ఐపీఎల్ లో పరుగుల సునామీ.. ఒకే రోజు 986 రన్స్‌!

Publish Date:Apr 25, 2026

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ క్రికెట్ ప్రేమికులకు అసలైన పరుగుల పండుగను తీసుకువచ్చింది.  ఈ ఏడాది బ్యాటర్లు  సృష్టిస్తున్న పరుగుల సునామీతో రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి.  శనివారం  (ఏప్రిల్ 25)   జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్‌లలో పరుగుల సునామీ కాదు అంతకు మించి అన్నట్లుగా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఇంత వరకూ ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రెండు మ్యాచ్ లలోనూ కలిపి ఏకంగా 986 పరుగులు నమోదు అయ్యాయి. ఐపీఎల్  చరిత్రలో ఒకే రోజు అత్యధిక పరుగులు సాధించడం ఇదే మొదటి సారి. 

శనివారం (ఏప్రిల్ 25) జరిగిన రెండు మ్యాచ్ లలోనూ కూడా బ్యాటర్లు తొలి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డారు.   ఫోర్లు, సిక్సర్ల తో పరుగుల తుపాను సృష్టించారు.  గతంలో అంటే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే రోజు 800కు పైగా పరుగులు వచ్చిన రికార్డు  ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది. ఒకే రోజు దాదాపు వెయ్యి పరుగులకు చేరువలో స్కోరు నమోదవ్వడం  టీ20 క్రికెట్ లోనే ఒక అద్భుతం అని చెప్పవచ్చు.  

 ఆధునిక క్రికెట్‌లో పవర్‌ హిట్టింగ్‌ వేరే లెవెల్ కు చేరింది. ముఖ్యంగా పవర్‌ ప్లే ఓవర్ల లో సాధ్యమైనన్ని పరుగులు పిండుకుంటే..  డెత్ ఓవర్లలో  భారీ షాట్లతో విరుచుకుపడే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఐపీఎల్ లో నిర్ణీత 20 ఓవర్లలో  200 ప్లస్ స్కోర్ అన్నది మూమూలుగా మారిపోయింది.ఇక ఇప్పుడు రెండు మ్యాచ్ లలో కలిపి  986 పరుగుల రికార్డు ఐపీఎల్ గ్లామర్‌  మరింత పెంచేసింది.  మొత్తానికి, క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 2026  సీజన్  పరుగుల పండుగను తీసుకు వచ్చింది. వినోదాన్ని పంచుతోంది.  

By
en-us Political News

  
జెన్‌ జీ దెబ్బకు మోదీ అర్ధరాత్రి ఇన్‌స్టా వీడియో పెట్టాల్సి వచ్చింది..!
నువ్వు చాలా బాగా ప‌నిచేస్తున్నావు.. శెహ‌భాష్‌..లోకేష్‌` అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టారు.
ఏపీ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతలు వ్యవస్థల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇటీవల చేపడుతున్న పరామర్శ యాత్రలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, ఆ సంస్థ మాజీ ఛైర్మన్‌ అనిల్‌ డి. అంబానీతో పాటు పలువురు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది.
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో పోలీస్‌, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), ఫైర్‌ సర్వీసెస్‌, జైళ్ల శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరొక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం నమోదైంది.
ఉత్తరాంధ్ర ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంపై
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్ర‌తిరూపం భోగాపురం..!
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.