డెల్టా డెత్ గేమ్ స్టార్ట్.. 500 చిన్నారులు మృతి.. 

Publish Date:Jul 26, 2021

Advertisement

ఒకటి కాదు రెండు కాదు. ఒకే  వారంలో ఏకంగా  500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయసు  ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. గత వారంలో 500మంది చిన్నారుల మృతి చెందగా, 50వేల కొత్త కేసులు..ఇండోనేసియా దేశం ఏషియాలోనే డెల్టా వేరియంట్ కే కేంద్రబిందువుగా మారిందా? అంటే అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. అక్కడ రోజురోజు పెరుగుతున్న కేసులు, చావు బతుకలతో బెంబేలెత్తిపోతోందా? ఇండోనేసియాలో కోవిడ్ పేనిక్ సిట్యువేషన్ ఎలా ఉంది?  డెల్టా వేరియంట్ లో-  ఇప్పటికే 27 లక్షల కేసులు వచ్చాయి. అది అలా ఉంచితే  ఒక్క వారంలో 50 వేల కేసులు నమోదు అవ్వడం. ఈ దేశం తన రికార్డులను తానే అధిగమిస్తూ తన చావు తానే ఒంటరిగా ఎదుర్కుంటున్న దేశం ఏదైనా ఉందంటే అది ఇండోనేసియా అని చెప్పాలి.  ఇక్కడ చాలా మంది పరిస్థితి ఏంటంటే.. కరోనా ఒక వైపు కరోనా వచ్చాక ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు అక్కడి ప్రజలు.  ఇలాంటి డెల్టా డెత్ సమాచారం అందుకుంటున్న సిబ్బంది గతంలో ఒకటీ రెండు మాత్రమే దహన సంస్కారాలను చేసేవారు. అదే ఇప్పుడు.. రోజుకు 24 వరకూ అంత్యక్రియలు చేస్తున్నారంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు.

ఆక్సిజన్ కొరత, కోవిడ్ మరణాలు, ప్రాణాధార ఔషధాల అందలేకపోవడంతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. అంత వల్లకాడులా మారుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితుల నుంచి కొంత వరకు భారత్ బయటపడిందనే చెప్పాలి. అయితే గతంలో  భారత్ ఎదుర్కొన్న పరిస్థితిని ఇప్పుడు ఇండోనేషియాలో కనిపిస్తోంది. కరోనా మహమ్మారి విలయతాండవం, అక్కడ కరోనా యముడు ప్రజల ప్రాణాలతో శివతాండవం చేస్తుంది. అయితే ఇప్పుడు సంభవిస్తున్న మరణాల్లో  ఎక్కువ శాతం చిన్నారులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ కరోనా విడతల వారీగా ప్రజలపై తన ప్రభావం చూపిస్తుంది. గతం లో వయసు పై బడిన వారిపై ..ఆ తర్వాత యువకులపై నుంచి ఇప్పుడు ఏకంగా చిన్నారలను కబళిస్తుంది. చిన్నారులను  ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకీ పిల్లల్లో కరోనా మరణాల రేటు పెరిగిపోతోంది. వందలాది మంది చిన్నారులు కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోతూ.. స్మశానాల్లో కాలుతున్నారు.  ఇండోనేషియాకు చెందిన వందలాది మంది చిన్నారులు  కోవిడ్ మహమ్మారికి చిక్కి చనిపోయారు. వారిలో చాలా మంది ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారే కావడంతో దేశ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఇండోనేషియాలో పిల్లల్లో కోవిడ్ మరణాల రేటు ఇతర దేశాల కంటే ఎక్కువగా నమోదైంది. ఇక్కడ జూలై నెలలో వారానికి 100 కన్నా ఎక్కువ కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. ఇండోనేషియాలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో ఇదే ఎక్కువ అని అక్కడి అధికారులు అంటున్నారు. పిల్లల మరణాల సంఖ్య పెరుగుదల ఆగ్నేయాసియాలో డెల్టా వేరియంట్ కేసులతో సమానంగా ఉందని ఆ నివేదిక వెల్లడించింది. ఇండోనేషియా ప్రభుత్వం దేశీయ మొత్తం జనాభాలో దాదాపు 50వేల కొత్త కేసులు నమోదు కాగా.. 1,566 మరణాలు నమోదయ్యాయి.

శిశువైద్యుల ఇచ్చిన నివేదికల ప్రకారం.. ఆ దేశంలో కోవిడ్ కేసులలో మునుపటి నెలతో పోలిస్తే… చిన్నారులు 12.5శాతంగా ​ఉన్నారు. జూలై 12న కరోనాతో 150 మందికి పైగా చిన్నారులు చనిపోయారు.  గత వారంలో 500 మంది చిన్నారులు కరోనాతో మృతి చెందారు. ఇటీవల 5ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో సగం మంది కరోనా కోరల్లో చిక్కి మృతి చెందారు. మొత్తంమీద.. ఇండోనేషియాలో 3 మిలియన్లకు పైగా కోవిడ్ కేసులు నమోదుకాగా, 83వేల మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది నుంచి ఇండోనేషియాలో 18ఏళ్ల కంటే తక్కువ వయస్సులో 800 మందికి పైగా చిన్నారులు కరోనా రక్కసికి చిక్కారు.

