చీప్ లిక్కర్‌కు రాయల్ టచ్… సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే టార్గెట్!

Publish Date:May 14, 2026

Advertisement

 

రాయల్ బాటిళ్లలో లోకల్ మద్యం నింపి, “ప్రీమియం లిక్కర్” పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను టార్గెట్ చేసిన ఓ వినూత్న లిక్కర్ దందాను ఎక్సైజ్ అధికారులు బట్టబయలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఖరీదైన బ్రాండ్ల పేరుతో చీప్ లిక్కర్ విక్రయిస్తున్న ముఠాను ఎన్ఫోర్స్‌మెంట్ సీఐ సుభాష్ చంద్ర, ఎస్సై అఖిల్ బృందం అరెస్ట్ చేసింది. దాడుల్లో రూ.3 లక్షలకు పైగా విలువ చేసే మిక్సింగ్ మద్యం, ఖరీదైన బ్రాండ్ సీసాలు, క్యాపులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ముఠా వ్యవహారశైలి చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. పెద్దల లిక్కర్ పార్టీల్లో ఖాళీ అయ్యే ఖరీదైన మద్యం సీసాలను సేకరించి, వాటిలో చీప్ లిక్కర్‌కు కొద్దిగా నీరు కలిపి మళ్లీ సీల్ చేసేవారు. ఆ తర్వాత వాటిని “లగ్జరీ ఎడిషన్” పేరుతో మార్కెట్‌లో విక్రయించేవారు.

ఇక వీరి ప్రధాన టార్గెట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. జీతాలు ఎక్కువ… సమయం తక్కువ… చెక్ చేసుకునే ఓపిక ఉండదనే అంచనాతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ నయా దందాకు తెరలేపారు. ధరలు కూడా వినడానికి బంపర్ ఆఫర్లలా ఉండేవి. రూ.25 వేల విలువ చేసే రాయల్ సెల్యూట్‌ను కేవలం రూ.8 వేలకే, రూ.9 వేల శివాస్ రీగల్‌ను రూ.4 వేలకే, రూ.7 వేల గ్లెన్‌ఫిడిచ్‌ను రూ.3 వేలకే విక్రయిస్తూ కస్టమర్లను ఆకర్షించారు. తక్కువ ధరకు ఖరీదైన మద్యం దొరుకుతోందని భావించిన కస్టమర్లు మోసపోగా, ముఠా మాత్రం భారీ లాభాలు గడించింది.

కొండాపూర్ పరిసరాల్లోని గుట్టల బేగంపేటలో అద్దె గదిని తీసుకుని రహస్యంగా ఈ “మినీ ఫ్యాక్టరీ” నిర్వహించారు. ఒడిశాకు చెందిన లాలు ప్రసాద్ బిస్వాల్, రాజేశ్వర్ మెహర్ లిక్కర్ ఈవెంట్లలో పనిచేస్తూ ఖాళీ బాటిళ్లు సేకరించేవారు. కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శరత్ చంద్ర మార్కెటింగ్ బాధ్యతలు చూసేవాడు. ముగ్గురు కలిసి లాభాలు పంచుకుంటూ ఈ అక్రమ వ్యాపారాన్ని నడిపారు.

అయితే ఎక్సైజ్ అధికారుల ఎంట్రీతో ఈ “లిక్కర్ స్టార్టప్” ఒక్కసారిగా కుప్పకూలింది. లాలు ప్రసాద్ బిస్వాల్, శరత్ చంద్రలను అరెస్ట్ చేసి కొండాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించగా, రాజేశ్వర్ మెహర్‌పై కేసు నమోదు చేశారు. ఖరీదైన మద్యం తక్కువ ధరలకు ఇస్తామంటూ చెప్పే వారిని నమ్మవద్దని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది. “చీప్ ధరకు రాయల్ మద్యం” అనిపిస్తే అది ఆఫర్ కాదు… ఆపద కావొచ్చని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి… రాయల్ బాటిళ్లలో లోకల్ మద్యం పోసి రాజుల్లా సంపాదించాలని చూసిన ఈ ముఠా… చివరకు పోలీస్ స్టేషన్‌కే రాయల్ ఎంట్రీ ఇచ్చింది.

By
en-us Political News

  
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన   ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా   ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై  కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్‌లైన్‌లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.