తెలుగోడి ఆత్మగౌరవం నినాదానికి 43 ఏళ్లు

Publish Date:Mar 29, 2025

Advertisement

అన్న నందమూరి తారకరామారావు ఆత్మగౌరవం నినాదంతో  జన్మించి, విజనరీ నారా చంద్రబాబునాయుడు  చేతుల్లో రూపు దిద్దుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి  43 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది. తెలుగుదేశం పిలుస్తోంది.. రా.. కదలిరా నినాదంతో ఎన్టీఆర్ 1982 మార్చి 29న స్థాపించిన పార్టీ తెలుగు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల అతిగతి మార్చేసింది. ఎన్టీఆర్ తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగు వారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి  తెలుగుదేశం  చరిత్ర సృష్టించింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎగతాళి మాటలకు ఎన్టీఆర్ గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఏపీలోని 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని తొలిసారే లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించి చరిత్ర సృష్టించింది. 1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకుని కాంగ్రెస్ హవా కొనసాగిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం ప్రభంజనం సృష్టించింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తరువాత తొలిసారి ప్రవేశపెట్టిన  రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం పేదవాడి కడుపు నింపుతూ.. అన్ని పార్టీలకూ ఆదర్శ మైంది. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ రూపుమాపి, మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన టీడీపీ రాజకీయ ఓనమాలు తెలియని వారిని లీడర్లుగా తయారు చేసి పొలిటికల్ యూనివర్సిటీగా పేరు గాంచింది. 

పేద ప్రజల గుండెలలో ఛిర స్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజ పరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ, యుగపురుషుడు నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది ఆయనకు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఇందిరాగాంధీ సాయంతో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుగోడి ఆవేశాన్ని, చైతన్యాన్ని యావత్తు ప్రపంచం చూసింది. అప్పట్లో పార్టీ నేతలను సమన్వయపరుస్తూ, ప్రజాందోళనలతో కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చిన చంద్రబాబునాయుడు తన రాజకీయ చాణక్యాన్ని చాటుకున్నారు. 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200కి పైగా స్థానాలతో ఎన్టీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కించడంలో సీబీఎన్ కీరోల్ పోషించారు. 

1994లో టీడీపీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి పెత్తనం కారణంగా పార్టీలో ఎన్టీఆర్ శకం ముగిసి, చంద్రబాబు మార్క్ మొదలైంది. జాతీయ రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం వీపీ సింగ్‌ను ప్రధానిని చేసి కాంగ్రెస్ ఆధిపత్యానకి గండి కొట్టగలిగింది. 1998లో టీడీపీ హయాంలో చంద్రబాబు విజన్‌తో సాంకేతికత పరుగు పెట్టడం ప్రారంభించి, సైబర్ టవర్స్‌తో హైటెక్ సిటీకి అంకురార్పణ జరిగింది. 1999లో టీడీపీ నాలుగోసారి అధికారంలోకి వచ్చినప్పుడు హైటెక్ స్పీడ్‌తో అభివృద్ధి పరుగులు పెట్టి, చంద్రబాబుకి హైటెక్ సీఎం బ్రాండ్ ఇమేజ్ సాధించిపెట్టింది.

 తర్వాత పదేళ్లు టీడీపీ అధికారానికి దూరమవ్వడం, రాష్ట్ర విభజన జరగడం, చంద్రబాబు రెండు ప్రాంతాలు ముఖ్యమేనంటూ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకోవడంతో  తెలుగుదేశం పనైపోయిందని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. అయితే రాజధాని లేకుండా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి కాముకుడు, హైటెక్ దార్శనికుడు చంద్రబాబునే నెత్తినపెట్టుకుని, 2014లో తెలుగదేశానికే అయిదో సారి పట్టం కట్టారు. అటు తెలంగాణలోనూ రాష్ట్ర విభజన తర్వాత 12 ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం గెలుచుకున్న టీడీపీ ఉనికి చాటుకోగలిగింది. ప్రస్తుతం ఏపీలో ఆరో సారి రికార్డు మెజార్టీతో గెలిచిన టీడీపీ నుంచి చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ , అటు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారులో కీరోల్ పోషిస్తూ తెలుగువాడి ఆత్మాభిమానాన్ని చాటుతున్నారు.

 మొత్తం 43 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఆరు సార్లు అధికారంలోకి వచ్చి, కేవలం నాలుగు సార్లు మాత్రమే అధికారానికి దూరమైందంటే ఆ పార్టీ ప్రజల మనస్సుల్లో ఎంతగా పాతుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు రెండు తెలుగురాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొని, జై ఎన్టీఆర్, జైజై చంద్రబాబు అన్న నినాదాలు హోరెత్తాయి.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.