కృష్ణలంకలో విషాదం.. సెల్ఫీ వీడియో తీసుకొని ఓ వ్యక్తి ఆత్మ హత్య

Publish Date:Jun 18, 2026

Advertisement

 

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో పెరుపోగు క్రాంతి కుమార్ (40) ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకుం టున్నట్లు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో లో పేర్కొన్నారు. గత మూడు నెలలుగా తనను తీవ్రంగా వేధించారని, పలు మార్లు కొట్టారని, ఆ వేధింపు లను భరించలేక ఆత్మహత్య కు పాల్పడుతున్నట్లు వీడియోలో వెల్లడించారు. 

మే 21 ఉదయం పోలీసులు ఇంటికి రావడంతో క్రాంతి కుమార్ విషపదార్థం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించారు. ఈ ఘటనపై క్రాంతి కుమార్ తండ్రి పెరుపోగు వెంకటేశ్వర రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, క్రాంతి కుమార్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా వారు విడివిడిగా నివసిస్తున్నారు. అలాగే క్రాంతి కుమార్ పై గతంలో కొన్ని కేసులు నమోదై ఉండగా, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్, రౌడీ షీట్లు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొ న్నారు. 

ఈ నేపథ్యంలోనే పోలీసులు తరచు క్రాంతి ఇంటికి వచ్చేవారిని,సీఐ నాగరాజు వేధింపులు భరించలేకే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని క్రాంతి కుమార్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, క్రాంతి కుమార్ మరణానికి ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో ఈ కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. సెల్ఫీ వీడియోతో పాటు ఇతర ఆధారాలను కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు.


 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
గాదె సాయికృష్ణ అదృశ్యం ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పెను సంచలనంగా మారింది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూశారు.
విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను పీపీ పద్ధతిలో ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నట్టు ముగ్గురు మంత్రుల కమిటీ ప్రకటించింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లతో యోగభ్యాసం చేయించిన రామ్ దేవ్ బాబా
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం, అలాగే పోలీసుల కస్టడీలోనే అతను మరణించాడంటూ వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
యోగా గురు  బాబా రామ్‌దేవ్‌తో కలిసి ఆయన ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం  జరిగిన ఈ  కార్యక్రమంలో వేలాది మంది   పాల్గొని రికార్డు సృష్టించారు.
ఈ నెల 26వ తేదీ వరకు మధ్యం తర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు బండి భగీరథ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌ పై విడుదలయ్యారు.
. ఆ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల కోసం అందుబాటులో ఉన్న వసతులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న పోషకాహార సేవలపై ఆరా తీశారు. కేంద్రంలోని నిల్వల రిజిస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది సరికొత్త ఇండక్షన్ స్టవ్‌పై తయారు చేసిన రాగి జావను సీఎంకు అందించగా.. ఆయన చిన్నారుల పక్కనే కూర్చుని దానిని సేవించారు. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా అంగన్‌వాడీ ఆవరణలో ఒక మొక్కను నాటారు.
2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం హార్దిక్ బౌలింగ్ చేసేందుకు పూర్తిగా ఫిట్‌గా లేడని సమాచారం. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ సారథ్యంలో అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కూడా హార్దిక్ ఆడటం లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పల్నాడు జిల్లా పర్యటనలో ఒక సామాన్య గృహస్థుడిగా మారిపోయారు. స్థానిక రైతు క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే క్రమంలో ఆయన తన సతీమణి భువనేశ్వరికి ఫోన్ చేశారు. చేసి వేరుశనగ నూనె కొనమంటావా అని అడిగారు.
సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్ నిగర్ సుల్తానా 36 పరుగులు, శోభన మోస్తరీ22 పరుగులతో రాణించారు. ఇక చివరి ఓవర్లలో షోర్నా అక్తర్ కేవలం 22 బంతుల్లోనే 5 ఫోర్ల సాయంతో అజేయంగా 39 పరుగులు సాధించడంతో బంగ్లా జట్టు ఆ మాత్రం స్కోరైనా చేరగలిగింది. పాకిస్థాన్ బౌలర్లలో ఫాతిమా సనా రెండు వికెట్లు పడగొట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.