29 రకాల వంటకాలు.. నాన్ వెజ్ స్పెషల్! గులాబీ ప్లీనరీలో ఘుమఘుమలే..

Publish Date:Oct 22, 2021

Advertisement

తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లినరీకి సర్వం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ ప్లీనరీని సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎందుకే రెండేండ్లకోసారి జరిగే గులాబీ పండుగ భారీ స్థాయిలో జరుగుతుంది. టీఆర్ఎస్ ప్లీనరీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వంటకాలే. ప్రతి ప్లీనరీలోనూ అతిథులకు వడ్డించే భోజనమే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు సీఎం కేసీఆర్. 

అక్టోబర్ 25న హైటెక్స్ లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఏర్పాట్లు భారీ ఎత్తున సాగుతున్నాయి. కుకింగ్ సెక్షన్ ఇప్పటికే సన్నాహాలు చేసేస్తోంది. ఈసారి ప్లీనరీలో మాంసాహార వంటకాలనే ఎక్కువగా వడ్డించనున్నారు. ఫుడ్‌ కమిటీ ఇన్‌చార్జిగా కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. ఆయన  ఆధ్వర్యంలో ఈసారి 29 రకాల వంటలను సిద్ధం చేయబోతున్నారు. ఒకేసారి 8 వేల మంది అతిథులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళలకు వేర్వేరుగా భోజనశాలలను సిద్ధం చేస్తున్నారు.

ప్లినరీలో మెన్ ఇదే.. 

ధమ్‌ చికెన్‌ బిర్యానీ, మటన్‌ కర్రీ, నాటుకోడి పులుసు, పాయాసూప్‌, బోటిఫ్రై, ఎగ్‌ మసాలా, రుమాల్‌ రోటి, ఆలూ క్యాప్సికం, బగారా రైస్‌, వెజ్‌ బిర్యానీ, వైట్‌ రైస్‌, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, బెండకాయ కాజు ఫ్రై, దాల్‌రైస్‌, పాలకూర మామిడికాయ పప్పు, పచ్చి పులుసు, ముద్ద పప్పు, సాంబారు, ఉలవచారు+క్రీమ్‌, పెరుగు, వంకాయ చట్నీ, వెల్లుల్లి జీడిగుల్ల అవకాయ, బీరకాయ టమోటా చట్నీ, పాపడ్‌, వడియాలు, జిలేబీ, డబల్‌ కా మీఠా, ఐస్‌ క్రీం, గ్రీన్‌ సలాడ్‌, బటర్‌ రైస్‌, డ్రై ఫ్రూట్స్‌, కారా, బూంది, లడ్డూ, చాయ్‌ అందివ్వనున్నారు. 

ప్లీనరీకి వచ్చే ప్రతినిధులు, కార్యకర్తలకు రుచికరమైన భోజనం అందిస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. సుమారు 15 వేల మందికి వెజ్‌, నాన్‌వెజ్‌ వంటల రుచి చూపించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇందుకోసం చెయ్యి తిరిగిన 500 మందిని నియమిస్తున్నామన్నారు. వాలంటీర్లు, ప్రత్యేక సిబ్బందితో ఒకేసారి 8 వేల మంది భోజనాలు చేసేలా చూస్తున్నామని తెలిపారు ప్లీనరీ ఫుడ్ ఇంచార్జ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. 
 

By
en-us Political News

  
కుప్పంలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న భరత్ అనవసరపు ఆత్రం ప్రదర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలోని పలు కేంద్రాల్లో వైకాపా గూండాలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళి తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్లను బెదిరిస్తున్నారు.
సినీ హాస్యనటుడు బ్రహ్మానందం ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఎఫ్ఎన్సీసీలో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను పలకరించారు. ఓటర్లకు ఏం చెబుతారు?
తెలంగాణలో పోలింగ్ ఈ సారి పుంజుకుందనే చెప్పాలి. సార్వ్రతిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాలలో పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 52.32 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
3 గంటలకు ఏపీలో 55.49 శాతం పోలింగ్
 ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాకు తన వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఓటు వేశానని, అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంట్లో కూర్చోకుండా పోలింగ్ బూత్ లకు రావాలని అన్నారు. యువత, చదువుకున్న వాళ్లు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారని... ఇది శుభ పరిణామని చెప్పారు. 
deputy cm mallu cast vote, khammam, madhira, weapon,
బీజీపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మూడు పార్టీలు కూడా ఈ ఎన్నిక‌ల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ సరళిని గమనిస్తున్న ఈ మూడు పార్టీలు తమ విజయావకాశాల పైన అంచనాలు వేస్తున్నాయి. మూడు పార్టీల నేతలు పోలింగ్ సరళి పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉందనే అంశం పైన ఆరా తీస్తున్నారు.
ఎక్కడ చూసినా వైసీపీ మూకలు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారు. గెలుపు ఆశలు వదిలేసుకున్న వైసీపీ హింసాకాండతో పోలింగ్ సజావుగా సాగకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా బరి తెగించేస్తోంది.
ఏపీలో 2 గంటల వరకు 50 శాతం పోలింగ్
​తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్ మీద ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైసీపీ మూకలు దర్శిలో రెచ్చిపోయాయి. మండల పరిధిలోనే బొట్ల పాలెం గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థిపై వైసీపీ గూండాలు కత్తులు, కర్రలతో దాడికి యత్నించారు. రెండు రోజుల కిందట తెలుగుదేశం కార్యకర్తపై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.
మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం లచ్చంబాయి దగ్గర తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్ మీద వైసీపీ గూండాలు దాడి చేశారు. కాన్వాయ్‌లోని ఒక కారుకు నిప్పు పెట్టారు. 
హైదరాబాద్ లోకసభ బిజెపి అభ్యర్థి మాధవిలతపై ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు కేసు నమోదైంది. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆజంపురా పోలింగ్ బూత్ లోకి నేరుగా ప్రవేశించి ముస్లిం మహిళ వోటరు బురఖాను తొలగించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.