Publish Date:Sep 23, 2024
హైడ్రా బీద బిక్కి ప్రజానీకం మీద కరుణించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోడికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి పేదల ఇళ్లను ముట్టుకోవడం లేదు. కమర్షియల్ కాంప్లెక్స్ లు, విల్లాలను హైడ్రా కూల్చేస్తుంది. మధ్య తరగతి ప్రజలను కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. కూల్చివేతలకు చట్టబద్దత లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హైడ్రా దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. తాజాగా కూకట్ పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ పరిధిలోని భూములలో నిర్మించిన కట్టడాలు కూల్చివేసినప్పటికీ పేద ప్రజల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. నల్ల చెరువు 27 ఎకరాల్లో ఉంటే ఇందులో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా తేల్చేసింది.
అమీన్ పూర్ లో హైడ్రా అర్ధరాత్రి కూడా కూల్చివేతలు కొనసాగించింది. బాహుబలి మిషన్ ద్వారా పెద్ద భవంతులను హైడ్రా కూల్చివేసింది. మాదాపూర్ లో కూడా సోమవారం కూల్చివేసింది. దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ , బఫర్ జోన్ కూల్చివేతలను న్యాయస్థానం జోక్యంతో నిలుపదల చేసింది.
తొలిసారి హైడ్రా జీహెచ్ ఎంసీ వెలుపల కూడా అక్రమ కట్టడాలను కూల్చేయాలని నిర్ణయించింది. రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద చెరువు, మాసాబ్ చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేయానికి హైడ్రా సిద్దమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/a-hydra-that-does-not-go-to-the-poor-25-185408.html
ఆ పసివాడికి చట్టాలు తెలియవు.. నిబంధనలు అసలే తెలియవు. తెలిసిందల్లా అమ్మానాన్నల ప్రేమ మాత్రమే!
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు నగర పంచాయతీల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎటువంటి పెద్ద అవాంతరాలు
YS Jagan Mohan Reddy, Pulivendula Elections, YS Jagan Protest, YSRCP, Bengaluru, Municipal Elections, Polling Irregularities, Andhra Pradesh Politics, YS Jagan News, Pulivendula Polling
దిల్లీలోని ప్రఖ్యాత కనాట్ ప్లేస్ ప్రాంతంలో దుకాణాలను అధికార భారతీయ జనతా పార్టీ (BJP) బలవంతంగా మూసివేయించిందని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ అక్రమాలు చోటుచేసుకున్నాయని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.