నాన్నకు ప్రేమతో..!
Publish Date:Jun 17, 2022
Advertisement
చేతిలో స్మార్ట్ ఫోన్ వుండాలే గాని సెల్పీలు తీసుకోవడానికి ఎవరూ వెనుకాడరు. సెల్ఫీల పిచ్చి ఈ రోజుల్లో అంతు లేకుండా పోతోంది. అదో సరదా, అదో ఆనందం! సెల్ఫీ గురించి అందరికీ తెలిసిందే గదా, ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నారని అనుకోవద్దు. ఇది చాలా స్పెషల్ సెల్ఫీ! చిత్రంగా ఇద్దరూ ఎదురెదురు రైళ్లలో ఒకరినొకరు చూసుకుని హలో అనుకున్నారు. అయితే అప్పటికి రైళ్లు ఇంకా కదలలేదు. అదేదో స్టేషన్ లో బయలుదేరడానికి సిద్ధంగా వున్నాయి. ఇద్దరూ అనుకోకుండా వేరు వేరు ప్రాంతాలకు ఎదురెదురు మార్గాల్లో వెళుతోన్న రైళ్లలో వుద్యోగ ధర్మంగా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూంటాయి. తన కొడుకు తనలాగే రైల్వేలో వుద్యోగం చేన్నాడని ఆయన తన స్నేహితులకు, బంధువులకు చెబుతూ ఎంతో మురిసిపోయి వుండవచ్చు. కానీ ఈ సెల్పీ ఆయన ఆనందాన్ని మూడింతలు చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతే మన కుర్ర టిటిఇ వెంటనే ఫోన్ తీసి సెల్ఫీ తీసేడు! ఇపుడు అది వైరల్ అయింది! ఈ సెల్పీని సురేష్ కుమార్ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. అయితే తండ్రీ కొడుకులు అలా వూహించని విధంగా ఎదురయి పలకరించుకున్నది సరిగ్గా ఎక్కడ అన్నది, వారు వున్న రైళ్లు ఎటు వెళ్లేవీ ట్వీట్లో చెప్పలేదు. కానీ నెటిజన్లు మాత్రం ఎంతో మెచ్చుకున్నారు. నిజంగా తండ్రి కొడుకుల ప్రేమకు పెద్ద వుదాహరణ అని మనస్పూర్తిగా అభినందనలు తెలిపారు.
తండ్రీ కొడుకుల సెల్ఫీ. తండ్రి ఒక రైల్లో వెళుతూంటే, పక్కనే మరో ట్రాక్ మీద మరో రైల్లో అతని కొడుకు వెడుతూ పలకరించు కున్నారు. ఇద్దరూ రైల్వే ఉద్యోగులే! ఇద్దరూ తెల్ల దుస్తుల్లోనే, యూనిఫామ్ లోనే వున్నారు. కాకుంటే వుద్యోగాలే వేరు వేరు. తండ్రి గార్డ్‌గా చేస్తున్నారు. కొడుకు జూనియర్ టికెట్ ఎగ్జామినర్ అంటే జూనియర్ టి.టి.ఇ!
http://www.teluguone.com/news/content/a-great-selfie-of-son-and-father-in-trains-travelling-opposite-direction-39-137891.html





