ముడుపులు, కమీషన్లు లేని పారదర్శక టెండర్ విధానం.. తమిళనాడు సీఎంపై ప్రశంసల వర్షం

Publish Date:Jul 2, 2026

Advertisement

తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్  తాజాగా రాష్ట్రంలో పబ్లిక్ ఫండింగ్, ప్రజా పనుల కేటాయింపుల్లో దశాబ్దాలుగా నడుస్తున్న పాత పద్ధతులకు పూర్తిగా చరమగీతం పాడుతూ విజయ్ ప్రవేశపెట్టిన  ట్రాన్స్‌పరెంట్ టెండర్ సిస్టమ్ ఇప్పుడు పాత తరం కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు  ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.  

ఈ విధానం వల్ల  భారీగా ప్రజా ధనం ఆదా అవుతుండటం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కొత్త విధానం అమలులోకి వచ్చిన  వారాల వ్యవధిలోనే..  సివిల్ పనులపై ప్రభుత్వం అంచనా వేసిన వ్యయం కంటే అత్యంత తక్కువ ధరకు కాంట్రాక్టర్లు పనులను దక్కించుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న ఓపెన్ కాంపిటీషన్‌లో అనేక మంది కాంట్రాక్టర్లు పనులను దక్కించుకోవడమే లక్ష్యంగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ రేట్లను కోట్ చేస్తున్నారు.   పలు ప్రభుత్వ ప్రాజెక్టులలో అధికారిక అంచనాల కంటే ఏకంగా 25 శాతం నుండి 30 శాతం వరకు తక్కువ ధరలకే టెండర్లు దాఖలవుతున్నాయి. ఈ స్థాయిలో నిధులు మిగలడం చూసి సాధారణ ప్రజలతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం విస్మయం చెందుతున్నారు.

ఈ సరికొత్త పరిణామం ఇప్పుడు రాష్ట్రంలో ఒక పెద్ద  చర్చకు తెరలేపింది. ప్రస్తుతం 25-30 శాతం తక్కువ ధరలకే నాణ్యమైన పనులు చేయడం సాధ్యమైనప్పుడు, గత ప్రభుత్వాల హయాంలో అదనంగా ఖర్చయిన ఆ కోట్లాది రూపాయల ప్రజాధనం ఎవరి జేబుల్లోకి వెళ్ళిందనే ప్రశ్నలు  గట్టిగా వినిపిస్తున్నాయి. గత పాలకుల అవినీతి, కమీషన్ల సంస్కృతిని ఎండగట్టేందుకు ముఖ్యమంత్రి విజయ్ కి ఇది  రాజకీయ ఆయుధంగా మారింది. గతంలో కాంట్రాక్టర్లు టెండర్ల ధరలను ఖరారు చేసేటప్పుడు అనధికారిక ఖర్చులు, కమీషన్లను కూడా లెక్కలోకి తీసుకుని ప్రభుత్వానికి భారీగా బిల్లులు వేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సరికొత్త పారదర్శక విధానం వల్ల తాము ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే తక్కువ ధరలకే నాణ్యమైన పనులు చేయగలుగుతున్నామని కొందరు చిన్న తరహా కాంట్రాక్టర్లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. 

ఏదేమైనా..  ఇంత తక్కువ బడ్జెట్‌తో పనులు చేపడుతున్నప్పుడు వాటి నాణ్యత   దెబ్బతినకుండా చూడటమే సీఎం విజయ్ ముందున్న అసలైన సవాలు. కాంట్రాక్టర్లు పోటీ పడి రేట్లు తగ్గించినప్పటికీ, పనుల్లో ఏమాత్రం రాజీ పడకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ సరికొత్త టెండర్ ఫార్ములా' విజయ్ ప్రభుత్వానికి ప్రజలలో మైలేజ్ తెచ్చి పెట్టింది.  ప్రజాధనాన్ని కాపాడుతూ, పాత వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుతున్నారంటూ విజయ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.