Publish Date:Jul 29, 2024
బిఆర్ఎస్ ప్రభుత్వహాయంలో జరిగిన అవినీతి అక్రమాలకు మాజీ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ముఖ్య భూమిక వహించారు.
జీఎస్టీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సోమేశ్ కుమార్‌ను పోలీసులు 5వ నిందితుడిగా చేర్చారు. ఈ మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పన్ను ఎగవేతదార్లకు సహకరించడంతో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయంటూ ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదయిన విషయం తెలిసిందే. వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వర రావు, డిప్యూటీ కమిషనర్(హైదరాబాద్ రూరల్) శివ రామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కాగా వాణిజ్య పన్నుల శాఖలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేతలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఒక్క తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ ఎగవేత ద్వారా ఏకంగా రూ.1,000 కోట్లకుపైగా నష్టం జరిగినట్టు తెలుస్తోంది. మరో 11 ప్రైవేటు సంస్థలు దాదాపు రూ. 400 కోట్ల పన్ను చెల్లింపులు ఎగవేసినట్టు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు మానవ వనరులను అందించే ‘బిగ్‌లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఏమాత్రం టాక్స్ కట్టకుండానే ఏకంగా రూ.25.51 కోట్ల ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ తీసుకుందని, అవకతవకలు జరిగాయని తేలిన నేపథ్యంలో అంతర్గతంగా విచారణ జరిపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.వాణిజ్య పన్నులశాఖకు సాంకేతికతను అందించే సర్వీస్ ప్రొవైడర్‌గా ఐఐటీ హైదరాబాద్ వ్యవహరించింది. తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్‌ల్లో అక్రమాలను గుర్తించడంతోపాటు డేటాను విశ్లేషించడం సర్వీస్ప్రొవైడర్ చేయాల్సిన పని. పన్నుచెల్లింపుదారుల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన ‘స్క్రూటినీ మాడ్యూల్’ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్‌లీప్ టెక్నాలజీస్ అక్రమాలను ఐఐటీ హైదరాబాద్ అందిస్తున్న ఐఐటీ హైదరాబాద్ ‘స్క్రూటినీ మాడ్యూల్’ కూడా గుర్తించలేకపోయిందని వివరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-key-development-in-the-gst-scam-registration-of-a-case-against-somesh-kumar-39-181692.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.