లేటెస్ట్ సర్వే.. మోదీకి సరైన ప్రత్యర్థి రాహుల్ గాంధీనే
Publish Date:Aug 21, 2018
Advertisement
రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి ఏంటి అంటూ అప్పట్లో ఛలోక్తులు వినిపించాయి.. కానీ రాహుల్ వాటన్నింటికీ తన చర్యలతోనే సమాధానం చెప్పారు.. రాహులే, మోదీకి ధీటైన అభ్యర్థి అని కొందరు కాంగ్రెస్ నేతలు నమ్మారు.. రాహుల్ ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అవిశ్వాసపై చర్చ సందర్భంగా పార్లమెంట్ లో స్పీచ్ అదరకొట్టారు.. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లోనే కాదు, ప్రజల్లో కూడా రాహుల్ మీద నమ్మకం పెరిగింది.. తాజాగా ఓ సర్వే కూడా ఇదే చెప్పింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి సరైన ప్రత్యర్థి ఎవరని, జాతీయ చానల్ ‘ఇండియా టుడే’ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ అనే సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో మోదీకి సరైన ప్రత్యర్థి రాహుల్ గాంధీయేనని 46 శాతం మంది తేల్చి చెప్పారు.. 2016తో చూసుకుంటే రాహుల్ పాపులారిటీ చాలా పెరిగింది.. అప్పట్లో నిర్వహించిన సర్వేలో రాహుల్కు మద్దతుగా కేవలం 23శాతం ఓట్లే రాగా, ఈ సారి రెండితలు పెరిగి 46 శాతానికి చేరుకుంది.. ఈ రెండేళ్లలో రాహుల్ ఎంత పాపులారిటీ సంపాదించారో దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు.. రాహుల్ గాంధీకి మద్దతుగా ఓటేసిన వారిలో 47 శాతం మంది ముస్లీంలు కాగా 45 శాతం మంది హిందువులు ఉన్నారు.. ఇక దక్షిణ భారతదేశం నుంచి రాహుల్కు గట్టి మద్దతు ఉంది.. రాహుల్కు వచ్చిన ఓట్లలో 56 శాతం దక్షిణాది వారే కావడం గమనార్హం.. ఇక ఈ సర్వేలో మమతా బెనర్జీ 8శాతం, పి.చిదంబరం 6శాతం, ప్రియాంక గాంధీ 6శాతం, అరవింద్ కేజ్రీవాల్ 4శాతం, అఖిలేష్ యాదవ్ 4శాతం, మాయావతి 2శాతం ఓట్లు సాధించారు.
http://www.teluguone.com/news/content/46-percent-say-rahul-gandhi-best-alternative-to-narendra-modi-in-2019-39-83210.html





