ఆటకి వెళ్లిన పిల్లాడు తిరిగివచ్చాడు, ఆఫీసుకి వెళ్లిన నాన్న తిరిగివచ్చాడు, పక్కింటి పిల్లదీ కాలేజీ నుంచి వచ్చేసింది, పూజా గౌడ్ మాత్రం తిరిగి రాలేదు. తల్లికి ఆతృతతో పాటు భయంపట్టుకుంది. ఎవరన్నా కిడ్నాప్ చేశారా? చంపేసారా? అని భయంతో భర్తను తీసుకుని పోలీస్ స్టేషన్‌కి పరుగు తీసింది ఏడుస్తూ. ముంబైలో 2013 జనవరి 22వ తేదీన డిఎన్ నగర్ ప్రాంతంలో ఈ సీన్ అక్కడివారికి ఇంకా గుర్తే. పోలీసుల రికార్డుల్లో ఆ పిల్ల పేరు మిస్సింగ్ గర్ల్ 166! చిత్రంగా 166 పిల్ల పదహారేళ్ల అమ్మాయిగా 2015లో తిరిగి తల్లి వద్దకు వచ్చింది! యావత్ డిఎన్‌నగర్ వాసులూ ఆశ్చర్యపోయారు.. ఇదెలా సాధ్యమని. ఇన్నాళ్లూ ఎటెళ్లిపోయావే పిల్లా అని అడగని అమ్మలక్కలు లేరు.
బడికి వెళ్లిన పిల్లలు, చాక్లెట్లకోసం బయటికి వచ్చిన పిల్లలు ఇలా చాలామంది కనిపించకుండా పోయారు. అదో పెద్ద మిస్టరీగా మారింది. వారిలో కొద్దిమందే పోలీసులకు దొరికారు. మిగతా వారు చని పోయి ఉంటార న్న నమ్మకంతో కేసును దర్యాప్తు చేయడంకూడా మానేశారు. పూజా విషయంలోనూ దాదాపు అదే ఆలోచ నలో ఉన్నారు. అప్పటి ఈ కేసులకు సంబంధించిన ఇన్‌ఛార్జ్ ఏ ఎస్ ఐ రాజేంద్ర భోంస్లే అయితే పూజా తల్లి దండ్రులకు ఆశలు వదులుకోమనే చెప్పారు. ఆయనా వెతికి వెతికి వేసారి అదే నిర్ధారించు కున్నారు. కానీ ఆయన రిటైరయిన తర్వాత పూజా ఎక్కడో బతికే ఉందన్న అనుమానం రానే వచ్చింది. ఏదో ఒకరోజు ఆమె తన తల్లిదండ్రులను చేరుకుంటుందని అంటూం డేవారు. ఇప్పటికీ ఆ పిల్ల స్కూలు ఫోటో తన పర్సులో పెట్టుకునే ఉన్నారు. ముంబైకి వచ్చినపుడల్లా ఈ కేసు సంగతి విచారిస్తూండేవారట.
ఆరోజు పూజ తన అన్న రోహిత్‌తోపాటు స్కూలుకి వెళ్లింది. వాళ్ల అమ్మమ్మ ఇచ్చిన పాకెట్ మనీ కోసం అక్కడ ఇద్దరూ గొడవపడ్డారు. రోహిత్‌కి కోపం వచ్చి దూరంగా ఎటో వెళిపోయాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన హారీ డిసౌజా, అతని భార్య సోనీ ఈ పిల్లని చూశారు. డి సౌజా ఎలక్ట్రీషియన్. పిల్లకి ఐస్ క్రీమ్ కొనిచ్చి మరి ఏమి చెప్పి మాయ చేశారో తెలీదు గాని పూజా స్కూలు గేటు లోపలికి వెళ్లే లోపలే ఆమెను తీసికెళిపోయారు. వారికి సంతానం లేదు. ఆ తర్వాత ఏం జరిగిందో, వారు ఆమెను ఎలా పెంచారన్నదీ ఎవరికీ తెలీదు. పోలీసులకీ తెలీదు. మరి ఆమె 15 ఏళ్ల అమ్మాయిలా ఇంటికి ఎలా చేరిందనేది ఇప్పటికీ మిస్టరీయే. పిల్ల ఇంటికి వచ్చేసిందన్న ఆనందంలో ఆ ప్రశ్నలకు తల్లిదం డ్రులు, చుట్టుపక్కలవారూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/7yr-kid-returned-as-15yr-girl-39-141386.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.