కోవిడ్ మరణాలలో ఎక్కువ భాగం గత నెలలోనే నమోదయ్యాయని ఆ దేశ వైద్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. దేశంలో తక్కువ టీకా రేటు కూడా దీనికి కారణమనేది ఇక్కడి వారి రిపోర్టులో వెల్లడైంది. ఇండోనేషియాలో కేవలం 16శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందినట్లుగా తెలుస్తోంది. మరో 6శాతం మందికి మాత్రమే రెండో డోస్ వేయించుకున్నవారి సంఖ్య ఉంది. కోవిడ్ కేసుల పెరుగుదల కారణంగా ఆస్పత్రులన్నీ వైరస్ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా సోకిన చిన్నారుల సంరక్షణ కోసం కొన్ని ఆస్పత్రులను ప్రత్యేకంగా  ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ పిలలను రక్షించుకునేందుకు వారి ఉరుకులు పరుగులు చూస్తుంటే మరింత ఆందోళన కలిగిస్తోంది. ఏ దేశానికైనా విపత్తు వచ్చినప్పుడు మన దేశం ఎప్పుడు ముందే ఉంటుంది.. మన దేశం ఎప్పుడు ముందే ఉంటుందని మరో నిరూపించింది. తాజాగా భారత్ తన మిత్ర దేశానికి చేయూతనిస్తోంది. ఇప్పటికే 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 100 మెట్రిక్ టన్నుల ద్రవరూప మెడికల్ ఆక్సిజన్ ను ఇండోనేషియాకు పంపించింది. భారత నావికాదళానికి చెందిన ఓ నౌకలో వీటిని ఇండోనేషియా రాజధాని జకార్తా తరలించారు.

By
en-us Political News

  
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తానేదో పెద్ద రాజకీయవేత్త అన్నట్టుగా బిల్డప్పు ఇస్తుంటారుగానీ, ఆయన నడిపేవి దిక్కూమొక్కూ లేని రాజకీయాలు.
నిజామాబాద్ లో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ ఆరితేరిన ఉద్ధండులే! ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్ని బ‌ట్టి చూస్తే ఓటర్లు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వలేదు! ఏడు సెగ్మెంట్లలో మూడు చోట్ల‌ బీఆర్‌ఎస్‌ గెలిస్తే.. కాంగ్రెస్‌, బీజేపీ రెండేసి చొప్పున పంచుకున్నాయి! పార్లమెంటు ఎన్నికల్లో ఇప్పుడు మూడు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి!
ఏడు విడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రెండో విడత పోలింగ్ ఈ రోజు ఉదయం మొదలైంది. కేరళలోని మొత్తం 20 లోక్ సభ స్థానాలకూ, కర్నాటకలో 14, రాజస్థాన్ లో 13, మహారాష్ట్ర, యూపీలలో ఎనిమిదేసి స్థానాలకు, మధ్య ప్రదేశ్ లో 7, బీహార్, అసోంంలలో ఐదేసి, చత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ లో రెండేసి స్థానాలకూ ఈ రోజు పోలింగ్ జరుగుతోంది.
అమాయ‌కమైన ముఖం పెట్టి అబ‌ద్ధాలను అల‌వోక‌గా చెప్ప‌డంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి మించిన రాజ‌కీయ నేత మ‌రొక‌రు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైన‌.. సొంత చెల్లెళ్ల‌పైన‌కూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా చేస్తూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ దిట్ట.
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం (ఏప్రిల్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
తనను తాను తగ్గించుకునే విషయంలో జగన్ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సొంత చెల్లెలి చీరలపై కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన ప్రత్యర్థులను కూడా ఆశ్చర్య పరుస్తున్నారు. వివేకా హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సొంత బాబాయ్ కుమార్తె సునీతారెడ్డిపై వైసీపీ సోషల్ మీడియా ఇష్టారీతిగా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోవడం అటుంచి వాటిని సమర్ధిస్తూ మాట్లాడి తన స్థాయి ఏమిటో తానే చెప్పుకున్నారు.
జగన్ పాపం ఏం మాట్లాడినా నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన భాష, ఆయన మ్యానరిజమ్స్ చివరాఖరికి గాయానికి ఆయన వేసుకున్న బ్యాండ్ ఎయిడ్ ఇలా జగన్ విషయంలో ట్రోలింగ్ కు కాదేదీ అనర్హం అన్నట్లుగా నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ఆటాడుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, అలాగే తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 13న జరగనున్న సంగతి తెలిసిందే.
గత ఎన్నికల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేదిగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో బాబాయ్ ని హత్య చేశారంటూ విపక్షంపై ఆరోపణలు గుప్పించడం ద్వారా సానుభూతి వర్షించి జగన్ పార్టీ విజయానికి దోహదపడిన వివేహా హత్య కేసు.. ఐదేళ్లు గిర్రున తిరిగేసరికి జగన్ కు చుట్టుకుంది.
సినీ గేయ రచయత జొన్నవిత్తుల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేశారు. సినీ రంగం నుంచి జొన్నవిత్తుల కంటే ముందు ఎందరో రాజకీయాలలోకి ప్రవేశించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.