కు స్థానం లేకపోవడంపై పార్టీలో పెల్లుబికిన అసంతృప్తి కారణంగా చివరి నిముషంలో ఆయన పాదయాత్ర రూట్ మ్యాప్ లో గుజరాత్ ను చేర్చినప్పటికీ, అప్పటికే ఆలస్యమైపోయిందంటున్నారు.  

2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 41.4 శాతం ఓట్లు దక్కాయి.  77 స్థానాలలో విజయం సాధించి, ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. కానీ ఈ సారి ఆ సీన్ లేదంటోంది లోక్ నీతి సర్వే. ఆ సర్వే ప్రకారం గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ   ప్రభావం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారిందంటోంది. ఆ పార్టీకి రానున్న ఎన్నికలలో వచ్చే ఓట్లలో ఎక్కువ భాగం కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లేనని చెబుతోంది. గతంలో పరిశీలకులు సైతం ఇదే రీతిలో విశ్లేషణలు చేసిన సంగతి విదితమే. అంటే కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లలో కనీపం 20 శాతం ఆప్ కు మరలి పోయినా ఆశ్చర్యంలేదని సర్వే అంటోంది.

అంటే ఈ సారి కాంగ్రెస్ కు గతంలో  వచ్చిన ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోతుందని లోక్ నీతి సర్వే పేర్కొంటోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలో కాకుండా ఆప్ ఖాతాలో పడే అవకాశాలే ఎక్కవ ఉన్నాయంటోంది. అంటే ఆప్ ప్రభావం వల్ల బారీగా నష్టపోయేది కాంగ్రెస్సేనన్నది సర్వే సారాంశం. దీంతో ఈ సారి ఎన్నికలలో గుజరాత్ లో కాంగ్రెస్ కు కనీసం రెండో స్థానం కూడా దక్కే అవకాశం లేదన్నది లోక్ నీతి సర్వే సారాంశం.

గుజరాత్ లో ఆప్ అంతగా పుంజుకున్నా.. అధికారాన్ని చేపట్టే పరిస్థితి అయితే లేదని.. కానీ కాంగ్రెస్ అవకాశాలను మాత్రం భారీగా గండి కొడుతుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  వాస్తవానికి కేజ్రీవాల్   వ్యూహం కూడా అదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ మరో సారి అధికారంలోకి వచ్చినా సరే కానీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఆప్ ఉండాలన్న వ్యూహంతో కేజ్రీవాల్ ఉన్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కేరళలోని కొచ్చిలో సంచలనం సృష్టించిన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రమాదం కేసు పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
మహా న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.