అబ్దుల్ కలామ్ ఆశయానికి బీజం వేసిన ఉపాధ్యాయుడు.. సంఘటన ఇవే..

Publish Date:Oct 28, 2023

Advertisement

రామేశ్వరం పాఠశాలలో అబ్దుల్ కలామ్ అయిదో తరగతి చదువుతున్నప్పుడు  శ్రీశివసుబ్రహ్మణ్య అయ్యర్ ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్పేవారు.  తన దగ్గర చదువుకునే విద్యార్థులను అమితంగా ప్రేమించే ఉపాధ్యాయుల్లో ఆయన ఒకరు. ఆయన ఒక రోజు పక్షులు ఎలా ఎగురుతాయో తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు. నల్లబల్ల మీద ఒక పక్షి బొమ్మ గీసి దాని తల, తోక, రెక్కలు, శరీర నిర్మాణాన్ని వివరంగా చిత్రించారు. పక్షులు తమ రెక్కల్ని అల్లార్చడం ద్వారా ఎలా ఎగరగలుగుతాయో, ఆ ప్రయత్నంలో తమ తోక ద్వారా ఎలా దిశలు మార్చుకోగలుగుతాయో చూపించారు. దాదాపు అరగంట పాటు విహంగాల విహారం గురించి చక్కగా వివరించారు. పాఠం ముగించాక అర్థమైందా? అని అందరినీ అడిగారు. అబ్దుల్ కలామ్ ఎలాంటి సంకోచం లేకుండా నాకు అర్థం కాలేదని అన్నారు. ఆ మాటే చాలామంది విద్యార్థులు చెప్పారు. వారి సమాధానానికి ఆ మాస్టారు ఏమీ నిరుత్సాహపడలేదు, సహనాన్ని కోల్పోలేదు.


సాయంకాలం పిల్లలందరినీ సముద్రతీరానికి తీసుకువెళ్ళారు. అప్పుడు అయ్యర్గారు ఆకాశంలో గుంపులు, గుంపులుగా ఎగురుతున్న పక్షుల్ని చూపించారు. ఆ అద్భుతమైన పక్షి సమూహాలను చూసి విద్యార్థులంతా విభ్రాంతులమయ్యారు.  ఉపాధ్యాయుడు ఆ పక్షుల్ని చూపిస్తూ, అవి అలా ఎగురుతున్నప్పుడు తమ రెక్కల్ని ఎలా అల్లారుస్తున్నాయో గమనించమన్నారు. అవి తాము కోరుకున్న దిశకు తిరగడానికి తమ తోకల్ని ఎలా వాడుకుంటున్నాయో పరిశీలించమన్నారు.


అప్పుడాయన  'పక్షిని నడిపిస్తున్న ఆ యంత్రం ఎక్కడుంది? దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?" అని విద్యార్థులను అడిగారు. చివరకు జవాబు కూడా ఆయనే చెప్పారు. పక్షిని నడిపిస్తున్న శక్తి దాని ప్రాణశక్తేనని, దాని ఇచ్ఛాశక్తే దాని చోదకశక్తి అని వివరించారు. అంత గహనమైన భావనల్ని ఆయన విద్యార్థుల కళ్ళెదుట కనపడుతున్న దృష్టాంతంలో సులభంగా, సరళంగా బోధపరిచారు.


ఆ రోజు తెలుసుకున్నది కేవలం ఒక పక్షి ఎలా ఎగురుతున్నదన్న అంశంతో  అబ్దుల్ కలాం ఆగిపోలేదు. ఆ రోజు వారు చెప్పిన ఆ పాఠం ఆయనలో విశిష్ట అనుభూతిని జాగృతం చేసింది.  భవిష్యత్తులో చదువుకోబోయే చదువు ఆకాశయాన వ్యవస్థలకు సంబంధించి ఉండాలని అప్పుడే తీర్మానించుకున్నారు. ఒక సాయంకాలం పాఠశాల ముగిసిన తరువాత ఆయన మనస్సులోని మాటను  మాస్టారు ముందుంచాను. అప్పుడాయన చాలా ఓపిగ్గా అబ్దుల్ కలామ్ భవిష్య ప్రణాళిక ఎలా ఉండాలో చెప్పుకొచ్చారు. మొదట  హైస్కూలు, కళాశాల చదువులు పూర్తిచేయాల్సి ఉంటుందనీ, ఆ తరువాత ఇంజనీరింగ్లో ఆకాశయాన వ్యవస్థల గురించి చదువు కొనసాగించాలనీ చెప్పారు. ఆ మొత్తం క్రమంలో అబ్దుల్ కలామ్ కష్టపడి చదువుకోగలిగితే భవిష్యత్తులో ఆకాశయాన విజ్ఞానానికి సంబంధించి ఎంతో కొంత సాధించగలవని కూడా ఆయన చెప్పారు.


ఆ ఉపాధ్యాయుడి సలహా ప్రకారం అబ్దుల్ కలామ్ కళాశాలకు వెళ్ళినప్పుడు భౌతికశాస్త్రాన్ని ఎంచుకున్నారు. అలాగే మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరినప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నారు.  ఉపాధ్యాయుడు పక్షులు ఎలా ఎగురుతాయో వివరించడానికి చూపిన దృష్టాంతం,  చదువు కోసం ఆయన చేసిన సూచనలు అబ్దుల్ కలామ్ జీవితానికి ఒక గమ్యాన్నీ, లక్ష్యాన్నీ ప్రసాదించాయి. అబ్దుల్ కలామ్  జీవితంలో అదొక గొప్ప మలుపు. కాలగమనంలో ఆయనొక రాకెట్ ఇంజనీరుగా, అంతరిక్ష శాస్త్రవేత్తగా, సాంకేతిక నిపుణుడిగా రూపుదిద్దుకోవడానికి ఆ సంఘటనే నాంది పలికింది. ఈ విషయాన్ని స్వయానా అబ్దుల్ కలామ్ చెప్పారు.


                                            *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.